Showing posts with label జయగురుదత్తా. Show all posts
Showing posts with label జయగురుదత్తా. Show all posts
Saturday, September 10, 2011

భగవత్ దర్శనం


భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా సమాజంలో ధర్మస్థాపన చేయాలని ఎందరో యోగులు, మతాధిపతులు, పీఠాధిపతులు కృషి చేశారు, చేస్తున్నారు. ఈ కాలం వారి మాటేమో కానీ గతంలో ఇలా కృషి చేసిన వారంతా నిస్వార్థ, నిరాడంబర మూర్తి స్వరూపులు. వారిలో రామకృష్ణ పరమహంస అగ్రగణ్యులు. ఆయన బంగారాన్ని, మట్టిని సమదృష్టితో చూడమన్నారు. మనిషిలోని వ్యామోహమే అనర్థాలకు మూలమని హెచ్చరించారు. ఆయన బోధల్లో కొనింటిని గమనిద్దాం.

దైవ ఒకరే... పేర్లు అనేకం భగవంతుడు. అంతర్యామి, నిరాకార స్వరూపుడు. రాత్రిపూట నక్షత్రాలు కనిపించనంత మాత్రాన, నక్షత్రాలు లేవని అనగలమా! అదేవిధంగా భగవంతుడు కనిపించడం లేదని అనరాదు. భగవంతునికి అనేక నామములున్నాయి. ఆయన రూపాలు అనంతములుగా ఉన్నాయి. నీకు ఏ పేరు, ఏ రూపం నచ్చిందో.. వాటి సాయంతోనే భగవత్ సాక్షాత్కారం పొందగలవు అంటారు రామకృష్ణ పరమహంస. నీరు ఎక్కడైనా ఒకటే కానీ దాన్ని ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తాతరు.

ఒకరు 'జలం' అంటారు. మరొకరు 'నీరు' ఇంకొకరు 'పానీ' మరొకరు 'వాటర్' అని ఇంకో జాతివారు 'అక్వా' అని అన్నట్లుగానే దేవుడిని కూడా కొందరు 'అల్లా' అని, కొందరు 'హరి' అని, మరికొందరు 'బ్రహ్మ' అని వ్యవహరిస్తారు. సాకార భగవంతుడికి, నిరాకార భగవంతునకు గల వ్యత్యాసాన్ని గ్రహించాలి. మంచుగడ్డలకు నీటికి గల తేడానే ఆ వ్యత్యాసం. నీరు ఘనీభవించి మంచుగడ్డ అవుతుంది. మంచు గడ్డ కరిగి, మళ్లీ నీరై పోతుంది. అప్పుడు దాని ఆకారముం అదృశ్యం అవుతుంది. ఆలాగే భక్తుడికి భగవంతుడు అనేక రూపములతో గోచరిస్తాడు అంటారు రామకృష్ణులు.

భగవంతుడు ఎక్కడ? భగవంతుని ఎలా కనుగొనాలనే సందేహం చాలామందికి కలుగుతుంది. దీనికి రామకృష్ణులు చక్కని సమాధానం ఇచ్చారు. పొద్దు పొడుపునకు మందు చిలికిన వెన్న శ్రేష్ఠము. తర్వాత చిలికినది అంత శ్రేష్ఠము కాదు. అట్లే పసితనం నుంచే భక్తి సాధన చేసి, మనసుని భగవంతునిపై మరల్చిన వారు శ్రేష్ఠులు. ఇలా దైవ చింతన అనేది చిన్నతనం నుంచే పెంపొందేలా చూడాలని ఆయన సూచించేవారు. పిరికితనము, ద్వేషము, భయము పాతుకొని ఉండే హృదయంలో భగవంతుడు ఉండడు. దైవానుగ్రహం పొందాలంటే ఉత్తమ నైతిక జీవనం, చక్కని హృదయం ఉండాలంటారు రామకృష్ణులు.

ఈ కాలంలో ఎంతమంది ఇలా ఉంటున్నారు. సమస్తమైన పాపాలు చేస్తారు. సాటి మనుషులను దోచుకుంటారు. ఇవన్నీ చేసి దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన సరిపోదని గమనించాలి. మురికిగా ఉన్న అద్దము సూర్యకిరణాల్ని సక్రమంగా ప్రతిఫలింపచేయలేదు. అలాగే మాయా మోహితులైన మలిన హృదయులు భగవానుని మహిమలను గ్రహింపలేరు. స్వచ్ఛమయిన అద్దము ఎలా అయితే సూర్యకాంతిని సక్రమంగా ప్రతిఫలింపచేయగలదో అలాగే నిర్మల మనస్కులును భగవంతుని దర్శింపగలరు అంటారు రామకృష్ణులు.

సమస్యలు ఉంటూనే ఉంటాయి. భవబంధాలు తొలగవు. అంతమాత్రాన ఇవేవి దైవపూజకు అడ్డుకావంటారు పరమహంస. స్తంభాన్ని పట్టుకొని దాని చుట్టూ ఎంత వడిగా తిరిగినా పిల్లలు పడిపోరు. అదే విధంగా భగవంతునిపై మనసు నిలిపి, ఈ సంసారిక ధర్మములెన్ని నిర్వర్తించినా నీకు ఏ అపాయం కలుగదు. దైవస్మరణ, దైవచింతన మానసిక ప్రశాంతతకు, మూలమని ఏనాడో రామకృష్ణులు వివరించారు. ఈ కాలంలో బహుళవ్యాప్తిలో ఉన్న ధ్యానం పరమార్థం కూడా ఇదే. సంసార చింతనలో, దిగుళ్లతో మనసు కలత చెందనీయకు.

ఏది ఎప్పుడు అవసరమో దానిని అప్పుడు చేస్తూ మనసును మాత్రం సదా భగవంతునిపై స్థిరముగా నిలిపివుంచు అంటారు రామకృష్ణ పరమహంస. ఇలా రామకృష్ణులు ఆధ్మాత్మిక జీవితం గురించి చక్కగా వివరించారు.

అందుకే ఆయన అభిమానం చూరగొన్న వివేకానందుడు సైతం పాశ్చాత్యులకు అర్థమయ్యే రీతిలో సరళంగా భారతీయ ఆధ్యాత్మిక స్వరూపాన్ని కళ్లకు కట్టించారు. అందకే నేటికీ వారు చిరస్మరణీయులుగా మిగిలారు. వారి ఆధ్యాత్మిక ధార అలా చైతన్య దీపాలు వెలిగిస్తునే ఉంది.


నెల్లూరు జిల్లాలో గౌరవరం అనే గ్రామం లో 1975 నుంచి శిరిడీ సాయి నాధుని మందిరమున్నది .వెంకారెడ్డిగారు వారికుటుంబము ఆమ్ందిర నిర్వాహణ చూస్తుంటారు. కొద్దిమంది వారి సన్నిహితులు కూడా అక్కద బాబాను సేవిస్తుంటారు . ఆరొజులలో బాబాగూర్చి పూర్తిగాతెలియదు ఎక్కువమందికి .
ఇక మన గ్రామాలలో పార్టీలు వుండటం సహజం .ఆమందిరానికి తూర్పు ప్రహరీ గోడనానుకుని వేరేవారికి చెందినస్థలమున్నది . దానిలో వారు కసువు దిబ్బలను వేసేవారువేరే చోటులేక కదు కావాలనే . ఆవిషయము రెడ్డిగారికి మిగతా భక్తులకూ బాధకలిగించేది. ఆస్థలాన్ని కొందామన్నా వారు ఇవ్వమంటున్నారు.

ఒఅకసారి పూజ్య మాష్టర్ గారు ఎక్కిరాల భరద్వాజ గారు కావలి వచ్చినప్పుడు రెడ్డిగారు ఆయనను కలసి ఒక్కసారి మందిరానికి వచ్చిపోవలసినదిగా కోరారు. సమస్యను చెప్పుకున్నారు. మాశ్తర్ గారు 9-30 వెలదామని చెప్పి గౌరవరం లో సాయినాథుని మందిరానికి వెళ్ళారు.
శ్రీమాష్టర్ గారు మందిరం ప్రాంగణమంతా పరికించి చూశారు. తరువాత వెంకారెడ్డీ! మందిరం లో పారాయణం జరగటం లేదు . పారాయణాలు చేయండి పెంతకుప్పలనువారే తీసివేయటమే కాదు ,వారికై వారే ఆస్థలాన్ని మందిరాని కిస్తారు అని చెప్పారు.

మందిరం లో పారాయణం చేపించడం రెడ్డిగారికి సమస్య అయినది. ఆమందిరానికి నిత్యం వచ్చేవారే తక్కువ .దానికితోడు పారాయణం చేయగలిగినవారు అరుదు. పూజారిగారిని నిత్యపారాయణం చేయమన్నారు. అలాగే ఆవూరిలోని ఉపాధ్యాయులు రమ్మూర్తిగారిని మందిరానికొచ్చి పారాయణం చేసుకోమని చెప్పి ఒప్పించారు.

ఇలా సాయి లీలామృతం ,గురు చరిత్రలు పారాయణాలు సాగాయి . కొంతకాలానికి మందిరం లో ఎవరూ వేయకుండానే ఉత్తరం వైపున ఒక ఉదుంబర వృక్షం మొలచింది .ఆప్రాంతం లో ఆచెట్లు లేవు.
రెందు సమ్వత్స్రాలతరువాత ఒకరోజు వెంకారెడ్డిగారు వచ్చి చెప్పారు ,వారి మందిరానికి తూర్పు వైపున దిబ్బలువెస్తున్నవారు వారికై వారే అవి తీసివేయటమేగాక ఆస్థలాన్ని నామమాత్రం రేటుకే మందిరానికిస్తామని తెలిపారని చెప్పాడు. ఆస్థలాన్ని ధుని కట్టుకుని నిర్వహించుకుంటే బాగుంటూందని చెప్పాను.
ధునికి ప్లాను వేసారు . విశేషమేమంటే ధుని శంఖుస్థాపనకు సథలం అమ్మినవారే పీటల మీద కూర్చుని నిర్వహించారు. శ్రీ మాష్టర్ గారు చెబుతుండేవారు . శ్రీదత్తస్వామి శిక్షించరు -పరివర్తన కలగజేస్తారు అని.

అప్పటికి మాష్టర్ గారు సమాధిచెందారు .ధిని లో అగ్ని మాష్టర్ గారి స్వస్థానం ఒంగోలునుంచి ,కావలి మందిరం నుంచి[రెండూ మాష్టర్ గరికి శిరిడీ సాయినాధిలు ప్రసాదించినవి .] వచ్చాయి.
మరో విశెషమ్ ఏమిటంటే ఆస్థలం లో పెంటకుప్పలున్నప్పుడు దానికి ప్రహరీ లేదు . ధుని నిర్మాణమ్ తరువాత దానికి తూర్పున వున్న ఒకసంస్థవారు వాయువ్యం పెంచి కట్టూబడి కట్టటం తో జనానికి రాకపోకలకు ఇరుకై ఇబ్బందిగావుండినది. మందిరమ్ వారు వెళ్ళీ కోరగనే .వాల్లు తమకు పెరిగినస్థలం వరకు గోడతీసివేసి మమ్దిరం వారి ఖర్చుతో కట్టేట్లుగా ఒప్పుకుని తొలగించారు.సాధారంణంగా పల్లెలలో ఇలా స్థలం ఇవ్వరు. అన్నీ సినిమాలలోలాగా ఒకదానివెంట ఒకటి లీలగా జరిగాయి. సద్గురువు ఆజ్ఞతో సాగిన పారాయణం ఫలితానికి ఇది వుదాహరణ.

[సాయి బాబా పత్రికలో డా. పి .నరసింహరావు గారు వ్రాసిన లీల ఇది ]

ఇక్కడికొచ్చి ఏదనుకుంటే అది అయ్యేదేకదయ్యా

భక్తా గ్రేసరులకు నమస్కారము
నాపేరు కొల్లిపర సాంబశివరావు.గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామము .1993 లో నేను వెన్నునొప్పితో విపరీతమైన బాధను అనుభవిస్తున్నాను. ఎంతోమంది డాక్టర్లకు చూపించి అనేక మందులు వాడాను .ఎందరో దేవుల్లను కన్నీటితో ప్రార్ధించాను నామొరనెవరూ ఆలకించలేదు. 1993 జూన్ మాసం లో కనికి చర్ల వెంకటేశ్వర్లు గారు తెనాలి లోవున్న వెంకయ్య స్వామి వారి భక్తులు బొందిగ నరసింహరావు గారి వద్దకు తీసుకు వెల్లారు.ఆయన శనివారం ధ్యానం లో కూర్చుని భక్తుల సందేహాలకు సమాధానాలు చెబుతూ వుండేవారు.మేము వెళ్ళీ నాబాధను చెప్పగనే గొలగమూడి వెళ్ళి నిదుర చేయమని సలహా నిచ్చినారు.

గొలగమూడి ఎక్కడున్నదో తెలియదు .ఎలా వెల్లాలో తెలియదు .అని అనుకుంటుండగా తెనాలి నుండి గొలగమూడి కి స్పెషల్ టూరిష్ట్ వెలుతుందని తెలిసి విచారించగా ఐదు సీట్లు ఖాలీగా వున్నాయని చెప్పారు. వెంటనే సీట్లన్నీ తీసుకున్నాను..అనుకున్నసమయానికి గొలగమూడి వెల్లి మహాసమాధికి ప్రదక్షిణాలు చేసాము.కుటీరం లో రక్షా దారములుస్వీకరించినాము.
అక్కడవున్న స్వామి వారి శిష్యులు గురవయ్యస్వామి వారికి సమస్యను విన్నవించినాము. ఆయన తగ్గుతుంది పోరా అన్నారు. రాత్రి స్వామి వారి గుడి ముందర ఉన్న ఇసుక తిన్నెల మీద నిదురించినాము.ఎప్పుడూ సరిగా నిదురింఛని నేను ఆరోజు ఒళ్ళుమరిచి నిదురపోయాను . అర్ధరాత్రి దాటిన తరువాత వెంకయ్య స్వామివారు నా వీపు నిమురుతున్నారు. ఎంతో అద్భుతమైన స్పర్శ .కలచెదిరింది మెలకువ వచ్చింది . నిజంగానే స్వామి వారి కరస్పర్శతో నాబాధ అదృశ్యమైనది .సంపూర్ణ విశ్వాసం తో ఇక్కడకొచ్చి ఏదనుకుంటే అదెయ్యేదేకదయ్యా అని చెప్పిన స్వామి వారి వాఖ్యము నిజమయినది.
తరువాత నా వ్యాపారము కూడా కలసి వచ్చినది .బాధ తగ్గటం తో ఉత్సాహంగా వ్యాపారం చేసుకుంటున్నాను. స్వామి వారి ఆరాధన ఉత్సవాలను మొదలు పెట్టి మొదట పదకొండు మండి సాధువులకు బిక్ష ఇచ్చి నేడు వేలాదిమందికి అన్నదానం చేసేవిధంగా ఆరాధనోత్సవాలు జరుపుకుంటున్నాము.






నేను ,నా భార్య శ్రీమతి లక్ష్మీదేవి ,నా కుమార్తె చందన కలిసి షిర్డీ వెళ్ళటానికి నిశ్చయించుకున్నాము . ఎప్పుడు వెళ్ళాలనేది బాబా గారిని చీటిల ద్వార తేదీలు వేసుకొని బాబాగారిని పర్మిషన్ అడిగాం. మా కుమార్తె అమెరికా నుండి
రావటం వల్ల , తన ప్రోగ్రాం ప్రకారం మళ్ళీ తిరిగి వెళ్ళాలి కనుక త్వరలో షిర్డీ వెళ్ళాలని నిర్ణయించు కున్నాం . బాబా గారు మమ్మల్ని జనవరి రెండు, రెండు వేల మూడు , గురువారం రోజున రమ్మనమని పిలుపు నిచ్చారు.

