గురువు అవసరం ................

గురువు అవసరమా అన్న మన సందేహానికి సమాధానంగా వేమన  ఇలా వివరించాడు.

ఆత్మలోని జ్యోతి యమరుగా లింగంబు
తెలిసి చూడకున్న తేటపడదు
అదియు గురువు లేక అబ్బునా తెలియంగా
విశ్వదాభిరామ వినుర వేమా !

తాత్పర్యం  : హృదయంలో తేజో రూపుడుగా వున్న పరమేశ్వరుని దర్శించడానికి సద్గురువు దగ్గర అభ్యాసం లేకుండగా సాధ్యపడదు.

ఇంకా.........ఇలా చెప్పారు.........

ఉడుగక క్రతువుల తపముల
నడవుల తీర్ధముల తిరిగినంతనే ధరలో
నోడయని కనుగొనజాలదు
కడు ధీరత గురుడు తెలుపగలడిది వేమా   !

తాత్పర్యం : ఎ మాత్రం విడిచి పెట్టకుండా యజ్ణ యాగాదులు , తపస్సు చేసి, అడవులలో తిరిగి తీర్ధయాత్రలకు వెళ్ళినప్పటికీ స్వామిని కనుగొన లేరు. ఆ పరమాత్మను చేరుకొనే విధానాన్ని గురువు మాత్రమే చెప్పగలడు.
గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో
అజునికైన వాని యబ్బకైన
తాళపు చెవి లేక తలుపెట్ట్లూడునో?
విశ్వదాభిరామ వినుర వేమా !

తాత్పర్యం : తాళం చెవులు లేకుండా తలుపు ఏవిధంగా  రాదో, అదే విధంగా గురువు ఉపదేశం లేకుండా, ఆత్మా జ్ఞానాన్ని బ్రహ్మ గాని ఆతని అబ్బ (తండ్రి ) గాని తెలుసుకోలేరు.

గురువు లేక విద్య గురుతుగా దొరకదు
నృపతి లేక భూమి నియతి గాడు
గురువు విద్యలేక గురుతర ద్విజుడౌనే ?
విశ్వదాభిరామ వినుర వేమా !

తాత్పర్యం : రాజు లేనిదే రాజ్య పరిపాలన సాగనట్లే గురువు లేకుండా విద్య లభించదు . కనుక సరయిన గురువు, సరయిన విద్య లేక బ్రహ్మజ్ఞాని ఎలా అవుతాడు  ?

ఛాయనోసగు జెట్లు  సాధువు బోధలు
అడిగి దారిని జేరబడయవచ్చు
అత్తునిట్టు దాత నడిపోవు నిది రాదు
విశ్వదాభిరామ వినుర వేమా !

తాత్పర్యం: చెట్టు తన దగ్గరకు వచ్చిన వానికే నీడ ఇస్తుంది. దూరంగా వెళ్ళిపోయినా వారికి ఆ చెట్టు నీడను ఇవ్వలేదు. అదేవిధంగా గురువు తనకు సన్నిహితంగా వున్న శిష్యునికి విద్యనూ బోదించగలడు గాని, దూరంగా వెళ్ళిపోయినా వారికి బోధలు చెయ్యలేరు. జ్ఞానాన్ని సంపాదించ దలచిన వారు గురువుకి దగ్గరగా వుండాలి అని భావం . 

వాక్కు నందు  గురువే వాక్ర్రుతాను గురువు
చీకటి నటు గురుడు చిక్కి యుండు
 అఖిలమునకు గురువే యాధామై యుండు
విశ్వదాభిరామ వినుర వేమా! 

తాత్పర్యం:  మనం మాట్లాడే మాటలలో గురువు యొక్క శక్తి వుంటుంది .. అదేవిధంగా మనం మాట్లాడే శక్తి లోను గురువు యొక్క ప్రభావం ఉంటుంది. మనలోని అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టడానికి కూడా గురువే ఆధారం. లోకంలో ఎ పని చెయ్యాలన్నా గురువే ఆధారమై ఉంటాడు. అందు వలన  గురువు లేనిదే ఎ శక్తీ లేదు ...

విన్నారుగా. . అదండీ గురువు ప్రభావం మనపై ...

0 comments: