సుందరకాండ పారాయణ చేసే వారందరికీ ఆ మహిమ ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంటుంది.
కొందరికి బాహ్య ప్రపంచంలోనూ కనబడుతుంది, కొందరికి మానసోల్లాస రూపంలో
మాత్రమే కనపడవచ్చు.
నే్ను మా అన్నగారి ప్రేరణతో మొదటిసారిగా నాలుగు సంవత్సరాల క్రితం సప్తసర్గి పారాయణ చేశాను. అప్పటి అనుభవం ఇది.
(ఈ విధానం తెలియనివారికోసం: ఇది, రోజుకి ఏడు సర్గలు చొప్పున పారాయణ చేసే ఉత్తమ విధానము. తొమ్మిదరోజుకి్ అరవై మూడు సర్గలు పూర్తవుతాయి. పదవరోజు అరవై ఎనిమిదవ సర్గ పూర్తయినాక తిరిగి ఒకటవ, రెండవ సర్గ చేయాలి. ఇలా చేస్తూ పోగా, అరవై ఎనిమిదవరోజున ఏడు ఆవృత్తులు అయేసరికి అరవై ఎనిమిదవ సర్గ చివరిదవుతుంది. ఆరోజుతో పారాయణ సమాప్తి చేసి భగవత్సమర్పణ చేయాలి.)
మా నివాసం బెంగళూరులో. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో కోతులు ఉంటూ ఉంటాయి. మేము ఉన్న చోట కూడా ఉండేవి. కానీ విచిత్రంగా, నా పారాయణ జరుగుతున్న రోజులలో ప్రతిసారీ చివరి సర్గ జరిగిన రోజున, అదీ నేను పారాయణ చేసే సమయంలో వచ్చి వెళ్ళేవి. ఇంట్లో చొరబడి కనీసం ఒక అరటిపండైనా సంగ్రహించుకుపోయేవి.
మా అన్నగారి సూచన మీద చేశానే కానీ, నియమ నిష్ఠల గురించి ప్రత్యేకంగా తెలియదు. అరవై ఏడవరోజున, చివరిరోజు బ్రాహ్మణ సంతర్పణ (కనీసం ఒక్కరికి) చేయాలని తెలిసింది. ఎవరికీ ముందుగా చెప్పుకోలేదు కనుక ఈసారికి నమస్కారం తో సరిపెడదామనుకున్నాను. "రేపు పూర్తవుతుంది కదా, విశేష నైవేద్యం చేద్దాం" అనుకుని అంగడిలో కనబడ్డ ఉత్తమ ఫలాలను తెచ్చాను.
ఆరోజు రాత్రి మా అన్నగారి ఫోను వచ్చింది. మరుసటిరోజు తను "మరో ముగ్గురితో" కలిసి శృంగేరీ నుంచి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి వస్తున్నట్టు చెప్పాడు.
అనుకున్నట్టుగా రానే వచ్చారు. ఆ మరో ముగ్గురు, మా బంధువులే. వారిలో ఇద్దరు దంపతులు! వారిపేర్లు, "లక్ష్మీపతి, సీత." ఆ అతిథులు ముగ్గురికీ చేతనైనంతలో సమారాధన చేసి సత్కరించాము.
వాళ్ళు వస్తూ మరిన్ని పళ్ళు తెచ్చారు. సరే అని నేను ముందురోజు కొన్న వాటిలో ప్రత్యేకించి నైవేద్యం పెట్టాలనుకున్న పెద్ద అరటి పళ్ళ హస్తాన్ని పక్కన పెట్టి మిగిలిన పళ్ళను నైవేద్యం పెట్టాను. ఆశ్చర్యం ఏమిటంటే, ఆరోజు పారాయణ చేసి పూజ చేసి నైవేద్యం, ఆరతి అన్నీ చేసి నమస్కారం చేస్తుంటే అందరూ వసారాలోనూ ముందుగదిలోనూ ఉండగానే అతి నిశ్శబ్దంగా ఒక నిండు గర్భిణీ కోతి వచ్చి నేను వదిలేసిన పెద్ద అరటిపళ్ళ హస్తాన్ని తీసుకుని అంతే నిశ్శబ్దంగా జారుకున్నది. కొందరు చూసి ’భయపడి’ ఊరుకున్నారు, కొందరు చూడనేలేదు. బయటికి్ వెళ్ళి వసారాలో కూచుని అందులోని సగం పళ్ళు ఆరగించేసింది ఆ కోతి. సాధారణంగా కోతులు కాస్త అల్లరి చేస్తూ తింటాయి. గర్భణీ కోతులు కాస్త ప్రశాంతంగా ఉంటాయి కామోసు. పైగా అప్పుడు ఆ కోతుల దండు అంతా వీటిమీదకి ఎగబడలేదు. అది వదిలేసిన తరువాత మాత్రం ఆ పళ్ళ మీద మిగిలిన కోతులు వీరంగం వేస్తూ వసారా అంతా చెత్త చేస్తూ తిన్నాయి!!
తరువాత ఇంత dramatic గా కాకపోయినా మహిమలు చాలానే చూపిస్తున్నారు!
-శ్యామ శర్మ

7 comments:
sir, sapta sargi inkonni details, time enta padutundi,book details knchem cheppandi,pl
Parayana niyama nistalu chebutara...... Nenu hostel lo untanu..... Evening ye time nundi ye time varaku cheyyochu.....

సుందరకాండ పారాయణ పద్దతుల్లో సప్తసర్గి చాలా విశేషంగా చెప్తారు.
మీరు ఇంతకుముందు ఒక్కసారన్నా చేసి ఉంటే, చెయ్యండి.
నా సలహా అయితే ముందుగా ఒక్కసారి పారాయణ చెయ్యండి తర్వాత వీలు చూస్కుని సప్తసర్గి చెయ్యవచ్చు.
సుందరకాండ ని చాలా పద్దతుల్లో పారాయణ చెయ్యవచ్చు.
ఒకరోజులో సుందరకాండ పారాయణ చెయ్యవచ్చు
రెండురోజుల్లో చెయ్యవచ్చు.(మొదటిరోజు నలభైయెనిమిది సర్గలు, రండవరోజు మిగతా సర్గలు చెయ్యవచ్చు)
తొమ్మిది రోజుల్లో పారాయణ చెయ్యవచ్చు. (రోజుకి ఏడు సర్గలు చొప్పున పారాయణ చేసి, తొమ్మిదవరోజు 57 వ సర్గ నుండి 68 వ సర్గ వరకు పారాయణ చెయ్యాలి.
పదహారు రోజుల్లో పారాయణ చెయ్యవచ్చు
యధావిధిగా పూజ చేసుకుని, సంకల్పం చెప్పుకుని, పారాయణ మొదలుపెట్టుకోవచ్చు.
మొదటిరోజున గాయత్రి రామాయణం, సంక్షేప రామాయణ సర్గ, రామావతార సర్గ, శ్రీ సీతా రామ కళ్యాణ సర్గ, సీతా రామ సుఖజీవన సర్గ పారాయణ చేసుకోవాలి. తర్వాత సంఖ్య ప్రకారం సర్గలు పారాయణ్ చెయ్యండి.
మిగిలిన రోజులు మామూలుగా సంఖ్య ప్రకారం సర్గలు చదువుకోవచ్చు.
చివరిరోజున అంటే అరవై ఎనిమిదవ సర్గ అయిన తర్వాత, పట్టాభిషేక సర్గ, నాగపాశ విమోచన సర్గ, ఆదిత్యహృదయ సర్గ, రావణ వధ సర్గ, శ్రీరామ స్తుతి సర్గ చదువుకోవాలి.
ఇది కాక సంపుటీకరణ మంత్రాలు అని ఉంటాయి. ప్రతి సర్గ తర్వాత ఈ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది. సహజంగా అందరూ జయమంత్రం చేస్తారు. నమోస్తు రామాయ శ్లోకము, సిద్ధిమ్మే సంవిధాశ్చ అనే శ్లోకము, తదున్నసం పాండురదంతమవ్రణం అనే శ్లోకం మీ సంకల్పాన్ని బట్టి చదువుకోవచ్చు.
అవి మీరు పారాయణ చేసే గ్రంధంలో ఉంటాయి.
సుందరకాండకి ప్రధానంగా కావల్సింది మీ నమ్మకం, భక్తి మాత్రమే.
పారాయణ తర్వాత నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి.
మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే తెలపండి. మాకు చేతనైనంతవరకు తెలుపగలము.
https://youtube.com/live/IB3zteZZa_M?si=dwPTMZi5nR_rh72Y
సప్తసర్గి పారాయణ సంకల్పం పెట్టగలరు. నాకు వాట్సాప్ చేసినా ఫర్వాలేదు. 9490379687
Post a Comment