నేనువెంటనే మన్మాడ్ ఎక్స్ ప్రెస్ మూడవ ఐర్కాందిషనేడ్ లో బుక్ చేసుకొని .ఆ రోజు అమావాస్య.ఆయినాబాబా గారు పర్మిషన్ అయింది కనుక మేము బయల్దేరాము. సికింద్రాబాద్ స్టేషన్ లో మన్మాడ్ ఎక్సప్రెస్ సరిగా ఆరుగంటలకు బయల్దేరింది.కంపార్ట్మెంట్ నిండా ప్రయాణీకులు ఉన్నారు .ఆందరూ బాబా గారి ని ప్రార్ధిస్తూ ఉన్నారు. ఆందరూ
డిన్నర్ పూర్తి చేసుకొని పనుకున్నారు సరిగ్గా పది గంటలకు .రైలు చాల వేగంగా వెళ్తోంది .అందరూ మంచి నిద్ర లో ఉన్నారు.సరిగ్గా రాత్రి ఒంటి గంటకు పెద్ద శబ్దం అయింది .ఆ శబ్ధం ఈ రోజుకు గూడ మా చెవుల్లో వినపడుతోంది .
అంత పెద్ద శబ్ధం వల్ల నిద్రించుచున్న వారు ఒక్క సారి పిల్లా పాపల తో ఉలిక్కిపడి లేచేసరికిహాహా కారాలుతో కంపార్ట్మెంట్ మారుమ్రోగి పోయింది .నేను sidebirth upper లో ,నా భార్య క్రింద బర్త్ లో , నా కుమార్తె మిడిల్ బర్త్ లో ఉన్నాము.ac కోచ్
ఒక్కసారిగా నా బర్త్ సైడ్ ది బాగా క్రిందకు పడిపోయింది.నా భార్య బెర్త్ కంపార్ట్మెంట్ అడుక్కు వెళ్లి పోయింది.నా కుమార్తెమిడిల్ బె ర్త్ v ఆకారం లో అయింది. ఈ పొసిషన్స్ అన్ని next డే చూసాము. కంపార్ట్మెంట్ లో కరెంటు పోయింది.
కటిక చీకటి.జరిగినది యేమిటంటే మా రైలు ఆగిఉన్న గూడ్స్ రైల్ ని గుద్ది వేసింది.100 మైల్స్ స్పీడ్లో వెళుతున్న మా ట్రైన్- గూడ్స్ ట్రైన్ ని గుద్దటం వల్ల ,గూడ్స్ కంపార్ట్మెంట్ పైకి మా కంపార్ట్మెంట్ ఎక్కింది. అసలేకంపార్ట్మెంట్ ఎత్తు దాదాపు 18 అడుగులు దాని పైన మా కంపార్ట్మెంట్ ఎక్కింది .మేము దాదాపు 30 నుంచి 35 అడుగులు ఎత్తులో ఉన్నామన్న మాట.బయటకు ఎలా రావాలి ? అసలు మా పరిస్థితి ఎమిటో మాకు తెలియదు.
కాని చాలా మందికి మాత్రం భయంకరమైన దెబ్బలు తగిలి ఉంటాయని అనుకున్నా.నా భార్య ,కుమార్తె లను ఎలాఉన్నారని గట్టిగ అరిచా .నా భార్య గొంతు చాలా హీన స్వరం లో వినిపించింది.నా కుమార్తె మాత్రం , డాడీ కంగారుపడకండి అంటోంది.మొత్తం కంపార్ట్మెంట్ లో 60 నుంచి 80 వరకు ప్రయాణీకులు ఉంటారు.మాకు మాత్రం ఒక 10 మంది గొంతులు వినిపిస్తున్నాయి. రక్షించండి - రక్షించండి -కాపాడండి -అని కేకలు వేశాము . ఎవరు వింటారు.సడన్ గా
జరిగింది.చీకటిలో ఉన్నాము.అమావాస్య రాత్రి.ఒక సెక్యూరిటీ గాని లేరు.నేను బాబా బాబా అని అరుస్తున్నా .కాపాడుసాయిబాబా అని గట్టిగా కేకలు వేస్తున్నా.ఎవరు వింటారు ?ఆందరూ ఏడుపులు .చంటి పిల్లలు తో ఉన్న తల్లులు.
ఎలా బయట పడాలి? చీకటి లో ఏమి తెలియటల్లేదు ?సరిగ్గా ఒక 40 మినిట్స్ తర్వాత ఎవరో చీకట్లో sideupperబర్త్ నుంచి నా పక్కకు వచ్చి నా భార్యను చేయి అందివ్వమన్నారు. పైకి లాగటానికి.తను కనీసం 55 kgs ఉంటుంది.
నా భార్య ఎవరు అంటోంది .నేను ముందు చెయ్యి ఇవ్వు అన్నా. ఆ మనిషి చీకటిలో జాగ్రత్త గా నా భార్య ను , అలాగేనా కుమార్తె ను, నన్ను పై నుంచి క్రిందకు దింపారు. అనంత చీకటి లో మమ్మల్ని దింపిన వ్యక్తి ఎవరు ? దాదాపు౩౦ అడుగులు ఎత్తు నుంచి సుమారు 60 kgs ఉన్న మమ్మల్ని క్రింద నుంచి పైకి లాగి, మల్లి పైనుంచి నేల మీదికిచంటి బిడ్డల్లా దింపటం ఎవరకు వీలవుతుంది !.ఏదో సూపర్ పవర్ తప్పకుండ మమ్మల్ని రక్షించింది.కిందకు దింపి
ఒక రగ్గు ఇచ్చారు అయన. జనవరి నెల కదా. చలి బాగా ఉంది.అలా తెల్లవార్లూ అంటే రాత్రి 1 గంట నుండి అలా కూర్చుని వున్నాం.ఉదయం చూస్తే , యెంత భయానకం గా ఉందో !మా ముందు కంపార్ట్మెంట్ జనరల్ ది .అది కూడా
గూడ్స్ కంపార్ట్మెంట్ మీదకు ఎక్కింది.అందులో ఉన్న వారు ఆందరూ చని పోయారు. ఇంక మా కంపార్ట్మెంట్ లోమొత్తం 80 మంది లో మాకు తెలిసి తెలిసి 8 మంది మాత్రం బ్రతికి భయట పడ్డాము.చాల మంది కి దెబ్బలు ,చంటిపిల్లలు తల్లి దగ్గర పలు త్రాగుతూ అలాగే తల్లి పిల్ల మరనించటం మా అందర్నీ కలిచి వేసింది .ఎంతగా ఎడ్చామో.
ఎందుకు దైవం ఇంత భయంకరమైన మరణం ఇచ్చాడు .అసలు దైవ కృపకు ఆందరూ బయల్దేరారు.చాలా మందికిఇలాంటి మరణం న్యాయమా?.నాలో నేను చాలా భాధ పడుతున్నా. ఈ రోజు కూడా.కాని అదే దైవం మమ్మల్ని చిన్నదెబ్బ కూడా తగలకుండా కాపాడి క్షేమం గా షిర్డీ కి రప్పించుకున్నాడు. మేము బాబా గారిని సదా ప్రార్దిస్తున్నా.
అందర్నీ రక్షించు తండ్రీ. నీ దగ్గరకు వఛే భక్తులను సర్వదా కాపాడు తండ్రీ. మమ్మల్ని సాయి ఎప్పుడూ మా వెంటఉంటారని భావిస్తున్నాం.
బాబా గారి తో నాకు చాలా అనుబంధం ఉంది అనుకుంటున్నా. చాలా అనుభవాలు.పూర్వ జన్మ అనుబంధం ఏమో.
ఆయన గురువు, సద్గురువు,రాజ రిషి ,యోగిరాజు,సచ్చిదానందుడు , బ్రహ్మాండం అంతటా ఉన్నవాడు,ఎల్లప్పుడుచిరునవ్వుతో ఉండేవాడు ,నిరాడంబరుడు. అందరకు తండ్రీ .అలాటి బాబా కు సాష్టాంగ నమస్కారము ల తో.
భక్త పరమాణువు,
తిలక్ పండ్రంగి.,
మరియు కుటుంబం
హైదరాబాద్.


