రామ ప్రతిష్ఠ - వరద ముంపు
నాగాయలంక లాంచీరేవు గట్టున సంతరోజు చేపల తట్టలు, గడ్డి మూటలు పెట్టుకుని అమ్ముకునేవారు. అక్కడి నుండి లాంచీలమీద సుమారు వేయి మంది పెనుమూడి మీదుగా గుంటూరు జిల్లాకు పోతారు. దాదాపు వేయి మంది అక్కడికి వస్తారు.
అలాంటి తావులో భగవంతుడు జ్ఞాపకం వస్తే బాగుంటుందని తోచి, స్వహస్త పరహస్తాలతో శ్రీ కోదండరామాలయం, రమాసహిత సత్యనారాయణ ఆలయం రెండూ నిర్మించడం జరిగింది. జయిపూర్ నుండి చలువరాతి విగ్రహాలు తెప్పించాము. 1964 మే నెల 31 తేదీ నాటికి ప్రతిష్ఠకు ముహూర్తం నిశ్చయించాము. అందుకు సమస్తమైన ఏర్పాట్లు జరిగాయి.
ఇంతలో, కంచి పెద్దస్వాములు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి షష్టిపూర్తి మే నెల 25వ తేదీన కంచికి మూడుమైళ్ళ దూరంలో అంబి గ్రామంలో జరుగుతుందని తెలిసింది. నేను మా శిష్యుడు తుంగల నాగభూషణం ఇద్దరం బయలుదేరిపోతూ, 31వ తేదీ ప్రతిష్ఠ నాటికి తప్పకుండా వస్తామని, ప్రతిష్ఠకు పూర్వం జరగవలసిన అధివాసాదులు చేసి సిద్ధంగా ఉండండని చెప్పి, మేము అంబికి బయలుదేరాము. అప్పుడు అక్కడికి శ్రీ మండలీక వెంకటశాస్త్రి, శ్రీ కుప్పా లక్ష్మావధానులు, శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి గార్లు కూడా వచ్చారు.
షష్టిపూర్తి రోజున మాకెవరికీ స్వామి వారి తీర్థం దొరకలేదు. ఆ మర్నాడు 26వ తేదీ తీర్థం పుచ్చుకుందా మనుకున్నాము. ఆనాడే నేను స్వామి దర్శనం చేసింది. అంతకు పూర్వం నేనెన్నడూ చూడలేదు. నేను తీర్థానికి చెయ్యి చాచాను. స్వామి నాకు తీర్థమిచ్చి, చేతిలో ఉన్న పెద్ద ఉద్ధరిణె కింద పెట్టి, “ప్రతిష్ఠ ఎప్పుడు?” అని అడిగారు. నేను నిర్ఘాంతపోయాను. “మా ఇంట్లో మందిరంలో ఎప్పుడో అయింది” అన్నాను. “అది కాది. నది ఒడ్డున ఏర్పాటుచేశావే, ‘రామ పాద క్షేత్రం’ అక్కడి ప్రతిష్ఠ” అన్నారు.
“దానిని మే 31వ తేదీన చేద్దామని అనుకున్నాము” అన్నాన్నేను.
స్వామి వారు వెంటనే “31వ తేదీన చేస్తారా?” అని అన్నారు
స్వామి ప్రశ్నార్థకంగా అన్న మాటలో ఆ రోజున ప్రతిష్ఠ జరగదనే ధ్వని వినిపించింది.
స్వామి మాకు అక్షింతలు, కుంకుమ, కిస్మిస్ పండు ప్రసాదంగా ఇచ్చి, యంత్రానికి ప్రత్యామ్నాయంగా వాటిని విగ్రహాల కింద ఉంచందని సెలవిచ్చారు.
ఇంతలో 28-5-1964న ప్రధానమంత్రి నెహ్రూ గారు పరమపదించారు. అందుచేత ఆనాడు రైళ్ళు, బస్సులు నడవలేదు. 29వ తేదీ బయలుదేరి 30వ తేదీ సాయంత్రానికి మేము ఊరు చేరుకున్నాము. మేము ఊరిలో లేనందున ‘గురువుగారు లేని ప్రతిష్ఠా’ అంటూ గ్రామస్తులు ఏ పనీ మొదలుపెట్టలేదు. అందుచేత మళ్ళా జూన్ 11వ తేదీన ప్రతిష్ఠకు ముహూర్తం పెట్టి ఆపని నిర్వహించాము. స్వామివారన్నది నిజమైంది.
మరొక విచిత్రమేమంటే, స్వామివారాస్థలాన్ని ‘రామపాదక్షేత్ర’మని ఎందుకన్నారు? తరువాత రెండు నెలలకు నాగార్జునడాము విరిగి కృష్ణానదికి అంతులేని వరద వచ్చింది. అప్పుడు ఆ వరద నీరు గుడిలో శ్రీరామపాదాల నంటి తగ్గిపోయింది. ఆ వరద ఇంకో అంగుళం పెరిగినట్టయితే దివితాలూకాలో 70 గ్రామాలు వరదకు కొట్టుకుపోయేవి.
వారికి భూత భవిష్యత్ వర్తమానములు అన్నీ తెలుసు. వారు కాలమునకు లొంగని కాలాతీతులు.
--- శ్రీరామ శరణ్ కుందుర్తి వెంకట నరసయ్య

అపార కరుణాసింధుం 
జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం 
ప్రణమామి ముదావహం !!

కామకోటి పీఠంలో 16-18 వ తేదీ వరకూ పరమాచార్య ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి... మన సత్సంగంలోనూ ఆ స్పర్శ ఉండాలనే ఉద్దేశ్యంతో, చంద్రశేఖరేంద్రుల ఆశీర్వచనం ఎల్లప్పుడూ మనకి ఉండాలనీ వారికి సంబంధించి కొన్ని విషయాలు పంచుకునే ప్రయత్నం... వీలైన అందరూ అటువంటి విషయాలు అందరితో పంచమనవి...

1961వ సంవత్సరంలో..... నడిచే దేవుడు, మహాస్వామి జగద్గురు పరమాచార్యా శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామి వారు, దక్షిణదేశం లోని చిదంబర యాత్ర ముగించుకుని, దాని సమీపంలోని తాండవన్ పురం అనే గ్రామానికి చేరారు. స్వామివారికి ఆ గ్రామస్తులు, పండితులు ఘన స్వాగతం పలికారు. ఆ గ్రామంలోని  కామాక్షి అమ్మవారి అతి పురాతనమయిన ఆలయంలో పూజలు నిర్వహించిన పిమ్మట, స్వామి వారు, ఆ ఆలయప్రాంగణం లోని మహామంటపంలో చేరిన భక్త సమూహానికి ' చిదంబర రగస్యాన్ని (రహస్యాన్ని) ' వివరిస్తున్నారు. 

సభకు సమీపంలో,  బిగ్గరగా అరుస్తూ, అల్లరి చేస్తూ ఆటలాడుకుంటున్న కొందరు బాలురుని వారించడానికి వెళ్ళుతున్న ఆలయ సిబ్బందిని పిలిచి " ఆ పిల్లలను నా వద్దకు తీసుకు రండి " అని చెప్పారు పరమాచార్య .  భయం భయం గా వచ్చి చేరిన ఆ పిల్లలకు తెల్లకాగితాలు ఇచ్చి, " మీ అందరూ ' శ్రీ రామాయ నమః ' అని నూరు సార్లు వ్రాసి నాకు చూపించండి....మీ అందరికీ మంచి బహుమతులు ఇస్తాను " అన్నారు మహాస్వామి. 

పిల్లలందరూ, స్వామి వారు చెప్పినట్టుగా, బుద్ధిగా వ్రాస్తూ కూర్చోడంతో, స్వామి ప్రశాంతంగా ప్రజలకు ' చిదంబర రహస్యాన్ని' విప్పి చెప్పారు. అనంతరం ఆ బాలురు ఒక్కోకరుగా వారు రాసిన పత్రాలను స్వామికి సమర్పిస్తున్నారు. పిల్లల చేత స్వామివారు, వారు వ్రాసిన ' శ్రీ రామాయ నమః ' అనే పదాన్ని ఒక్కసారి చెప్పించి మరీ ఆ పత్రాన్ని తీసుకుంటూ, వారికి కామాక్షీ అమ్మవారి బంగారు ముద్రను బహుకరిస్తున్నారు. ఆ వరుసలో వచ్చిన ఓ పది - పదకండేళ్ళ పిల్లాడి వద్ద కూడా పత్రాన్ని తీసుకుని " సొల్లు (చెప్పు) ....' శ్రీ రామాయ నమః '....సోల్లూ " అని, తానూ వ్రాసింది పలకమంటున్నారు స్వామి. కానీ ఆ పిల్లవాడు పలకడంలేదు. బిక్కమొఖం వేసుకుని స్వామి వారి వంక భయంగా చూస్తున్నాడు. 

ఆ భగవంతుని తప్ప మరేవ్వరనీ తాకని ఆ స్వామి, ఆ పిల్లవాడి అరచేతులను గట్టిగా పట్టుకుని, ఆ అరచేతుల్ని తమ బ్రోటని వ్రేళ్ళతో గట్టిగా రాపిడి కలుగజేస్తూ " సొల్లు.....శ్రీ రామాయ నమః ...." అంటూ, ఆ పిల్లవాడి వైపు తీక్షణంగా చూస్తున్నారు. ఆ ఊరి పండితులు  " అయం మూకః ( అతడు మూగవాడు ) " అని స్వామికి చెప్పారు. అయినా అవేమి పట్టించుకోని ఆ స్వామి " సొల్లు.....శ్రీ రామాయ నమః " అని పిల్లాడి వైపు చూస్తూ బిగ్గరగా అరిచారు. 

పిల్లవాడు భయంతో గజగజా వణికి పోతున్నాడు....కళ్ళ వెంట నీరు ధారగా ప్రవహిస్తోంది. ఆ ఆలయంలో ' sweeper ' గా పనిచేసే ఆ పిల్లవాని తండ్రి, అతని తల్లీ, మిగతా భక్త జనం, పండిత సమూహం, స్వామివారి శిష్యులూ....ఇలా అంతా కళ్ళప్పగించి, చేతులు జోడించి జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయారు.            

" సీ..... లా....మా నమ " భయంతో వణికిపోతున్న పిల్లవాడు, తన జీవితంలో పలికిన మొట్ట మొదటి మాట.
 " శ్రీ రామాయ నమః .... " ( మళ్ళా మళ్ళా చెప్పిస్తున్నారు స్వామివారు. )    
" సీ రామా నమ " ( ఇంతకు మించి చెప్పలేను అంటున్నాడు పిల్లవాడు.) 
 " శ్రీ రామాయ నమః " ( నువ్వు అందుకునే వరకూ వదలనంటున్నాడు పరమాచార్యుడు.)
" సీ రామాయ నమః " ( నేనూ మాట్లాడగలుగుతున్నాను...)
" శ్రీ రామాయ నమః " (పాప ప్రక్షాళన జరిగిపోయింది, ఇప్పుడు నీవేమైనా చెయ్యగలవు....)  
" శ్రీ రామాయ నమః " ( నడిచొచ్చిన దేవుడా ....ఎప్పటికీ నిన్ను వదలక పట్టెద....)

అంతే.... ఒక్కసారి కళ్ళముందు జరుగుతున్నది నమ్మలేక మూగబోయి....అంతలోనే తేరుకుని సంభ్రమాశ్చర్యాలతో గొల్లు మంది జనవాహిని. ఆనందంలో తల్లి స్పృహకోల్పోగా, తండ్రి పరుగున వెళ్ళి పరమాచార్యుని పాదాల పై పడ్డాడు. మూకుమ్మడి సాష్టాంగ నమస్కారాల మధ్య ఆ దేవుడు నడుస్తూ, అందరినీ దీవిస్తూ, తమ వ్యాను వైపుకు వెళ్ళుతుంటే....వారి పాదముద్రల మధ్య మన్నునే వీభూదిగా స్వీకరించి ఆనందంలో తాండవించింది...ఆ ' తాండవన్ పురం '.      

-మంచి కుటుంబం వారి వద్దనుండి తీసుకున్నది  [అయ్యంగారి సూర్య నాగేంద్రకుమార్]

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
ఇరవైనాలుగుకోట్ల రామనామ జపలక్ష్యంగా ఈ సంవత్సరం జరిగిన హనుమద్రక్షాయాగం ఆరవ ఆవృత్తి మరో మూడు రోజుల్లో పూర్తి కానుంది. శుక్రవారం హనుమజ్జయంతి సంధర్భంగా స్వామికి అభిషేకాదులు, 24న పూర్ణాహుతి నిర్వహించడం జరుగుతోంది .ఈ సంవత్సరం రోజుల్లో ఆ స్వామి ఎప్పటిలాగే చాలా లీలలు కనబరిచారు. అందులో ఒకటి,
నేను ఇంతకుముందు పని చేసిన సంస్థలో నా సహోద్యోగికి ఒక సమస్య వచ్చింది. సంవత్సరం క్రితం  తనకు ఒక పెళ్ళి సంబంధం వచ్చింది. సరే చూద్దాం అనుకునే లోపు వారి వైపు పెద్దవాళ్ళు ఒకరు చనిపోయారు. దాంతో సంవత్సరం వరకు వాయిదా వెయ్యాల్సి వస్తుంది అన్నారు. పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు మాకేమీ అభ్యంతరం లేదు అన్నారు. ఇక పెళ్ళి మాటలు ఏమీ మాట్లాడుకోలేదు ఎవరూ. వారింటికి వీరు వెళ్ళడం, వీరింటికి వారు వెళ్ళడం మా కోడలని, మా అల్లుడని  పరిచయం చేసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. సంవత్సరం అయ్యాక పెళ్ళి మాటలు అనుకునేటప్పుడు ఇరువైపుల వారిది ఒకే కులం కాదని తెలిసింది. దాంతో పెళ్ళికూతురి తండ్రి ఈ సంబంధం వద్దు అన్నారు. వీళ్ళిద్దరేమో సంవత్సరం నుండి భార్యాభర్తలమవుతామనుకుని అనుకున్నాము. ఇప్పుడు వద్దంటే ఎలా? అని. ఆ అమ్మాయి పాపం చాలా బాధ పడుతూ ఉండేది. నన్నొకసారి అడిగింది. ఏం చెయ్యాలి అని.
"చూడండి నాకు తెలిసింది ఒకటే, ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడిని అడగడమే, లేదంటే ఇదే నాకు మంచి అని భగవంతుడు నిర్ణయించాడు అనుకుంటాను. మీరు పలానాది నాకు మంచి అని అనుకుంటున్నారు కాబట్టి మీ సింహాసనం లో ఉన్న కుల దైవాన్ని అడగండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారు? స్వామీ నాకు దారి చూపించు అని నిలదియ్యండి" అన్నాను. ఆ అమ్మాయి కొంచెం విస్మయంగా చూసింది. "అవునండీ తప్పులేదు, మీరు రోజు దీపం పెట్టి దణ్ణం పెట్టుకునే భగవంతుడిని అడగకపోతే ఇంకెవరిని అడుగుతారు. నాకు తెలిసినంత వరకైతే ఆ స్వామి భార్యాభర్తల విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఆయనే దాంపత్యానికి రక్ష, అందుకే ఎవరి ఫొటో ఉన్నా లేకున్నా పెళ్ళిళ్ళలో ఇప్పటికీ సీతారాములుంటారు. వాళ్ళద్వారా ఆశీస్సులిస్తూ హనుమ ఉంటారు. మీరు చేస్తానంటే నాదగ్గర ఓ మార్గం ఉంది అన్నాను. " చెప్పండి అన్నది ఒకింత ఆశగా. "నేను మీకు హనుమాన్ చాలీసా ఇస్తాను. నిజమైన తాటియాకులమీద రాసిన హనుమాన్ చాలీసా ఇంతకుముందు ప్రసాదంగా హనుమద్రక్షాయాగంలో మాస్టరుగారు ఇచ్చారు. నాకెందుకు మాస్టరుగారు నేను చాలీసా చూసి చదవను కదా అంటే ఆయన ఉంచు ఎవరికైనా నిజంగా అవసరం అనిపించినప్పుడు ఇవ్వు అన్నారు. నాకెందుకో అది మీకు అవసరం అని అనిపిస్తుంది. అది ఇస్తాను . ఒక నలభై రోజులు రోజుకి పదకొండుసార్లు పారాయణ చెయ్యండి.  నలభైరోజులు పూర్తి కాకుండానే మీ పెళ్ళి పత్రిక తీసుకువస్తారు స్వామి అనుగ్రహం ఉంటే అన్నాను. నిజంగానా అన్నది. పుస్తకాల్లో చదివి నేను చెప్పడంలేదు, నా స్నేహితుడొకరికి నిజంగా జరిగింది కాబట్టి చెప్తున్నాను అన్నాను. చేస్తానండి అని చెప్పి తీసుకొన్నది. తరువాత నలభై రోజులయ్యాక ఫోను చేసాను ఏమైందండి అని, ఏమీ కాలేదండి అన్నది. మీరు హనుమాన్ చాలీసా నిజంగా చేసారా నేను చెప్పినట్టు అన్నాను. కుదిరినప్పుడల్లా చేసానండి,ఒక్కోసారి ఆఫీస్ వల్ల కుదరలేదు అన్నది.

అలాకాదండి, సీరియస్ గా నలభై రోజులు నేను చెప్పినట్టు చెయ్యండి. జరగకపోతే అప్పుడడగండి అన్నాను. సరే అని ఆ రోజునుండి చాలీసా క్రమం తప్పకుండా పారాయణ చెయ్యడం మొదలుపెట్టింది. కొన్ని రోజులయ్యాక మనోహర్ గారు ఒక గుడ్ న్యూస్ అన్నది, ఏమంటే కనీసం రెండువైపుల వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలని అనుకున్నారు అని చెప్పింది. మరికొన్ని రోజుల తర్వాత తరువాత పెళ్ళికి ఒప్పుకున్నారు ఉత్తరభారతంలో ఉండే మా పెదనాయన గారు ఒకాయన వచ్చి పిల్లగురించి కూడా అలోచించండి అని సర్దిచెప్పి ఒప్పించారు అని అన్నది. ఇదంతా మీనోటి చలవే మనోహర్ గారు, నాకోసమే ఆ చాలీసా మీదగ్గరకొచ్చిందేమో అని అన్నది. అలా ఏం లేదండీ, మీ కష్టం తీరే మార్గం ఉంది అని స్వామి నాతో చెప్పించారు. నేను కాకపోతే మరొకరు చెప్పేవారు, ఆ స్వామి అనుగ్రహం మీ మీద ఉంది ఒకసారి ఆయన పాదాలు పట్టి చూసారు కదా, ఇక విడవకండి. ఇంతకీ పెళ్ళెప్పుడు అన్నాను. ఇంకా ముహుర్తాలు అనుకోలేదు శ్రీరామనవమి అయిన తర్వాతి రోజు పెట్టుకుంటారు అన్నది. ఇంకేం సంపూర్ణ శ్రీరామపరివార అనుగ్రహం మీమీద ఉంది. ఇక భయపడకండి అన్నాను. ఇంకా మీపారాయణ ఎన్ని రోజులుంది అని అడిగాను. ఐపోవచ్చింది ఇంకొన్ని రోజుల్లో అయిపోతుంది అన్నది. నేను చెప్పాను కదా మీ పారాయణ పూర్తయ్యేలోపు మీ సమస్య పరిష్కారం అవుతుంది అని అన్నాను. పారాయణ పూర్తయ్యేలోపు పెళ్ళికి ముహూర్తం నిర్ణయించారు జూన్ 19 అని చెప్పింది. ఆరేడు నెలల నుండి ఆమె గొంతులో అంత సంతోషం ఎప్పుడూ వినలేదు, మనసులోనే స్వామికి సాష్టాంగ ప్రణామం చేసుకున్నాను.
అలాంటి అసాధ్యసాధక స్వామికి రేపు అభిషేకాలు, అవబృధ స్నానాలు జరుగుతాయి.  ఈ సారి నాకు మరింత ప్రత్యేకం, పెళ్ళైనతర్వాత మొదటిసారి అందరం వెళ్తున్నాం.ఆ స్వామి అనుజ్ఞ గానే పెళ్ళి చేసుకున్న నా భార్యని, ఆ స్వామి గండంనుండి బయటపడేసి బతికించిన బిడ్డని ఆయనకి చూపించడానికి తీసుకువెల్తున్నా. అన్నిటికంటే మరింత ప్రత్యేకం మా నాన్నగారు కూడా ఈసారి యాగానికి వస్తున్నారు. చాలా ఆత్రంగా ఉంది. ఈ రెండురోజులు గడిచిపోతే శుక్రవారం తెల్లారేటప్పటికి ఆ స్వామి ముందు ఉంటాను.

అవబృధ స్నానానికి భక్తుల తరపున 108 కలశాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఏవరైనా రావాలనుకున్నా, తమ పేరు మీద కలశం ఏర్పాటు చెయ్యాలనుకున్న, యాగానికి ఏదైనా సహాయం చెయ్యాలనుకున్నా నన్ను కానీ మాస్టరుగారిని కానీ సంప్రదించగలరు.         
వివరాలు
durgeswara.blogspot.in(9948235641)durgeswara@gmail.com
మనోహర్-9742702802
విధేయుడు
మనోహర్ చెనికల


భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాశాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుేక ఆయన ప్రత్యక్షదైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.

ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా ఉంది. జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సేర్యుడే కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు.సేర్యుడు దక్షినాయణం ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. ఒకటి సంక్రాంతి, రెండి వది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘశుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది.నిస్వార్ధకర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధంమీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు.

విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికి ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషూడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతోందనడానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మును లకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడ ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయంగా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది.

వెలుగే జ్ఞానం. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేదశాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం.
ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక పోషణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు. ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్యకాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు.

పంచభూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమితమైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది.ఋషూలు, యోగులు ఎంతోకాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు. పంచభూతాలతోకూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు. సూర్యనమస్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది.

మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారిపోతుంది. అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి.సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలిగిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది. కీళ్ళనొప్పులవంటి రుగ్మతలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగాలను నివారిస్తుంది. ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మేళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయోగిస్తారు.

సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలుమన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూఉంటాయి. సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది.
మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అం దుకే మనలోవలే ఉన్న అజ్ఞాతశక్తుల గురించి మనకు తెలియ దు. అలా తెలియకుండా చేసేదే మాయ. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలో చనను, చూపును లోపలికి మరలించు కున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగు తుంది. వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగి పోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే జ్ఞాన వివేకాలు కూడా మనలో పలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం.

పంచభూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమితమైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది.

ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి.
జీవుల పుట్టుక పోషణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి.
మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు. ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు,
యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యుడే గురువనీ, సూర్యకాంతే
జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్యకాంతి
ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు.

శ్రీ గురుబ్యోనమ
సత్సంగ సోదరులందరికి 2013 ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు
నాకు 20 సం నుండి ఆద్యాత్మిక సలహాలు ఇస్తూ ఆద్యాత్మిక పురోగతికి కారకం అవుతూ నాకు ఎంతో  మార్గదర్శనం చేస్తున్ననా గురు స్వరూపం
శ్రీ నూగూరు కేశవచార్యులు గారు వారి వయస్సు 56 సం వారు శ్రీరామకృష్ణ పరమహంస వారిబోధలను అనుసరిస్తూ వుండేవారు            వారికి అనుకోని విపత్తు 15 రోజులనుండి హుద్రోగంతో  (హార్ట్ అటాక్ ) భాదపడుతూ శ్వాస తీసుకోవటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.
హైదరాబాద్ లో కామినేని వారు లాభంలేదు అన్నారు. నాడి స్పందన పడిపోయింది,(pulls rate), శ్వాస కు ఇబ్బంది, హృదయస్పందన 15-20 మద్యలో వుంది వెంటిలేషన్ కూడా పనిచేయటంలేదు. అటువంటి సమయం లో విషయం నాకు 27-12-2012 తెలిసింది.
హుటాహుటిన వారి ఇంటికి వెళ్లేసరికి కామినేని లో వున్నారు అని తెలిసింది వెంటనే వారి అబ్బాయి నన్నుచూసి బాధపడుతూ "నాన్నను ఇట్లా చూడలేక పోతున్న అంకుల్, ఏమిచేయాలో తోచట్లేదు డాక్టర్లు లాభం లేదన్నారు భయమేస్తుంది అంకుల్ " అని అన్నాడు
అట్లా అనగానే
నేను తత్ క్షణమే వారి నాన్నను చూస్తూ నా అంతర్హృదయం లోనే ద్యానం చేస్తూ వున్నా 10 నిమిషాలలోనే సర్వేశ్వరుడు ఒక ఫలితాన్ని అందించారు
వెంటనే వారి అబ్బాయి కి విషయం తెలిపాను
"
నిజమా ఇట్లా జరుగుతుందా నేను నమ్మలేను" అని అన్నాడు
        
సరే నీవు ఇక్కడే వుండు నేను ప్రయత్నం చేస్తాను నాకు నమ్మకం వుంది అంటూ నేను బయటకు వెళ్లబోతుంటే "నేను వస్తాను అంకుల్ " అంటూ నాతొ వచ్చాడు
ఇద్దరం కలిసి ప్రయత్నం చేశాము
ప్రయత్నం ఏమిటంటే ?
శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్న,లేక  చాల ఆపదసమయంలో వెంటిలేషన్ కూడా పలితాన్నిఇవ్వలేక ప్రమాదఘంటికలు ఆసన్నమైతే అటువంటి సమయములో కార్యాన్ని చేస్తే వెనువెంటనే ఫలితాన్ని పొందవచ్చు
అది
ఒక కిలో గాని, దానికి తగిన పరిమాణం కంటే ఎక్కువ గాని పేలాలు లేదా మొక్కజొన్న పేలాలు లేదా బియ్యపుపిండి తో చేసిన ఉండలు గాని లేదా వేరుశనగ,బెల్లం తో చేసిన పప్పు చెక్కలపొడి (పల్లి పట్టి పొడి) గాని  ఒక పేపర్ లో తీసుకోని మీకు దగ్గరలో వున్నా చేపల చెరువు లో కానీ చేపల తొట్టి (అక్వేరియం) లో గాని ఎవరైతే భాదపడుతున్నారో వారి ఆరోగ్యం చేకూరాలని ప్రేమతోకూడిన మనస్సుతో ప్రార్దిస్తూ పైన తెలిపిన లేదా తెచ్చిన పదార్దాలను చేపలకు ఆహారముగా వేయండి వారు వెంటనే కోలుకుంటారు భాదితుడి పేరుతొ ఎవ్వరు చేసిన ఫలితం తప్పనిసరి ఇది సత్యం నమ్మండి

మేము ఇద్దరం కలిసి కిరాణం కొట్లో పేలాలు కొని మనస్సులో ప్రార్దిస్తూ చెరువులో వేసాము, మేము ఆసుపత్రి కి తిరిగి వచ్చేసరికి కేశవచార్యులు గారు ఇబ్బంది లేకుండా పరికరం సహాయం లేకుండా తనకుతాను శ్వాసను తీసుకుంటూ కనపడ్డారు రోజు సాయింత్రం వరకు పల్స్ రీడర్ ను వుంచి అది కూడా తీసేసారు
రోజు వారి హృదయస్పందన 45-50 మద్యలో వుంది బీపి,. సి. జి. నార్మల్, ఆసుపత్రి నుండి రోజు ఆనందం డిశ్చార్జ్ అయ్యారు 
అనూహ్యమైన పలితాన్ని

సర్వేశ్వరుడు
అందిచినందులకు సదా సర్వదా మనసవచాకర్మన  షాశ్టాన్గప్రమాణములు చేస్తూ,
కార్యాన్ని అనుసరించిన వారందరికీ  సర్వేశ్వరుడు అనుగ్రహించాలని ప్రార్దిస్తూ
ఇది అందరికి ఉపయోగపడాలనే స్వార్ధం తో తెలుపునది
ఇది

శ్రీనివాసు అని పిలవబడునది

నమస్కారము,
   నా పేరు శ్రీలక్ష్మి సౌజన్య ,నా జీవితం లో జరిగిన మంచి విషయం గురించి మన సత్సంగం గుంపు వారితో పంచుకోవాలి అనుకుంటున్నాను.
 నాకు ౨ సంవత్సరముల నుంచి సమంధాలు చుస్తునారు కానీ అన్ని కుదిరినట్టే కుదిరి  ఏదో చిన కారణం వల ఆగిపోఎవి .
నేను ౩ నెలల క్రితం భాగవతం వినడం ప్రారంభించాను . అందులో మన గురువుగారు రుక్మిణి కళ్యాణ మహత్యం చెప్పగా విన్నాను వెంటనే రుక్మిణి కళ్యాణం విన్నాను . అదేంటో మహత్మ్యం అది అవంగానే జూలై 28 తారీకున శ్రావణ శుక్రవారం చేసుకుందాము అని మా వూరు బయలుదేరాను ,దారిలో మా నాన్నగారు ఫోన్ చేసి aug 8 ని వివాహం అని చెప్పారు . చాల ఆశ్చర్యం గ అని ఆ భగవంతుడు ధగ్గరుండి జరిపినట్లు అన్నీ సమయానికి అందాయి . ఒక మంచి కుటుంబం లోకి ఆ భగవంతుడు నాకు స్థానం కలిపించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
పెళ్లి కావాల్సిన అమ్మాయిలు  తప్పకుండా రుక్మిణి కళ్యాణం వినాలి అని మనవి చేసుకుంటున్నాను
కృతజ్ఞతలు ,
శ్రీలక్ష్మి సౌజన్య.

    UNIVERSAL PRAY
శ్రీ  గుర్బ్యో  నమః
మీకు ఈ రోజు జరిగిన ఒక విషయం తెలియచేయాలని ఇది రాస్తున్నాను
మా ఇంట్లో ఒక పిల్లి రెండు పిల్లలను కన్నది
పరమేశ్వర్ది దృష్టి లో అందరు ఒకటే గద అని దానిని మా  స్టోర్ రూం లోకి మార్చాము.
ఇంతలో ఆ రెండు పిల్లలలో ఒకటి తప్పిపోయింది.
మరిఒకటిని జాగ్రత్తగా కాపాడుకొంటుంది.వున్నా ఆ ఒక్క పిల్లి పిల్ల వయసురిత్య రోజులలనుండి నెలలోకి వచ్చింది. దాని అల్లరి బాగా పెరిగి పోయింది. ఈ వర్షాలు పడుతున్న నిన్న, మొన్నటి రోజుల్లో మేము లేని సమయంలో  పక్క బట్టలు, రోజు వారి వాడుకునే బట్టలు పరుపులు మలమూత్రవిసర్జనతో నింపి పెట్టింది.
ఈ వర్షాలు పడుతున్న సమయం లో ఇవి ఎలా ఉతకాలి?, ఎలా ఎండబెట్టాలి?,ఇది పెద్ద సమస్య అయింది.
మా వాళ్లకు. ఇదంతా మీ వల్లే జరిగింది, పాలు, పెరుగు పోస్తుంటే చనువుగా తిరిగి ఇల్లంతా పాడుచేస్తుంది, అని అంటూ ఏమి చేయలేక ఊరుకొన్నారు.
               నేను లేని సమయం లో మా వాళ్ళు ఒక పనిచేసారు.
        అది  ఆ పిల్లి పిల్ల తల్లి లేని సమయం చూసి ఆ పిల్లి పిల్లను పట్టి మా ఇంటి వెనుక ఒక సందు అవతలవేరొక సందు లో నిన్న రాత్రి తీసుకెళ్ళి విడిచి పెట్టారు.
నేను వచ్చిన తరువాత వాళ్ళు చేసిన ఘనకార్యం మహా గొప్పగా చెప్పారు, నేను మా పిల్లలమీద, నా భార్య మీద కోపం వచ్చి ఇదే నీ బిడ్డలకుజరిగితే ఎలావుంటుంది?, తప్పు ఇక అలచేయవద్దు అని మందలించి నిన్న రాత్రి చేసేది ఏమి లేక ఉదయం దాని గురించి ప్రయత్నం చేద్దామని ఊరుకొన్నాను.
      ఈ రోజు ఉదయం ప్రాత:సంద్య ముగించుకొని ఆ పిల్లి పిల్ల కోసం వెతికాము, ఎక్కడ కనపడలేదు ఏమి చేయాలో తోచక తిరిగి వచ్చాము.
ఇక   దేవతార్చనకొరకు  అంతా సిద్దం చేసుకొంటుండగా ఆ తల్లి పిల్లి నా ఎదురుగ వచ్చి కూర్చొని దీనంగా మొహం పెట్టుకొని " నా బిడ్డ ను ఏమి చేసారు? అది కనపడట్లేదు" అన్నట్లుగా నా వైపు చూసింది.
ఏమి చేయలో తోచలేదు మన మాటలు దానికి అర్ధం కాదు ఎలా చెప్పటం? అనుకొన్నాను
వెంటనే ఆ సర్వేశ్వరుడు అనుగ్రహంతో " universal pray " గుర్తుకు వచ్చింది
వెనువెంటనే  ఆ తల్లి పిల్లి కి ఎదురుగ నిలబడి చేతులు జోడించి కళ్ళు ముసుకోకుండా గొంతులో ఈ ఒక్కఅక్షరం పలుకకుండా నా హృదయస్తానం లో అంతర దృష్టి ని నిలిపి మౌనముగా     " అమ్మ దయచేసి మన్నించు, నా భార్య,పిల్లలు చేసిన పని ఇది ఈ ఇంటి వెనుక ఒక సందు అవతలవేరొక సందు లో నిన్న రాత్రి తీసుకెళ్ళి విడిచి పెట్టారు ఆ సందు లో వుంది నీ బిడ్డ అక్కడ నీ బిడ్డ దొరుకుతుంది అక్కడ ప్రయత్నిచు,మమ్ములను క్షమించు" అని మౌనంగా ప్రార్దించాను
అంతే వెంటనే
ఆ తల్లి పిల్లి నా మాట అర్ధం అయినట్లుగా దానికి తోచి టక్కున ఆ తల్లి పిల్లి మ్యావు మ్యావు అనిఅరుస్తూ మా ఇంటి వెనుక గోడ దూకి వెళ్ళింది.
నేను మా పిల్లలు గమనిస్తూ దానివెంట వెళ్ళాము.
కొద్ది దూరంలో ఒక అపార్ట్మెంట్ దగ్గర దాని అరుపులకు స్పందిస్తూ ఆపిల్లి పిల్ల ఒక రేలింగ్ మీద నిలబడి సమాదానం ఇచ్చింది.
వెంటనే ఆ తల్లిపిల్లికి ఎంతొ ఆనందం కలిగింది వెంటనే దానిని ఒక్క పరుగుతో చేరుకొంది.
మాకు ఆనందం కలిగింది.
ఆ సర్వేశ్వరుడి భాష హృదయభాష అది  అన్నిజీవులకు, పదార్దాలకు వర్తిస్తుంది అది హృదయన్తారాలలోని మహా మౌనం అది
 
                 

--

--రంగావజ్హ్హులశ్రీనివాస్







మూగవాణ్ణి పలికించే బృందావనం ఇది.
మీ పిల్లలకు మాటలు రావడం లేదు అని భాధపడవద్దు. మూగ వాడు అని క్రుంగి పోవద్దు. మాటలు తప్పక వస్తాయి.
ఆ పరబ్రహ్మ మహిషిని ఆర్తితో వేడుకోమని జగద్గురువులు శ్రీ శంకరభగవత్పాదులు విరిచించిన సౌందర్య లహరి లోని శ్లోకము ఇది. మహా మంత్రములతో కూడినదై ఉపాసించగానే వరములు ఇచ్చే మా తల్లి కనక దుర్గై,  పాయస పాత్రతో మన ముందు నిలబడే అన్నపూర్ణయై, వాక్కును నొసగే వాగ్దేవినియై మీ ముందు ప్రత్యక్షము అయి మీ బిడ్డలకు వాక్కును ఇవ్వగలదు. ఇందు సందేహము ఎంతమాత్రమూ లేదు. భక్తితో, ఆర్తితో అమ్మ కాళ్ళు పట్టుకోండి.



శ్లో:  త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం
      కవీంద్రా: కల్పంతే కథమపి విరించి ప్రభృతయః
      యదా లోకౌత్సుక్యా దమర లలనాయాన్తి మనసా
      తపోభి ర్దుష్ప్రా పామపి గిరి సాయుజ్య పదవీమ్.
(12 వ శ్లో.)

     సౌ:     సౌ:   అని జలమునందు వ్రాసి 45 రోజులు నిష్టతో అర్చించి, జలమును స్పృశించి ఈ శ్లోకమును ప్రతి దినము వేయి మార్లు పఠించి,
              ఆ జలమును పిల్లలకు పట్టవలెను. దీనిచే మూగ వాడు సైతము కవియగును.     నైవేద్యము ... మధువు, తేనె.

       ఇది ఆది శంకరుల వాక్కు.

శ్రీ రామ జయరామ జయజయ రామ
శ్రీ రామ జయరామ జయజయ రామ
శ్రీ రామ జయరామ జయజయ రామ
ఒకనాడుశ్రీ రామనవమి  కాంచీపురమఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామి వారు వొక బడి కి వెళ్లి పిల్లల చేత శ్రీ రామ నామము అన్పిస్తున్నారు . ఒకొక్కడి వద్దకి వెళ్లి ఏది శ్రీ రామ అనమ్మా  అని పలికిస్తున్నారు . ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులో కదా ! అంత ప్రియ స్వామి వారి వద్ద గురూపదేశం తీసుకున్నట్టే కదా!
అలా కొంతమంది చేస్తా చెప్పించిన తరువాత వొక కుర్రవాని వద్దకు వెళ్లి ఏదీ శ్రీ రామ అనమ్మా అనగా  జవాబు లేదు .మళ్ళీ అన్నారు జవాబులేదు .యింతలో అక్కడ ఉన్న ఉపాధ్యాయుడు వచ్చి వాడు మూగ వాడు మాట్లాడలేడు స్వామీ ! అన్నారు.
  నిజమా అయితే రామ నామం పలికిద్దాము . ఏదీ నువ్వు అనగలవు నోరు తెరువు చెప్పు శ్రీ రామ 
కష్టం మీద అకుర్రవాడు శ్రీ రామ అనగలిగేడు 
నిన్ను మూగావాడని ఎవరన్నారు మళ్ళీ అను గట్టిగా అందరికీ తెలియాలి నువ్వు మాట్లాడ గలవు.
   మళ్ళీ అను శ్రీ రామ .
ఆ కుర్రవాడు ఈ మాటు గట్టిగా ఉత్సాహంతో శ్రీ రామ అన్నాడు

 అంతే  యీమాటు బడి అంతా శ్రీరామ నామంతో మార్మోగిపోయింది. 


-----------------------------------

ఈ వృత్తాంతం పూరీ మహాక్షేత్రం దగ్గర ఒక ఊరిలో జరిగిందని ప్రతీతి.
భగవన్నామ బోధేంద్రసరస్వతిస్వామివారు కాశీ యాత్రా సమయంలో పూరీ క్షేత్ర సమీపంలోని ఒక గ్రామంలో నడుస్తూ ఒక ఇంటి అరుగు మీద సేద తీర్చుకోవటానికి కూర్చుని ధ్యాన నిమగ్నులై ఉన్నారు. అటువంటి మహానుభావుడు యాదృచ్చికంగా కనిపించే ఏ పని చేసినా మహత్కార్యంగా రూపొందుతుంది. వారు కూర్చున్న ఆ అరుగుగల ఇల్లు మహాపండితుడైన ఒక అపూర్వ రామ భక్తునిది. (వారిపేరు సరిగా గుర్తులేదు.) వారు రామనామసంకీర్తనా మాహాత్మ్యం మీద అనేక సప్రామాణిక గ్రంథాలను సంస్కృతంలో విరచించారు. వారు శరీరంతో ఉండేటప్పుడు ఎందరినో ఆదుకొని, ఎందరి జీవితాలనో రామనామ భిక్షతో తరింపజేశారు. అప్పటికీ ఇప్పటికీ ఆ ప్రాంతాలలో ఏ సమస్య తలెత్తినా పరిష్కారనికై వారింటికి పరుగిడి రావడమే అక్కడివారందరి అలవాటు.

మనస్వామి ఆ అరుగుపై కూర్చుని ఉండగా తమిళనాటికు చెందిన ఒక సద్బ్రాహ్మణుడు, ఒక ముస్లిం యువతి రాత్రిపూట చీకటి మరుగున అక్కడ చేరారు. వారిద్దరూ ఏదో ఆపదలో ఉన్నారు. అప్పటికి ఆ పండితుడు పరమపదించగా వారి తనయులు జగన్నాథశాస్త్రిగారు ఉన్నారు. ఈ ఆపన్నులు జగన్నాథశాస్త్రిగారిని గట్టిగా ఆర్తనాదాలలో పిలిచి లేపి వారి కథ చెప్పుకున్నారు.

జరిగిన విషయం ఏమనగా: ఆ సద్బ్రాహ్మణుదు భార్యా సమేతుడై దక్షిణాదినుండి కాశీ క్షేత్రానికి కాలినడకన వెళ్తూండగా దారిలో వారు విశ్రమిస్తున్న ఒక చోటు నుండి ముస్లిం దుండగులు వీరికి మత్తిచ్చి ఆయువతిని నోరు కట్టి అపహరించుకుని పోయారు. జరిగినదేమిటో తెలియక, దిక్కు తోచక కొంతకాలం తిరుగాడి ఈ సద్బ్రాహ్మణుడు కాశీకి కొనసాగి క్షేత్రధర్మములాచరించి అక్కడ చేయవలసినవనుష్ఠించి మరలి వస్తూండగా ఈ యువతి (అపహరింపబడిన తన భార్య) ముస్లిం వేషధారణలో తన్ను బంధించిన వారినుండి పారిపోతూ కనపడింది. అప్పటికే కొన్ని నెలలు కావటం చేత ఈయన గుర్తు పట్టకపోయినా ఆమె గుర్తు పట్టింది. తిరిగి ఈ అనపరాధయైన యువతిని భార్యగా స్వీకరించాలా లేదా అన్నది ఆయనకు ధర్మసందేహం. భార్యగా కాకపోయినా కనీసం ఒక సేవిక గా స్వీకరించటానికి ధర్మశాస్త్రంలో వీలు ఉందా అని ఆశ కలిగింది. దుండగుల కంటపడకుండా అర్థరాత్రిళ్ళు సంచరిస్తూ సమస్యా పరిష్కారానికై వీరింటికి చేరారు.

జగన్నాథ పండితుల వారు ఏమి చెప్తారా అని మన స్వామివారు ఊపిరి బిగపట్టి వింటూన్నారు. స్వామివారి శరీరం రోమాచితం కాగా వారి హృదయం పులకించగా జగన్నాథ పండితులవారు ఒక్క క్షణం కుడా ఆలోచించకుండా చెప్పిన విషయం ఏమిటంటే, "ఓ బ్రాహ్మణా, ఈ యువతి తాను చేయని నేరానికి ముస్లింలచే చెరచబడి వారి మతములోకి మార్చబడినది. ఇదేమాత్రము? ఈ యువతి రామనామమును ’రామా రామా రామా’ యని మూడుసార్లు వల్లించిన ఎటువంటి దోషమైనా పరిహారమగును; నిశ్చింతగా నిశ్శంకగా నీవామెను భార్యగా తిరిగి స్వీకరించవచ్చు. శ్రీజగన్నాథుల మీద ఆన" అని పలికెను. అప్పటికే నిద్రలేచిన వారి తల్లి "జగన్నాథా, నీవేల ఇంత చిన్న తప్పిదానికి రామనామమును మూడు సార్లు వల్లించమని చెప్పి రామనామ మహిమను కించపరుస్తున్నావు? ఇదే మీ తండ్రిగారైతే ఒకేఒక్క సారి చెప్పమనియుండెడివారు" అన్నారు. అప్పుడు స్వామివారు "మాతా, ఇప్పుడు జరిగిన సంఘటనను కన్నులారా చూసి చెవులారా వినిన భాగ్యము ఆ శ్రీరాంచంద్రుడు నాకు కలుగచేశారు. అమ్మా అన్యథా భావించక, మీరిరువురూ ధైర్యముగా చెప్పిన ఈ పరిహారమునకు ప్రమాణము కలదా?" అని అడిగారు. వెంటనే జగన్నాథ శాస్త్రి గారు వారి తండ్రిగారు రచించిన సప్రమాణిక గ్రంథాన్ని వీరికందించారు. స్వామివారు ఒక దీపం వెలిగించమని ప్రక్కన కూర్చుని ఆ గ్రంథాన్ని అక్కడే సాంతం చదివేశారు.

తదుపరి, వారు ఆ నలుగురినీ ఉద్దేశించి "ఇంత గొప్ప మహత్తరమైన విషయం మన నలుగురిలో అణగారిపోకూడదు. ఇది అందరికీ చాటి చెప్ప వలసిన విషయం" అని చెప్పి తెల్లవారాక అక్కడున్నవారినందరినీ ప్రోగేసి నదీ తటానికిపోయి (నది పేరు నాకు గుర్తులేదు)
అక్కడచేరినవారందరి మధ్యా ఒక ప్రతినబూనారు. "రామనామం పవిత్రమైనదైతే, రామనామ సంకీర్తన ఉత్కృష్టమై పతితపావనమైతే, ఈ ముస్లిం వేషధారిణియైయున్న యువతి రామనామం జపిస్తూ నదీ జలంలో మునుగగా పవిత్రురాలై ముస్లిం వేష వివర్జితయై వెలికి వస్తుంది." అలా చెప్పి ఆ యువతి వైపు చూసి "నీకు రామభక్తి ఉందా, రామనామం పట్ల శ్రధ్ధా, రామనామం పట్ల నమ్మకం ఉందా?" అని అడిగారు. ఆమె, "ఇంతవరకు అంతగా లేదు, ఇదిగో ఇప్పుడు మీరు చెప్పిన మాటలవల్ల అమితమైన గురి కుదిరింది స్వామీ" అని బదులిచ్చింది.

వీరికీ జగన్నాథ పండితులకీ నమస్కారములిడి భక్తితో రామనామం ఉచ్చరిస్తూ నదిలోనికి దిగి మునకవేసిన ఆమె పూర్తి పునిస్త్రీగా పసుపు నీటిలో స్నానం చేసినట్టు కనిపిస్తూ పసుపు కుంకుమలతో పువ్వులతో చీరతో బయటకి వచ్చింది!

రామనామ మాహాత్మ్యం పట్ల అద్వితీయమైన నమ్మకం కలిగిన భగవన్నాములవారు పూనుకుని పలువురి ఎదుట ఈ యుగంలో చేసిన ఒక గొప్ప మహత్యం ఇది.

ఇప్పటికీ ఆ ప్రాంతాలలోను, గోవిందపురం ప్రాంతాలలోను కుడా ఈ వృతాంతాన్ని రామభక్తులు సదా ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందిస్తూంటారు.

శ్రీ అరుణాచల రమణార్పణమస్తు.

సుందరకాండ పారాయణ చేసే వారందరికీ ఆ మహిమ ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంటుంది. కొందరికి బాహ్య ప్రపంచంలోనూ కనబడుతుంది, కొందరికి మానసోల్లాస రూపంలో మాత్రమే కనపడవచ్చు.

నే్ను మా అన్నగారి ప్రేరణతో మొదటిసారిగా నాలుగు సంవత్సరాల క్రితం సప్తసర్గి పారాయణ చేశాను. అప్పటి అనుభవం ఇది.
(ఈ విధానం తెలియనివారికోసం: ఇది, రోజుకి ఏడు సర్గలు చొప్పున పారాయణ చేసే ఉత్తమ విధానము. తొమ్మిదరోజుకి్ అరవై మూడు సర్గలు పూర్తవుతాయి. పదవరోజు అరవై ఎనిమిదవ సర్గ పూర్తయినాక తిరిగి ఒకటవ, రెండవ సర్గ చేయాలి. ఇలా చేస్తూ పోగా, అరవై ఎనిమిదవరోజున ఏడు ఆవృత్తులు అయేసరికి అరవై ఎనిమిదవ సర్గ చివరిదవుతుంది. ఆరోజుతో పారాయణ సమాప్తి చేసి భగవత్సమర్పణ చేయాలి.)

మా నివాసం బెంగళూరులో. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో కోతులు ఉంటూ ఉంటాయి. మేము ఉన్న చోట కూడా ఉండేవి. కానీ విచిత్రంగా, నా పారాయణ జరుగుతున్న రోజులలో ప్రతిసారీ చివరి సర్గ జరిగిన రోజున, అదీ నేను పారాయణ చేసే సమయంలో వచ్చి వెళ్ళేవి. ఇంట్లో చొరబడి కనీసం ఒక అరటిపండైనా సంగ్రహించుకుపోయేవి.

మా అన్నగారి సూచన మీద చేశానే కానీ, నియమ నిష్ఠల గురించి ప్రత్యేకంగా తెలియదు. అరవై ఏడవరోజున, చివరిరోజు బ్రాహ్మణ సంతర్పణ (కనీసం ఒక్కరికి) చేయాలని తెలిసింది. ఎవరికీ ముందుగా చెప్పుకోలేదు కనుక ఈసారికి నమస్కారం తో సరిపెడదామనుకున్నాను. "రేపు పూర్తవుతుంది కదా, విశేష నైవేద్యం చేద్దాం" అనుకుని అంగడిలో కనబడ్డ ఉత్తమ ఫలాలను తెచ్చాను.
ఆరోజు రాత్రి మా అన్నగారి ఫోను వచ్చింది. మరుసటిరోజు తను "మరో ముగ్గురితో" కలిసి శృంగేరీ నుంచి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి వస్తున్నట్టు చెప్పాడు.
అనుకున్నట్టుగా రానే వచ్చారు. ఆ మరో ముగ్గురు, మా బంధువులే. వారిలో ఇద్దరు దంపతులు! వారిపేర్లు, "లక్ష్మీపతి, సీత." ఆ అతిథులు ముగ్గురికీ చేతనైనంతలో సమారాధన చేసి సత్కరించాము.

వాళ్ళు వస్తూ మరిన్ని పళ్ళు తెచ్చారు. సరే అని నేను ముందురోజు కొన్న వాటిలో ప్రత్యేకించి నైవేద్యం పెట్టాలనుకున్న పెద్ద అరటి పళ్ళ హస్తాన్ని పక్కన పెట్టి మిగిలిన పళ్ళను నైవేద్యం పెట్టాను. ఆశ్చర్యం ఏమిటంటే, ఆరోజు పారాయణ చేసి పూజ చేసి నైవేద్యం, ఆరతి అన్నీ చేసి నమస్కారం చేస్తుంటే అందరూ వసారాలోనూ ముందుగదిలోనూ ఉండగానే అతి నిశ్శబ్దంగా ఒక నిండు గర్భిణీ కోతి వచ్చి నేను వదిలేసిన పెద్ద అరటిపళ్ళ హస్తాన్ని తీసుకుని అంతే నిశ్శబ్దంగా జారుకున్నది. కొందరు చూసి ’భయపడి’ ఊరుకున్నారు, కొందరు చూడనేలేదు. బయటికి్ వెళ్ళి వసారాలో కూచుని అందులోని సగం పళ్ళు ఆరగించేసింది ఆ కోతి. సాధారణంగా కోతులు కాస్త అల్లరి చేస్తూ తింటాయి. గర్భణీ కోతులు కాస్త ప్రశాంతంగా ఉంటాయి కామోసు. పైగా అప్పుడు ఆ కోతుల దండు అంతా వీటిమీదకి ఎగబడలేదు. అది వదిలేసిన తరువాత మాత్రం ఆ పళ్ళ మీద మిగిలిన కోతులు వీరంగం వేస్తూ వసారా అంతా చెత్త చేస్తూ తిన్నాయి!!

తరువాత ఇంత dramatic గా కాకపోయినా మహిమలు చాలానే చూపిస్తున్నారు!

-శ్యామ శర్మ

శ్రీగురుభ్యోనమః

నమస్తే
ఎందరో మహానుభావులు, పూజ్య గురువులు ఎన్నో సందర్భాలలో సౌందర్యలహరి
శ్లోకాలపై ప్రవచించినప్పుడు ఆయాశ్లోకాలను పఠించడం వల్ల వచ్చే ఫలితాలను
చెప్పేవారు. పూజ్యగురువులు వారి ప్రవచనాలలో అటువంటివి జరిగిన ఉదంతాలు
కూడా చెప్పారు. ఐతే గత వారం అటువంటిదే ప్రత్యక్షంగా అనుభవించడం
జరిగింది.


73 ఏళ్ళ వయసులో హృద్రోగంతో అత్యంత ప్రమాద పరిస్థితులలో వైద్యాలయంలో చేరిన
వ్యక్తికి పేర్గాంచిన వైద్యులు పరీక్షలు జరిపి, దాదాపు 70% నికి పైగా
రెండు 60% ఒకటి 30% ఒకటి గా గుండెకు చెందిన నాళాలు పూడుకుపోయాయి కనీసం
మూడు ప్రత్యామ్నాయ గొట్టాలు (Stunts) వేయాలి, 6-7 లక్షల్లో ఖర్చు అవి
కాకుండా ఆ వ్యక్తి యొక్క వయసు ఇతర ఆరోగ్య కారణాలవల్ల అత్యవసర వైద్యం
అందించాలి అని చెప్పారు . ప్రథమో దైవ్యో భిషక్ అని నమ్మిన ఆయన కుమారుడు
సర్వ నిర్ణయ బాధ్యతలూ అక్కడి ముఖ్య వైద్యునికే అప్పగించి ఏది మంచి అని
వైద్యులు తలుస్తే అది చేయమని కుటుంబసభ్యులు చెప్పినతరవాత మరునాడు
శస్త్రచికిత్స విభాగంలో ఆ Stunts వేసే కార్యక్రమం మొదలు పెట్టారు అది
దాదాపు 2 గం పడుతుంది అని చెప్పారు. ఆ వ్యక్తి భార్య, కోడలు
సౌందర్యలహరిలోని ఇరవై ఎనిమిదో శ్లోకం చదువుతూ మననం చేసుకుంటూ ఉన్నారు.
ఐతే అది మొదలు పెట్టే ముందు వైద్యులు ఇంకా ఏదో ఒక టెస్ట్ చేసి చూద్దాము
మూడవ Stunt అవసరమో లేదో అని చూస్తే అసలు రెండవది కూడా అవసరంలేదని ఆ
పరీక్షలో తేలింది. అంతకు ముందు రెండు గంటల వరకూ మూడు Stunts వేయాలని
తయారైన వైద్యులు, అందుకు మానసికంగా సిద్ధపడిన ఆ వ్యక్తి మరియు కుటుంబ
సభ్యులకు ఇది ఆశ్చర్యం. ఈ కేసుని ఆ వైద్యాలయం కి సంబంధించిన కళాశాల
విద్యార్థులకై, టెస్టులకి సంబంధించిన పరికరాల్ని అందించిన కంపెనీ వారి
ప్రత్యేక జాబితాలోకూడా రిజిష్టరు చేసారు. కేవలం ఒకే ఒక్క స్టంట్ వేసి
మిగిలినవి ఏదో లేటెస్ట్ డ్రిల్లింగ్ టెక్నాలజీతో క్లీన్ చేసి 45నిలలో
పూర్తి చేసారు.

సౌందర్యలహరిలోని ఇరవై ఎనిమిదో శ్లోకం
సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం
విపద్యన్తే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః
కరాలం యత్ క్ష్వేలం కబలితవతం కాలకలనా
న శమ్భోస్తన్మూలం తవ జనని తాటఙ్కమహిమా

ఆది శంకరుల పాదాలకు నమస్కరిస్తూ

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు



nagendrakumar ayyagaari


 శ్రీ గణేశాయ నమః | శ్రీ దత్తాత్రేయాయ నమః | |

ఋషయ ఊవచా :

కథం సంకల్పసిద్ధిః స్యాద్ వేదవ్యాస కలౌ యుగే |
ధర్మార్థకామ మోక్షాణాం సాధనం కిముదాహృతమ్ |
| వ్యాస ఉవాచ శృణ్వంతు ఋషయ స్సర్వే శీఘ్రం సంకల్పసాధనమ్ | సకృదుచ్చారమాత్రేణ భోగమోక్షప్రదాయకమ్ | | గౌరీశృంగే హిమవతః కల్పవృక్షోపశోభితమ్ | దీప్తే దివ్యమహారత్న హేమమండపమధ్యగమ్ | | రత్నసింహాసనాసీనం ప్రసన్నం పరమేశ్వరమ్ | మందస్మితముఖాంభోజం శంకరం ప్రాహ పార్వతీ | | శ్రీ దేవి ఉవాచ దేవదేవ మహాదేవ లోకశంకర శంకర | మంత్రజాలాని సర్వాణి యంత్రజాలాని కృత్స్నశః | | తంత్రజాలాన్యనేకాని మయా త్వత్తః శృతాని వై | ఇదానీం ద్రష్టుమిచ్ఛామి విశేషేణ మహీతలమ్ | | ఇత్యుదీరితమాకర్ణ్య పార్వత్యా పరమేశ్వరః | కరేణామృజ్య సంతోషాత్ పార్వతీం ప్రత్యభాషత | | మయేదానీం త్వయా సార్ధం వృషమారుహ్య గమ్యతే | ఇత్యుక్త్వా వృషమారుహ్య పార్వత్యా సహ శంకరః | | యయౌ భూమండలం ద్రష్టుం గౌర్యాశ్చిత్రాణి దర్శయన్ | క్వచిత్ వింధ్యాచలప్రాంతే మహారణ్యే సుదుర్గమే | | తత్ర వ్యాహర్తుమాయాంతం భిల్లం పరశుధారిణమ్ | వధ్యమానం మహావ్యాఘ్రం నఖదంష్ట్రాభిరావృతమ్ | | అతీవ చిత్రచారిత్ర్యం వజ్రకాయసమాయుతమ్ | అప్రయత్నమనాయాసమఖిన్నం సుఖమాస్థితమ్ | | పలాయంతం మృగం పశ్చాద్వ్యాఘ్రో భీత్యా పలాయతః | ఏతదాశ్చర్యమాలోక్య పార్వతీ ప్రాహ శంకరమ్ | | శ్రీ దేవి ఉవాచ కిమాశ్చర్యం కిమాశ్చర్యమగ్రే శంభో నిరీక్ష్యతామ్ | ఇత్యుక్తః స తతః శంభుర్దృష్ట్వా ప్రాహ పురాణవిత్ | | శ్రీ శంకర ఉవాచ గౌరి వక్ష్యామి తే చిత్రమవాఙ్మనసగోచరమ్ | అదృష్టపూర్వమస్మాభిర్నాస్తి కించిన్న కుత్రచిత్ | | మయా సమ్యక్ సమాసేన వక్ష్యతే శృణు పార్వతి | అయం దూరశ్రవా నామ భిల్లః పరమధార్మికః | | సమిత్కుశప్రసూనాని కందమూలఫలాదికమ్ | ప్రత్యహం విపినం గత్వా సమాదాయ ప్రయాసతః | | ప్రియే పూర్వం మునీంద్రేభ్యః ప్రయచ్ఛతి న వాంఛతి | తేపి తస్మిన్నపి దయాం కుర్వతే సర్వమౌనినః | | దలాదనో మహాయోగీ వసన్నేవ నిజాశ్రమే | కదాచిదస్మరత్ సిద్ధం దత్తాత్రేయం దిగంబరమ్ | | దత్తాత్రేయః స్మర్తృగామీ చేతిహాసం పరీక్షితుమ్ | తత్ క్షణాత్ సోపి యోగీంద్రో దత్తాత్రేయః సముత్థితః | | తం దృష్ట్వాశ్చర్యతోషాభ్యాం దలాదనమహామునిః | సంపూజ్యాగ్రే విషీదంతం దత్తాత్రేయమువాచ తమ్ | | మయోపహూతః సంప్రాప్తో దత్తాత్రేయ మహామునే | స్మర్తృగామీ త్వమిత్యేతత్ కింవదంతీం పరీక్షితుమ్ | | మయాద్య సంస్మృతోపి త్వమపరాధం క్షమస్వ మే | దత్తాత్రేయో మునిం ప్రాహ మమ ప్రకృతిరీదృశీ | | అభక్త్యా వా సుభక్త్యా వా యః స్మరేన్మామనన్యధీః | తదానీం తముపాగమ్య దదామి తదభీప్సితమ్ | | దత్తాత్రేయో మునిం ప్రాహ దలాదనమునీశ్వరమ్ | యదిష్టం తద్ వృణీష్వ త్వం యత్ ప్రాప్తోహం త్వయాస్మృతః | | దత్తాత్రేయం మునిం ప్రాహ మయా కిమపి నోచ్యతే | త్వచ్చిత్తే యత్ స్థితం తన్మే ప్రయచ్ఛ మునిపుంగవ | | శ్రీ దత్తాత్రేయ ఉవాచ మమాస్తి వజ్రకవచం గృహాణేత్యవదన్మునిమ్ | తథేత్యంగీకృతవతే దలాదమునయే మునిః | | స్వవజ్రకవచం ప్రాహ ఋషిచ్ఛందః పురస్సరమ్ | న్యాసం ధ్యానం ఫలం తత్ర ప్రయోజనమశేషతః | | అస్య శ్రీదత్తాత్రేయ వజ్రకవచస్తోత్ర మంత్రస్య, కిరాతరూపీ మహారుద్ర ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తాత్రేయో దేవతా, ద్రాం బీజం, ఆం శక్తిః, క్రౌం కీలకమ్, ఓం ఆత్మనే నమః ఓం ద్రీం మనసే నమః ఓం ఆం ద్రీం శ్రీం సౌః ఓం క్లీం క్లాం క్లూం క్లైం క్లౌం క్లః శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః కరన్యాసః ఓం ద్రాం అంగుష్టాభ్యాం నమః ఓం ద్రీం తర్జనీభ్యాం నమః ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః ఓం ద్రైం అనామికాభ్యాం నమః ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః ఓం ద్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః హృదయాది న్యాసః ఓం ద్రాం హృదయాయ నమః ఓం ద్రీం శిరసే స్వాహా ఓం ద్రూం శిఖాయై వషట్ ఓం ద్రైం కవచాయ హుం ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్ ఓం ద్రః అస్త్రాయ ఫట్ ఓం భూర్భువః స్వరోమితి దిగ్బంధః ధ్యానమ్ జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే | దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే | | కదా యోగీ కదా భోగీ కదా నగ్నః పిశాచవత్ | దత్తాత్రేయో హరిః సాక్షాద్ భుక్తిముక్తి ప్రదాయకః | | వారాణసీపురస్నాయీ కొల్హాపుర జపాదరః | మాహురీపురభిక్షాశీ సహ్యశాయీ దిగంబరః | | | స్నిగ్ధధావల్య యుక్తాక్షోత్యంతనీలకనీనికః | భ్రూవక్షఃశ్మశ్రునీలాంకః శశాంకసదృశాననః | | హాసనిర్జితనీహారః కంఠనిర్జితకంబుకః | మాంసలాంసో దీర్ఘబాహుః పాణినిర్జితపల్లవః | | విశాలపీనవక్షాశ్చ తామ్రపాణిర్దలోదరః | పృథులశ్రోణిలలితో విశాలజఘనస్థలః | గూఢగుల్ఫః కూర్మపృష్ఠో లసత్వాదోపరిస్థలః | | రక్తారవిందసదృశరమణీయపదాధరః | చర్మాంబరధరో యోగీ స్మర్తృగామీ క్షణే క్షణే | | జ్ఞానోపదేశనిరతో విపద్ధరణదీక్షితః | సిద్ధాసనసమాసీన ఋజుకాయో హసన్ముఖః | | వామహస్తేన వరదో దక్షిణేనాభయంకరః | బాలోన్మత్త పిశాచీభిః క్వచిద్ యుక్తః పరీక్షితః | | త్యాగీ భోగీ మహాయోగీ నిత్యానందో నిరంజనః | సర్వరూపీ సర్వదాతా సర్వగః సర్వకామదః | | భస్మోద్ధూలితసర్వాంగో మహాపాతకనాశనః | భుక్తిప్రదో ముక్తిదాతా జీవన్ముక్తో న సంశయః | | ఏవం ధ్యాత్వానన్యచిత్తో మద్వజ్రకవచం పఠేత్ | మామేవ పశ్యన్సర్వత్ర స మయా సహ సంచరేత్ | | దిగంబరం భస్మసుగంధ లేపనం చక్ర త్రిశూలం డమరుం గదాయుధమ్ | పద్మాసనం నిత్యమ్ | | పంచోపచార పూజా ఓం లం పృథివీతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, గంధం పరికల్పయామి ఓం హం ఆకాశతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, పుష్పం పరికల్పయామి ఓం యం వాయుతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, ధూపం పరికల్పయామి ఓం రం అగ్నితత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, దీపం పరికల్పయామి ఓం వం అమృతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, అమృతనైవేద్యం పరికల్పయామి ఓం సం సర్వతత్వాత్మనే శ్రీ దత్తాత్రేయాయ నమః, తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి అనంతరం "ఓం ద్రాం" ఇతి మూలమంత్రం 108 వారం జపేత్


ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం
ఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాంఓం ద్రాంఓం ద్రాం ఓం ద్రాం

అథ వజ్రకవచమ్

ఓం దత్తాత్రేయః శిరః పాతు సహస్రాబ్జేషు సంస్థితః | భాలం పాత్వానసూయేయశ్చంద్రమండలమధ్యగః | |
కూర్చం మనోమయః పాతు హం క్షం ద్విదలపద్మభూః | జ్యోతీరూపోక్షిణీ పాతు పాతు శబ్దాత్మకః శ్రుతీ | |
నాసికాం పాతు గంధాత్మా ముఖం పాతు రసాత్మకః | జిహ్వాం పాతు వేదాత్మకః దంతోష్ఠౌ పాతు ధార్మికః | |
కపోలావత్రిభూః పాతు పా త్వశేషం మమాత్మవిత్ | సర్వాత్మా షోడశారాబ్జస్థితః స్వాత్మావతాద్ గలమ్ | |
స్కంధౌ చంద్రానుజః పాతు భుజౌ పాతు కృతాదిభూః | జతృణీ శత్రుజిత్ పాతు పాతు వక్షఃస్థలం హరిః | |
కాదిఠాంతద్వాదశారపద్మగో మరుదాత్మకః | యోగీశ్వరేశ్వరః పాతు హృదయం హృదయస్థితః | |
పార్శ్వే హరిః పార్శ్వవర్తీ పాతు పార్శ్వస్థితః స్మృతః | హఠయోగాది యోగజ్ఞః కుక్షీం పాతు కృపానిధిః | |
డకారాదిఫకారాంత దశారసరసీరుహే | నాభిస్థలే వర్తమానో నాభిం వహ్న్యాత్మకోవతు | |
వహ్నితత్వమయో యోగీ రక్షతాన్మణిపూరకమ్ | కటిం కటిస్థబ్రహ్మాండవాసుదేవాత్మకోవతు | |
బకారాదిలకారాంత షట్పత్రాంబుజబోధకః | జలత్వమయో యోగీ స్వాధిస్ఠానం మమావతు | |
సిద్ధాసన సమాసీన ఊరూ సిద్ధేశ్వరోవతు | వాదిసాంతచతుష్పత్రసరోరుహనిబోధకః | |
మూలాధారం మహీరూపో రక్షతాద్ వీర్యనిగ్రహీ | పృష్ఠం చ సర్వతః పాతు జానున్యస్తకరాంబుజః | |
జంఘే పాత్వవధూతేంద్రః పాత్వంఘ్రీ తీర్థపావనః | సర్వాంగం పాతు సర్వాత్మా రోమాణ్యవతు కేశవః | |
చర్మం చర్మాంబరః పాతు రక్తం భక్తిప్రియోవతు | మాంసం మాంసకరః పాతు మజ్జాం మజ్జాత్మకోవతు | |
అస్థీని స్థిరధీః పాయాన్మేధాం వేధాః ప్రపాలయేత్ | శుక్రం సుఖకరః పాతు చిత్తం పాతు దృఢాకృతిః | |
మనోబుద్ధిమహంకారం హృషీకేశాత్మకోవతు | కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః | |
బంధూన్ బంధూత్తమః పాయాచ్ఛత్రుభ్యః పాతు శత్రుజిత్ | గృహారామధనక్షేత్రపుత్రాదీన్ శంకరోవతు | |
భార్యాం ప్రకృతివిత్ పాతు పశ్వాదీన్ పాతు శార్ఙ్గభృత్ | ప్రాణాన్ పాతు ప్రధానజ్ఞో భక్ష్యాదీన్ పాతు భాస్కరః | |
సుఖం చంద్రాత్మకః పాతు దుఃఖాత్ పాతు పురాంతకః | పశూన్ పశుపతిః పాతు భూతిం భూతేశ్వరో మమ | |
ప్రాచ్యాం విషహరః పాతు పాత్వాగ్నేయ్యాం మఖాత్మకః | యామ్యాం ధర్మాత్మకః పాతు నైరృత్యాం సర్వవైరిహృత్ | |
వరాహః పాతు వారుణ్యాం వాయవ్యాం ప్రాణదోవతు | కౌబేర్యాం ధనదః పాతు పాత్వైశాన్యాం మహాగురుః | |
ఊర్ధ్వం పాతు మహాసిద్ధః పాత్వధస్తాజ్జటాధరః | రక్షాహీనం తు యత్ స్థానం రక్షత్వాదిమునీశ్వరః | | హృదయాది న్యాసః ఓం ద్రాం హృదయాయ నమః ఓం ద్రీం శిరసే స్వాహా ఓం ద్రూం శిఖాయై వషట్ ఓం ద్రైం కవచాయ హుం ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్ ఓం ద్రః అస్త్రాయ ఫట్ ఓం భూర్భువః స్వరోమితి దిగ్బంధః ఏతన్మే వజ్రకవచం యః పఠేత్ శృణుయాదపి | వజ్రకాయశ్చిరంజీవీ దత్తాత్రేయోహమబ్రువమ్ | | త్యాగీ భోగీ మహాయోగీ సుఖదుఃఖ వివర్జితః | సర్వత్ర సిద్ధసంకల్పో జీవన్ముక్తోద్య వర్తతే | | ఇత్యుక్త్వాంతర్దధే యోగీ దత్తాత్రేయో దిగంబరః | దలాదనోపి తజ్జప్త్వా జీవన్ముక్తః స వర్తతే | | భిల్లో దూరశ్రవా నామ తదానీం శృతవానిదమ్ | సకృచ్ఛ్రవణమాత్రేణ వజ్రాంగోభవదప్యసౌ | | ఇత్యేతద్ వజ్రకవచం దత్తాత్రేయస్య యోగినః | శృత్వా శేషం శంభు ముఖాత్ పునరప్యాహ పార్వతీ | | శ్రీ దేవి ఉవాచ ఏతత్ కవచమాహాత్మ్యం వద విస్తరతో మమ | కుత్ర కేన కదా జాప్యం కియజ్జాప్యం కథం కథమ్ | | ఉవాచ శంభుస్తత్ సర్వం పార్వత్యా వినయోదితమ్ | శృణు పార్వతి వక్ష్యామి సమాహితమనావిలమ్ | | ధర్మార్థకామమోక్షాణామిదమేవ పరాయణమ్ | | | పుత్రమిత్ర కలత్రాది సర్వసంతోషసాధనమ్ | వేదశాస్త్రాది విద్యానాం విధానం పరమం హి తత్ | | సంగీత శాస్త్ర సాహిత్య సత్కవిత్వ విధాయకమ్ | బుద్ధి విద్యా స్మృతి ప్రజ్ఞా మతి ప్రౌఢిప్రదాయకమ్ | | సర్వసంతోషకరణం సర్వదుఃఖనివారణమ్ | శత్రుసంహారకం శీఘ్రం యశః కీర్తి వివర్ధనమ్ | | అష్టసంఖ్యా మహారోగాః సన్నిపాతాస్త్రయోదశః | షణ్ణవత్యక్షిరోగాశ్చ వింశతి ర్మేహరోగకాః | | అష్టాదశ తు కుష్ఠాని గుల్మాన్యష్టవిధాన్యపి | అశీతిర్వాతరోగాశ్చ చత్వారింశత్తు పైత్తికాః | | వింశతి శ్లేష్మరోగాశ్చ క్షయ చాతుర్థికాదయః | మంత్ర యంత్ర కుయోగాద్యాః కల్పతంత్రాదినిర్మితాః | | బ్రహ్మరాక్షస వేతాల కూష్మాండాది గ్రహోద్భవాః | సంగజా దేశకాలస్థాస్తాపత్రయసముత్థితాః | | నవగ్రహసముద్భూతా మహాపాతక సంభవాః | సర్వే రోగాః ప్రణశ్యంతి సహస్రావర్తనాద్ ధ్రువమ్ | | అయుతావృతిమాత్రేణ వంధ్యాపుత్రవతీ భవేత్ | అయుతద్వితయావృత్త్యా హ్యపమృత్యుజయో భవేత్ | | అయుతత్రితయాచ్చైవ ఖేచరత్వం ప్రజాయతే | సహస్రాదయుతాదర్వాక్ సర్వకార్యాణి సాధయేత్ | | లక్షావృత్త్యా సర్వసిద్ధిర్భవత్యే న సంశయః | | విషవృక్షస్య మూలేషు తిష్ఠన్ వై దక్షిణాముఖః | కురుతే మాసమాత్రేణ వైరిణం వికలేంద్రియమ్ | | ఔదుంబరతరోర్మూలే వృద్ధికామేన జాప్యతే | శ్రీ వృక్షమూలే శ్రీకామీ తింత్రిణీ శాంతికర్మణి | | ఓజస్కామోశ్వత్థమూలే స్త్రీకామైః సహకారకే | జ్ఞానార్థీ తులసీమూలే గర్భగేహే సుతార్థిభిః | | ధనార్థిభి స్తు సుక్షేత్రే పశుకామైస్తు గోష్ఠకే | దేవాలయే సర్వకామైస్తత్కాలే సర్వదర్శితమ్ | | నాభిమాత్ర జలే స్థిత్వా భానుమాలోక్య యో జపేత్ | యుద్ధే వా వా శాస్త్రవాదే సహస్రేణ జయో భవేత్ | | కంఠమాత్రే జలే స్థిత్వా యో రాత్రౌ కవచం పఠేత్ | | | యత్ర యత్ స్యాత్ స్థిరం యద్యత్ ప్రసక్తం తన్నివర్తతే | తేన తత్ర హి జప్తవ్యం తతః సిద్ధిర్భవేద్ధృవమ్ | | ఇత్యుక్తవాన్ శివో గౌర్యై రహస్యం పరమం శుభమ్ | యః పఠేత్ వజ్రకవచం దత్తాత్రేయ సమో భవేత్ | | ఏవం శివేన కథితం హిమవత్సుతాయై ప్రోక్తం దలాదమునయేత్రిసుతేన పూర్వమ్ | యః కోపి వజ్రకవచం పఠతీహలోకే దత్తోపమశ్చరతి యోగివరశ్చిరాయుః | | ఇతి శ్రీ రుద్రయామళే హిమవత్ఖండే మంత్రశాస్త్రే ఉమామహేశ్వరసంవాదే శ్రీ దత్తాత్రేయవజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్ శ్రీ గురు దత్త - జయ గురు దత్త

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్ - తాత్పర్యం


పూర్వం వేదవ్యాస మహర్షిని సంకల్పసిద్ధి పొందే ఉపాయం చెప్పమని ఋషులు అడిగిరి. అందుకు వేదవ్యాస మహర్షి, ఒక్కసారి చదివితే చాలు సంకల్పాన్ని సిద్ధింపచేసేది, భోగమోక్షాలను ప్రసాదించేది చెపుతాను, అందరూ వినండి అంటూ ఉపక్రమించాడు. హిమవత్పర్వత గౌరీశృంగంపై రత్నసింహాసనం మీద ఆసీనుడై ఉన్న పరమేశ్వరునితో ఒకనాడు పార్వతీ దేవి, "ఓ లోక శంకరా! నీవల్ల అనేక మంత్రాలను, యంత్రాలను, తంత్రాలను తెలుసుకున్నాను, ఇప్పుడు మహీతలాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను" అని పలికింది. పార్వతి కోరికను సంతోషంతో అంగీకరించిన పరమేశ్వరుడు వృషభవాహనం పై బయలు దేరి భూలోక వింతలు చూపించసాగాడు. వారు వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక దుర్గమమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ వారికి గొడ్డలి ధరించి సమిధలను సేకరిస్తున్న ఒక కిరాతుడు కనిపించాడు. అతని శరీరం వజ్రము వలె ధృఢముగా ఉన్నది. ఇంతలో ఒక పెద్ద పులి అతని పై దాడి చేయుటకు వేగముగా వచ్చినది. అయితే దానిని చూచిన కిరాతుడు తనను రక్షించుకొనుటకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా సంతోషముతో నిర్భయముగా నిలబడి ఉన్నాడు. అదే సమయములో ఒక లేడి పరిగెత్తుకుంటూ అక్కడకు రాగా దానిని చూచిన పులి బెదిరి పారిపోయింది. ఈ వింతను చూసిన పార్వతి శంకరునితో "ఏమాశ్చర్యం! ప్రభూ, ఎదురుగా చూడు" అన్నది. దానికి పరమేశ్వరుడు "దేవీ! మేము చూడనిదంటూ లోకంలో ఏ కొంచమూ లేదు. వాక్కులకు, మనస్సుకు అందని అద్భుతం నీకు చెబుతాను, విను" అంటూ చెప్పనారంభించాడు. ఈ భిల్లుని పేరు దూరశ్రవుడు. పరమ ధార్మికుడు. ప్రతీరోజూ అడవికి వెళ్ళి కష్టపడి సమిధలూ, దర్భలూ, పుష్పాలూ, కందమూల ఫలాలూ తెచ్చి మునీంద్రులకిస్తాడు. ప్రతిఫలంగా తానేమీ కోరడు. ఆ మునులందరూ కూడా అతని పట్ల దయతో ఉంటారు. అక్కడే దలాదనుడను మహాయోగి ఉన్నాడు. ఒకనాడు దలాదనుడు, "దత్తాత్రేయుడు స్మర్తృగామి (స్మరించినవారి వద్దకు తక్షణమే వెళతాడు)" అని విన్న కథను తలుచుకొని, దత్తుని స్మరించాడు. మరుక్షణంలో దత్త యోగీంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దలాదన మహర్షి ఆశ్చర్యానందాలు పెల్లుబికగా ఆయనను పూజించి, "ఓ దత్తాత్రేయ మహామునీ! నా ఆహ్వానం విని నీవు విచ్చేశావు. స్మర్తృగామివని విని, కేవలం పరీక్షించడానికే నిన్ను స్మరించాను. నా అపరాధం మన్నించు." అన్నాడు. అందుకు దత్త భగవానుడు ఆ మునితో "నా ప్రకృతి ఇటువంటిది. భక్తితోగాని, భక్తి లేకుండా కాని అనన్యచిత్తంతో నన్ను స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారి కోరికలు తీరుస్తాను" అని చెప్పాడు. "నీవు తలచుకున్నందుకు వచ్చాను గదా, నీకు ఏమి కావాలో కోరుకో" అని దత్తుడు అడుగగా, దలాదుడు, "ఓ మునిపుంగవా! నేనేమీ అడగను. నీ మనస్సులో ఉన్నది, నాకు శ్రేయస్కరమైనది నాకు ప్రసాదింపుము" అన్నాడు. శ్రీ దత్తాత్రేయుడు, "నా వజ్రకవచం ఉన్నది, తీసుకో" అని చెప్పగా, దలాదుడు అంగీకరించాడు . దత్తుడు తన వజ్రకవచమునకు సంబంధించిన ఋషినీ, ఛందస్సునూ చెప్పి, న్యాసం, ధ్యానం, ప్రయోజనము అన్నీ వివరించి చెప్పాడు. దత్తాత్రేయ ధ్యానమ్: జగత్తు అనే మొక్కకు దుంప వంటి వాడు, సచ్చిదానంద మూర్తి, యోగీంద్రచంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము. ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు నగ్నంగా పిశాచి వలె ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష హరి స్వరూపుడు. భుక్తి ముక్తి ప్రదాయకుడు. ఆయన ప్రతిదినమూ వారణాసిలో స్నానము, కొల్హాపురంలో జపము, మాహురీపురంలో భిక్ష స్వీకరించి, సహ్యాద్రిపై శయనిస్తాడు. ఆయన శరీరం ఇంద్రనీలమణి వలె, కాంతి వెన్నెల వలె, జటలు వైఢూర్యం వలే ఉంటాయి. కన్నులు తెల్లగా మైత్రితో, కనుపాపలు చాలా నీలంగా ఉంటాయి. కనుబొమలూ, గుండెలపై రోమాలూ, గెడ్డమూ, మీసాలూ నల్లగా ఉంటాయి. నవ్వు పొగమంచు కంటే చల్లగా, కంఠం శంఖం కంటే అందంగా ఉంటాయి. భుజాలు పుష్ఠిగా ఉంటాయి. బాహువులు పొడవుగా, చేతులు చిగుళ్ళ కంటే కోమలంగా ఉంటాయి. వక్షస్థలం విశాలంగా బలిసి ఉంటుంది. పలుచటి ఉదరంతో, విశాలమైన పిరుదులతో, అందంగా ఉంటాడు. కటి స్థలం విశాలంగా, తొడలు అరటిబోదెల వలె ఉంటాయి. చక్కటి మోకాళ్ళు, పిక్కలూ కలిగి ఉంటాడు. చీలమండలు గూఢంగా ఉంటాయి. పాదాల పైభాగాలు తాబేటి డిప్పల వలె ఉంటాయి. అరికాళ్ళు ఎర్ర తామర పువ్వుల వలె అందంగా ఉంటాయి. ఆయన మృగచర్మమును వస్త్రంగా ధరిస్తాడు. ప్రతీక్షణమూ తనను తలచుకున్న వారి వద్దకు వెళుతుంటాడు. జ్ఞానోపదేశం చేయటమంటే ఇష్టం. ఆపదలు తొలగించటం ఆయన దీక్ష. సిద్ధాసనంలో నిటారుగా కూర్చుని ఉంటాడు. నవ్వు ముఖం. ఎడమచేత వరదముద్ర, కుడిచేత అభయ ముద్ర. బాలురు, ఉన్మత్తులు, పిశాచాలతో కలిసి తిరుగుతుంటాడు. త్యాగి. భోగి. మహాయోగి. నిత్యానందుడు. నిరంజనుడు, సర్వరూపి, సర్వదాత, సర్వగామి. సర్వకామదుడు. భస్మోద్ధూళిత శరీరుడు. మహాపాతకాలను నాశనం చేసేవాడు. భోగ మోక్ష ప్రదాయకుడు. "ఇలా ధ్యానం చేసి అనన్యచిత్తంతో నా వజ్రకవచాన్ని పఠించాలి. సర్వత్రా నన్నే దర్శిస్తూ, నాతో సంచరించాలి" అని దత్తుడు తెలిపాడు. దత్తుడు దిగంబరుడు, భస్మ సుగంధం పూసుకున్నవాడు. చక్రం, త్రిశూలం, డమ్రువు, గద అనే ఆయుధాలు ధరించినవాడు. పద్మాసనుడు. యోగీంద్రులూ, మునీంద్రులూ నిత్యమూ ఆయనను "దత్తా, దత్తా" అంటూ నమస్కరిస్తూంటారు. దత్తాత్రేయ వజ్రకవచమ్: ఓం, దత్తాత్రేయుడు సహస్రార కమలంలో ఉండి, శిరస్సును రక్షించుగాక. అనసూయేయుడు చంద్రమండల మధ్యభాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. మనోమయుడు హం క్షం ద్విదళ పద్మభవుడై భ్రూమధ్యమును రక్షించుగాక. జ్యోతిరూపుడు రెండు కన్నులను, శబ్ద స్వరూపుడు రెండు చెవులను, గంధ స్వరూపుడు ముక్కును, రస స్వరూపుడు నోటిని, వేద స్వరూపుడు నాలుకను, ధర్మ స్వరూపుడు దంతాలను మరియూ రెండు పెదవులను కాపాడుగాక. అత్రిభవుడు నా చెక్కిళ్ళను, ఆ తత్వవేత్త నా ముఖమంతటినీ కాపాడుగాక. సర్వస్వరూపుడు, నా ఆత్మలో ఉండేవాడు షోడశారకమలంలో ఉండి, నా కంఠాన్ని రక్షించుగాక. చంద్రానుజుడు నా భుజ శిరస్సులను, కృతాదిభవుడు నా భుజాలను, శత్రుజిత్తు కొంకులను, హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. కకారాది ఠకారాంతమైన ద్వాదశారకమలంలో ఉన్న వాయు స్వరూపుడు యోగీశ్వరేశ్వరుడు నా హృదయాన్ని రక్షించుగాక. పార్శ్వస్థితుడనే హరి నా పార్శ్వాలను, హఠయోగాది యోగజ్ఞుడు మరియు కృపానిధి నా కుక్షినీ కాపాడుగాక. డకారాది ఫకారాంతం కల దశారకమలంలో ఉండే అగ్ని స్వరూపుడు నా నాభిని, వహ్నితత్వమయుడైన యోగి నా మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలోని బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడు నా కటిని కాపాడుగాక. బకారాది లకారాంతమైన షట్పత్రకమలాన్ని వికసింపచేసే జలతత్వమయుడైన యోగి నా స్వాధిష్ఠాన చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా ఊరువులను కాపాడుగాక. వకారాది సకారాంతమైన నాలుగు రేకుల కమలాన్ని వికసింపచేసే మహీరూపుడైన వీర్యనిగ్రహశాలి, మోకాళ్ళపై హస్తపద్మాలు పెట్టుకున్నవాడు నా మూలాధార చక్రాన్ని, ఇంకా అన్ని వైపులనుండీ నా పృష్ఠాన్ని రక్షించుగాక. అవధూతేంద్రుడు నా పిక్కలను, తీర్థపావనుడు నా రెండు పాదాలను, సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక. కేశవుడు నా రోమాలను రక్షించుగాక. చర్మాంబరుడు నా చర్మాన్ని, భక్తిప్రియుడు నా రక్తాన్ని, మాంసకరుడు నా మాంసాన్ని, మజ్జాస్వరూపుడు నా మజ్జను, స్థిరబుద్ధి గలవాడు నా అస్థులను, వేధ నా మేధను, సుఖకరుడు నా శుక్రాన్ని కాపాడుగాక. దృఢాకృతి నా చిత్తాన్ని, హృషీకేశాత్మకుడు నా మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని, ఈశుడు నా కర్మేంద్రియాలను, అజుడు నా జ్ఞానేంద్రియాలను రక్షించుగాక. బంధూత్తముడు నా బంధువులను కాపాడుగాక. శత్రుజిత్తు నన్ను శత్రువులనుండి కాపాడుగాక. శంకరుడు నా ఇల్లు, తోట, ధనం, పొలం, పుత్రులు మొదలైనవి రక్షించుగాక. ప్రకృతివిదుడు నా భార్యను కాపాడుగాక. శార్ ఙ్గభృత్తు నా పశువులను రక్షించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను, భాస్కరుడు నా భక్ష్యాదులను, చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు నన్ను దుఃఖం నుండి రక్షించుగాక. పశుపతి నా పశువులను, భూతేశ్వరుడు నా ఐశ్వర్యాన్ని పాలించుగాక. విషహరుడు తూర్పున, యజ్ఞస్వరూపుడు ఆగ్నేయాన, ధర్మాత్మకుడు దక్షిణాన, సర్వవైరిహృత్ నైరృతి మూల, వరాహుడు పడమటి దిక్కున, ప్రాణదుడు వాయువ్యపు మూల, ధనదుడు ఉత్తరాన, మహాగురుడు ఈశాన్యాన, మహాసిద్ధుడు ఊర్ధ్వదిక్కున, జటాధరుడు అధోదిశన రక్షించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిక్కు రక్షణ లేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి. "ఈ నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా విన్నా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడు. అతడు త్యాగి, భోగి, మహాయోగి, సుఖ దుఃఖ రహితుడు, సర్వత్ర సిద్ధసంకల్పుడు, జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు." అని చెప్పి దత్తాత్రేయ యోగి అంతర్థానం చెందాడు. దలాదుడు కూడా అది జపించి జీవన్ముక్తుడైనాడు. దూరశ్రవుడు అనే భిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు. ఒక్కసారి విన్నంతనే వజ్రకాయుడయ్యాడు. దత్తాత్రేయ కవచమంతా శివుని నోట విన్న పార్వతి, "ఈ కవచం మహత్మ్యమూ, ఉపయోగించే విధానమూ తెలియచేయ" మని అన్నది. వినయంగా అడిగిన పార్వతి ప్రశ్నకు, "ఓ పార్వతీ ఏకాగ్రతతో విను. ధర్మార్థకామ మోక్షాలకు ఇదే ఆధారం" "ఇది ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ, కాలిబంట్లనూ, సర్వైశ్వర్యాన్ని ఇస్తుంది. పుత్ర మిత్ర కళత్రాది సర్వసంతోష సాధనము. వేదశాస్త్రాది విద్యలకు నిధానము. సంగీత, శాస్త్ర సాహిత్య, సత్కవిత్వాలను ప్రసాదిస్తుంది. బుద్ధిని, విద్యను , తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును ఇస్తుంది. శత్రువులను శీఘ్రమే సంహరిస్తుంది. యశస్సును, కీర్తినీ పెంచుతుంది. " "దీనిని వెయ్యి సార్లు జపిస్తే ఎనిమిది మహారోగాలూ, పదమూడు సన్నిపాతాలూ, తొంభై ఆరు కంటిజబ్బులూ, ఇరవై మేహ రోగాలూ, పద్దెనిమిది కుష్ఠు రోగాలూ, ఎనిమిది విధాల గుల్మాలూ, ఎనభై వాత రోగాలూ , నలభై పైత్య రోగాలూ, ఇరవై శ్లేష్మ రోగాలూ, క్షయ, చాతుర్థికం మొదలైనవీ, మంత్ర యంత్ర, కుత్సిత యోగాదులూ, కల్పతంత్రాదుల వల్ల కలిగించినవీ, బ్రహ్మరాక్షసులూ, భేతాళులూ, కూష్మాండాది గ్రహాలూ, వీటి వల్ల కలిగినవీ, ఆయా దేశకాలాలలో ఉన్నవీ, తాపత్రయం వల్ల కలిగినవీ, నవగ్రహాల వల్ల ఏర్పడినవీ, మహాపాతకాల వల్ల కలిగినవీ , అన్ని రోగాలూ పూర్తిగా నశిస్తాయి. ఇది నిశ్చయం. " "పది వేలసార్లు జపిస్తే గొడ్రాలు పుత్రవతి అవుతుంది. ఇరవై వేలసార్లు జపిస్తే అపమృత్యుజయం లభిస్తుంది. ముప్ఫై వేల సార్లు జపిస్తే ఆకాశ సంచారం అలవడుతుంది. కోటిమార్లు జపిస్తే సర్వకార్యాలు సాధ్యమవుతాయి. లక్ష సార్లకే కార్యసిద్ధి కలుగుతుంది. సంశయం లేదు." "విషముష్టి చెట్టు మొదట దక్షిణాభిముఖంగా ఒక్క నెల జపిస్తే శత్రువు వికలేంద్రియుడవుతాడు. వృద్ధికి మేడి చెట్టు మొదటా, సిరి కోసం లక్ష్మీ బిల్వం మొదటా, అరిష్టాదుల శాంతికి చింతచెట్టు మొదటా, ఓజస్సు కోసం రావి చెట్టు మొదటా, భార్య కొరకై తీయ మామిడి చెట్టు మొదటా, జ్ఞానార్థం తులసి చెంతా జపించాలి. సంతతి కావాలనుకొనేవారు గర్భగృహంలో, ధనార్థులు మంచి క్షేత్రాలలో, పశువులు కోసం గోశాలలో, ఏ కోరిక గలవరైనా దేవాలయంలోనూ జపించాలి. " "బొడ్డులోతు నీటిలో నిలబడి సూర్యుని చూస్తూ వేయిసార్లు జపించినవాడు యుద్ధంలోగానీ, శాస్త్రవాదంలో గానీ జయిస్తాడు. గొంతులోతు నీటిలో రాత్రిపూట కవచం పఠిస్తే, జ్వరం, అపస్మారం, కుష్ఠు మొదలైన రోగాలూ తాపజ్వరాలూ తొలిగిపోతాయి." "ఏది ఏది ఎక్కడ స్థిరంగా ఉంటుందో, ఏది ఏది ప్రసన్నమైతే అది నివారణమౌతుందో దాని కొరకు అక్కడ జపిస్తే సిద్ధి కలుగుతుంది. ఇది నిశ్చయం. " అని శివుడు చెప్పాడు. ఈ వజ్రకవచాన్ని పఠించినవాడు దత్తాత్రేయ సమానుడౌతాడు. ఈ విధంగా దత్తాత్రేయుడు దలాదునికి చెప్పినది, శివుడు పార్వతికి తెలియచేశాడు. ఈ కవచమును పఠించినవాడు ఈ లోకంలో దత్తుని వలె యోగి, చిరాయుష్మంతుడు అయి చరిస్తాడు.


దత్తాత్రేయ వజ్రకవచ మహత్మ్యాన్ని " శ్రీ దత్తాత్రేయ గురుచరిత్ర "లో కూడా తెలియజేశారు. లలితాదేవికి మంత్రానికి తోడుగా ఎన్నిరకాల స్తోత్రాలు ఉన్నా సహస్రనామాల మహిమ ఏవిధంగా అత్యున్నతమో, చండీ మంత్రానికి తోడుగా ఎన్ని ఉన్నా సప్తశతికి మిగిలినవేవీ ఎలా సాటిరావో, అదేవిధంగా దత్తమంత్రానికి దత్తాత్రేయ వజ్రకవచమని మనం అర్థం చేసుకోవచ్చు. గురుచరిత్ర నుండి: "స్మర్తృగామి అనేది స్వామికి సార్థకమైన బిరుదు అంగన్యాస కరన్యాసాలతో స్వామిని అర్చించే విధానం ఒకటి ఉంది దీనిని దత్తకవచమంటారు... బహిరంతశ్శుద్ధుడైన భక్తుడు దత్తనామాలను ఒక్కొక్కటిగా జపిస్తూ శిరస్సు మొదలుకొని కాలివేళ్ళకొనల వరకూ ఒక్కొక్క అంగాన్ని అంగసంధినీ స్పృశించాలి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో మనోబుద్ధి చిత్తాహంకారాలలో దత్తనామాలను నిక్షేపించాలి. హృదయస్థానంలో అయిదు నామాలను స్థిరపరచాలి (హరి, కాదిఠాంత ద్వాదశారపద్మగో, మరుదాత్మకః, యోగీశ్వరేశ్వరః, హృదయస్థితః). గురువును ఆశ్రయించి ఈ కవచాన్ని ధరించాలి. దత్తకవచధారులకు ఏ రంగంలోనూ అపజయమంటూ ఉండదు. శత్రుభయాలూ దుష్టగ్రహపీడలూ భూతప్రేతపిశాచాల హింసలూ దరిదాపులకైనా రావు. భక్తరక్షణలో ఇది వజ్రకవచం
--