పూజ్య ఆచార్య భరద్వాజ మాస్టర్ గారు నాకు పరిచయమయ్యాక 1975 నుఁడి నన్ను భగవాన్ వెంకయ్య స్వామివారిని దర్శిఁచుకోమని చెబుతుండేవారు.కానీ నేను వారిని దర్శించులేదు. ఎందుకంటే తలుపూరు,కలిచేడు గ్రామాలకొచ్చినప్పుడు ఆయనను నేను గమనిస్తూనేవున్నాను, కాని ప్రత్యేకంగా వారికి సాష్టామ్గపడవలెనని నాకనిపించేది కాదు. కేవలము గోచి పెట్టుకుని,ఎప్పుడూ మంట[అగ్ని]ముందు కూర్చుని వుంటారు,ఆయనేభగవంతుడని అఁటే నాకు నమ్మబుద్దయ్యేది కాదు.
ఒకసారి మేము శ్రీమాష్టారి ఆజ్ఞమేరకు రాముల వారి గుడిలో సత్సఁగము చేస్తుఁటే ఒకరోజు వార్ధా గ్రామము,గాంధీగారి ఆశ్రమమునుండి ఒకసన్యాసి వచ్చి వెఁకయ్యస్వామి వారిగూర్చి అడిగాడు. వారికి శ్రీస్వామివారిని చూపేందుకు నేను కలిచేడునుండి తలుపూరికి వెళ్ళాను. మేము పొయ్యేసమయానికి ఏదో గ్రామ తగాదాలు తీర్చమని రెండుగ్రామాలప్రజలు కిటకిటలాడుతూ స్వామి పక్కనకూర్చుని వున్నారు. మేము ఆజనాన్ని చూసి దూరంగా నిలబడియున్నాము. శ్రీస్వామి వారిదగ్గరనుఁడి ఒకవ్యక్తి మావద్దకు వచ్చి కాషాయగుడ్డలున్నాయనను రమ్మన్నారని చెప్పాడు. వెళ్ళిన అతనితో ఆసన్యాసి దీక్షతీసుకున్న తేదీ ఇమరికొన్నివిషయాలి వ్రాపిఁచి ఇచ్చి చివర్లో ఇతనిని గొలగమూడి ఆయన స్నేహితుడు నీతోటివచ్చాడుఅని వ్రాపించారు. భరద్వాజ గారికంటే నాకు శ్రీస్వామివారిగూర్చి చెప్పింది గొలగమూడిలోని నాస్నేహితుడే.
తహసిల్దారుగా నుండి తరువాత సన్యసించిన ఆవచ్చిన వారు శ్రీస్వామివారి గూర్చి ఎంతోకొనియాడారు. స్వామివారు వ్రాపించిన కాగితము చదువుకు సామర్ధ్యానికి సంబంధం లేదని చెబుతున్నదని ప్రశంసించాడు.

[రచయిత గొలగమూడి వెఁకయ్యస్వామివారి చరిత్రరాసిన అంకితభక్తుడు పెసల సుబ్బరామయ్య గారు ]

Tuesday, February 10, 2009

నా భావం .................

Om sri sai ram my dairy:-date:08-03-08

ఈ రోజు సంక్షిప్త శ్రీరామక్రిష్ణుని జీవన చరిత్రను అర్ధం చేసుకుని నా జన్మను సార్ధకం చేసుకున్నాను.గ్రంధాన్ని పఠించే సమయమంతా ఎంతో ఆసక్తితో నా అంతఃకరణ చతుష్టయం ఒకటే అయి భక్తి పారవశ్యంలో ఉన్నాను. ఈ సమయమంతా రోమాలు నిక్కపొడుచుకునేవున్నాయి .నా మనసు దరహాసవదనీయులైన శ్రీరామక్రిష్ణుని కను కొనల వెంబడి కారే భక్తి జలాలవైపే కేంద్రీకృతమై, వివిధ నాడులలో నుంచి భక్తి, తత్పరత కలిగిన క్షణాలు అనిర్వచనీయం. శ్రీరామక్రిష్ణునికి కించిత్తైనా అహం భావం లేదు. ఈ వాక్యాలను చదివేటఫ్పుడు నా కనుల వెంబడి సద్గురువునందు అవినాభావసంబంధంతొ కూడిన ప్రేమాశ్రువులు పారినవి. శ్రీరామక్రిష్ణుని భక్తితో సేవించిన "మధుర్" అనునతనికి నా మనస్సులో పాదాభివందనం చేసాను. ఏలయన శ్రీరామక్రిష్ణుని సేవించే భాగ్యం అతనికే దక్కినది కదా. శ్రీరామక్రిష్ణుల దివ్య అనుభూతులు, విచిత్ర దర్శనాలు గాంచిన క్షణము నా మనస్సు ఆశ్చర్యంతో కూడిన మహదానందంతో ముగ్ధమయ్యేది. కామమును అహంకారమును చిత్త బేధను పొగొట్టుకోవటానికి పరమహంస చేసిన సాధన వర్ణనాతీతం. కాలక్రమేణా "నేను" అనే భావం నాశనమయ్యి వివేక వైరాగ్యాలను ఘొర తపస్సు చేత సంపాదించబడ్డ మధుర క్షణాలు అఖండం. పుట్టుకతొనే వైరాగ్యాన్ని పొందిన రామకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే అని నా ప్రగాఢ నమ్మకం. దేవి దర్శనం కోసం వేచిన సమయమంతా ఎంతో సహనంతొ, ఓర్పుతో, భౌతిక విషయాలకు అతీతుడై దేనినీ పట్టించుకోక చేసిన ధ్యానం అమొఘం. సామాన్యులకు ధ్యాన స్థితి కలుగుట ఎంత కష్టమో, గురుదేవులకు జాగృదావస్థలోకి రావటమూ అంత కంటే కష్టం. అంత సాధనతో, ప్రేమతో , తత్పరతతో భావన వుండబట్టే కదా దేవీ దర్శనాన్ని పొందింది మరి. శ్రీరామక్రిష్ణులతో పాటు శ్రీ శారదామాతనూ భగవత్ దిశలో నడిపించాడు ఆ ఈశ్వరుడు. "వివేకానందుని చూడాలని పరితపించే ఆ మనస్సు "ను చదివినప్పుడు వీరిద్దరూ ఒక్కటే అనే భావన గుండెలలో బలంగా నాటుకుంది. శ్రీరామక్రిష్ణుని మహాసమాధిని చదివే గడియలలో నా శరీరంలో నుంచి ఎవోతెలియని ప్రవాహాలు హృదయాంతరాళాలలోకి చేరి ఆ ప్రేమ కనుల ద్వారా అశ్రురూపం దాల్చింది. చాలా సేపు ఏడ్వసాగాను. కనులు ఎర్రబడి ఉబ్బినాయి. అది గమనించినప్పుడు బాహ్యస్మ్రతిలోకి వచ్చాను.చాలా సేపు ఛాయా చిత్రాన్ని చూస్తూ ఆలోచనా రహిత స్తితిని పొందాను.

ఇది శుభ దినం. ఈ జీవితంలో మరువరాని రోజు.నా అహంకారాన్ని జయించటానికి, పరిపూర్ణభక్తి బాటలో పయనించేందుకు శక్తిని ఇవ్వమని గురుదేవులనే ప్రార్ధిస్తున్నాను..

సాయిని కృష్ణునిగా ,గురుదేవులను రాధగా భావించి రాధ కోసం విలపించి నా కృష్ణుని చేర్చమన్నట్టు మనస్సు భావాస్తితిలో లగ్నమయింది.

సర్వం ఆ ఈశ్వరుడి సంకల్పమే.
[ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్ధి వ్రాసిన తన డైరి లో ఒక పేజి పంపాడు ]


1916 ప్రాంతంలో పావన తుంగభద్రనదీ తీరంలోని మంత్రాలయంలో జరిగిన దైవలీల
ఇది. అప్పటి మద్రాస్ డిస్ట్రిక్ట్ గజెట్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన
ప్రత్యేకత ఎమిటంటే లీలకు లోనైన వారు హిందూ మతస్తుడు కాకపోవటం.

థామస్ మున్రో అనే బ్రిటిష్ అధికారికి ప్రభుత్వం ఒక బాధ్యత అప్పజెప్పింది.
చాలా కాలం క్రితం రాఘవేంద్ర కృపా పాత్రుడైన ఒక అవధ్ నవాబు, బృందావనంలో
జరిగే పూజలకు తగిన వనరులు సమకూర్చుకోవటానికి కొంత భూమిని జాగీరుగా
ప్రకటించాడు. ఆ జాగీరును వెనక్కి తీసుకునే ఆలోచన చేసింది అప్పటి బ్రిటీషు
ప్రభుత్వం. కాని అక్కడి మఠాధిపతులు ఇతర ఆస్తికులు నిరశించడంతో ఆ విషయంపై
నివేదిక పంపమని మున్రోని ఆదేశించింది ప్రభుత్వం.

హిందూ మత సాంపదాయాలని తెలిసిన మున్రో మంత్రాలయానికి చేరుకొని అక్కడి
ఆస్తికులతో చర్చించాడు. ప్రధాన ఆలయంలోకి తన టోపీ, కాళ్ళకున్న బూట్లు
తొలగించి ప్రవేశించాడు. అక్కడ అప్పుడు జరగబోయే సంఘటనను ఆయన కలలో కూడా
వూహించి వుండడు.

ఒక్క క్షణంలో ఏదో మాయ జరిగినట్టు తన చుట్టూ వున్న మనుషులు పరిసరాలను
మరిచిపోయాడు. ఆయన ఎదురుగా వున్న రాఘవేంద్ర సమాధి బృందావనం. అటు పక్కనే
తెల్లటి గడ్డంతో, కాషాయ వస్త్రాలతో ఒక సన్యాసి. మదహాసంతో మాయ చేస్తూ
మున్రో దగ్గరకి వచ్చాడు. మంద్రంగా ఆయన గొంతు వినపడింది.

"జాగీరు ప్రభుత్వం తీసేసుకుంటే ఇక్కడ జరిగే భక్తి పూజలు, అన్న దానాలు ఏవీ
జరగవు. ఆలయం మూత పడుతుంది. ఆలయమనేది జీవత ఎడారిలో ఆధ్యాత్మిక దాహం తీర్చే
ఎండమావి లాంటిది. ప్రజల మత విశ్వాసాలను గౌరవించడం పాలకుల బాధ్యత కాదా.
అలాంటి బాధ్యత నెరవేర్చినప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం
చూపిస్తారు. ఆలోచించు.." అంటూ ఆశీర్వదించాడు.

మున్రో మళ్ళీ ప్రస్తుత లోకంలో మేల్కొన్నాడు. జరిగింది చుట్టుపక్కల
వున్నవారికి చెప్పాడు. అది కలా, మాయ, భ్రమా అతనికి అర్థం కాలేదు. తలపై
చెయ్యి పెట్టుకొని చూశాడు. మంత్రాక్షతలు..!! ఆ సన్యాసి ఆశీర్వదిస్తూ తనపై
వేసినవి..!!

చూట్టూ వున్న మఠాధిపతులు, సాధువులు, భక్తులు తల వంచి మున్రోకి
నమస్కరించారు. ఏ విధంగానూ తనకి తెలిసిన తర్కాని అందని ఆ లీలని తలుస్తూ
బయటకి నడిచాడు మున్రో. ఆ సన్యాసి చెప్పిన విషయమే బ్రిటీషు ప్రభుత్వానికి
వ్రాశాడు. ప్రభుత్వం జాగీరుని వెనక్కి తీసుకునే ఆలోచన మానుకుంది. { కర్నూల్ కలెక్టర్గా ఆయన వ్రాసిన ఆ వుత్తర్వులపై తానే తరువాత మద్రాస్ గవర్నర్ గా ఆమోదించవలసి రావటం మరొక విచిత్రం]

మున్రోకి అర్థం కాని విషయం ఒకటే - ఎవరా సాధువు? తను చెయ్యాల్సిన పనికి
మార్గం చూపిన ఆ గురువెవ్వరు?


[వ్రాసినవారు. అరిపిరాల సత్యప్రసాద్]ఈ కథ కే.కే.మూర్తి అనే ఒక రచయిత వ్రాసిన పుస్తకం (The miracles of God
for the debacles of human) నుండి స్వేచానువాదం)


ఇది ఆపదలో చీకతి లో వున్న జీవితానికి భరోసా ఇచ్చి వెలుగుదారిన నడిపిన సద్గురువుల కృపను తెలిపే లీల. తన జీవితములో సమర్ధసద్గురువు సాయినాధుడు చూపిన అనుగ్రహాన్ని శ్రీమతి ఝాన్సీలక్ష్మీభాయి గారు తన మాటలలోనే వివరిస్తున్నారు.అవధరించండి.

1984 నాజీవితములో చీకటినినింపిన సమయము. నాభర్త ఆర్మీలో మెకానికల్ సెక్సన్ లో పని చేస్తూమమ్మల్ని దు:ఖసాగరం లో ముంచి సుదూర లోకాలకు తరలిపోయారు. చిన్నపిల్లలు.ఒక అబ్బాయి.ఇద్దరు అమ్మాయిలు. చిన్నపిల్లలను తీసుకుని నేను మా పుట్టిల్లు గిద్దలూరు చేరాను. మా అమ్మ్గారిల్లు స్టేషన్ దగ్గరే. పిల్లలను సముదాయిస్తూ నాలో నేను కుమిలి పోతూ గడుపుతున్న రోజులవి.మామూలు మనిషిని కాలేక పోతున్నాను. కానీ పిల్లలభవిష్యత్తు కోసము నన్ను నేను సమాధానపరుచుకొని బ్రతకవలసి వస్తున్నది. ఇంకా ఉద్యోగము కూడా ఇవ్వలేదు ఆర్మీ వాళ్ళు.

అలాంటీ రోజులలో ఒకరోజు గది లో విచారంగా నాలోకములో నేను వున్న సమయములో ఒక గొంతు హిందీ లో ఏదో అడుగుతున్నది. బయట మా పిన్ని గారు ఏదో చెబుతున్నట్లుగావుంటే బయటకు వచ్చాను. ఒక భిక్షుకుడు మావాల్లను టీ కావాలని అడుగుతున్నాడు.వాళ్లకు హిందీ అర్ధం కాక ఏమిటని అడుగుతున్నారు. ఆ కారం చూస్తే పాతగుడ్దలతో సాయిబాబా లా వున్నారు. కానీ నాకప్పటికి సాయిగురించి పెద్దగా వివరాలు కానీ ,భక్తి కానీ లేవు. కాకుంటే యాచిస్తున్నాడు కదా అని ఉండు మాయింట్లోవున్నాయి పెట్టిస్తాను అనిలోపలకు పోబోయాను. మరి నాకిస్తే అక్కడ నాకోసం కాచుకున్నవారికి కావాలికదా? కనుక కొద్దిగా టీపొడిఇవ్వు అన్నాడు. తెచ్చి ఇచ్చాను.మరి చక్కెర కావాలి కదా? అన్నాడు.కొద్దిగా పొట్లం కట్టి తెచ్చాను. బేటీ ఇవి కాగపెట్టాలి కదా ఒక చిన్న గిన్నెఇవ్వు అన్నాడు.తెచ్చి ఇస్తున్నాను.మా సంభాషణ హిందీ లో సాగుతున్నా మా పిన్ని కి అర్ధమవుతున్నందున పాలువద్దా అన్నది వెటకారం గా. వద్దు మేము డికాక్షన్ కాచుకుని తాగుతాము అన్నాడాయన.వెళ్ళి పోయాడు.
మరలా ఒక అర్ధగంటకు వచ్చి నేనిచ్చిన పాత్ర తిరిగిచ్చాడు. మా ఆవిడకు కావాలి ఒక కోక ఇవ్వు అన్నాడు. కొత్తకోక ఒక్కసారే కట్టు కున్నాను 750/ ది దండెం మీదనుంచి తెచ్చి ఇచ్చాను. అప్పూడు నెనొక్కదాన్నే వున్నాను. ఆయన నన్ను చూస్తూ నువ్వు నాకోసం ఇన్నిచ్చావుకదా ? మరి నెను కూడా నీకు ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. నాకేమొద్దు లే వెళ్ళు అన్నాను[మనసులో కొద్దిగా భయం. ఈ సన్యాసులు లాంటివాళ్ళు ఏమి మోసము చేస్తారో అని.] కాదు ఇదిగో చూడు తీసుకోఅని ఆయన నాచేతిలో తనగుప్పిటనుంచి ఏదో పెట్టాడు. నాకసలే భయం గావుంది. కానీ మాట్లాడ లేకపోతున్నాను. అమ్మ నువ్వు దీన్నిక్కడ వద్దు లోపలికెళ్ళీ నీ దేవుని మందిరం లోపెట్టి చూడు అన్నాడు. లోపలకెళుతూ గుప్పిటవిప్పాను. గుప్పున పూలపరిమళం గుభాళించింది. చేతిలో పూలు. చూసావా అన్నారు ఆయన లోననుండి.వామ్మో ఇదేదో ...అనే భ్యం నన్నావరించింది .ఏమీ లేవు పూలు అన్నాను నెను పెద్దగా .కాదు పూలకింద వున్నదాన్ని చూడు నిన్ను రక్షిస్తుంది దాన్ని భద్రంగా దాచుకో అని పెద్దగా చెప్పాడాయన. ఇదేదో మాయలాగున్నది ఇదినాకొద్దు నీది నువ్వే తీసుకో అని చెప్పి ఇద్దామని బయటకొచ్చాను. కానీ అక్కడాయన లేరు. ఒకవేళ మళ్ళా స్టేషన్ వైపు వెళ్లాలన్న కనీసం రెణ్డు నిమిషాలు పడుతున్నది. కానీ కనుచూపు మేర ఆయన కనిపించలేదు.గుప్పిటలో ఒక తాయెత్తులాంటి వస్తువు వున్నది భయం తో దాన్ని తీసుకెళ్ళీ దేవునున్పటాలముందు పడవేశాను. ఆతరువాత మనసుకు కాస్త ఉపశమనముగాను జీవితము మీద పిల్లలమీద ప్రేమ పెరిగాయి బాధ్యతలు నిర్వర్తిమ్చగలననే గుండెనిబ్బరము పెరిగాయి.[ మా అమ్మ వస్తే అరుస్తుందని షాప్ కెళ్ళీ మరొక చీర అలాంటిదే తెచ్చి తడిపి ఆరవేశానుఆరోజే] తరువత గుర్తుకొచ్చి ఎన్ని సార్లు వెతికినా ఆమహాను భావుడిచ్చిన తాయెత్తు కనపడలేదు. వారు సాయిబాబా అనే నమ్మకము నాకుకలిగినది. తరువాత వారిని పూజించసాగాను. నాకు ఆర్మీ లోనే యు.డి,సి. గా పోస్ట్ ఇచ్చారు. సికిందరాబాద్ లోనే పనిచేస్తున్నాను. ముగ్గురు పిల్లలు పెద్దవాల్లయి దేశరక్షణ కోసం వున్నారు. ఇద్దరికి పెళ్ళిల్లు చేశాను. నా ఇష్టదైవమయిన లలితాదేవితో పాటు,సద్గురువు సాయినాధుని గురువుగా మార్గదర్శకునిగా సేవిస్తుంటాను. సమర్ధ సద్గురు సాయి నాధులకు జయము.