మిత్రులకు  పెద్దలకు, భాగవతోత్తములకు నమస్కారములు.
  పరోపకారం మిదం శరీరం ... అని నమ్మి బ్రతుకుతున్న వాడ్ని. ఫలాపేక్ష లేకుండా,
  తీసుకోకుండా ఇతరులకు, ముఖ్యముగా కష్టములలో వున్నవారికి నాకు తోచిన సహాయాన్ని,
నాకు తెలిసిన, నాకు ఆ తల్లి కరుణతో నోసిగిన మంత్ర విద్యతో అందరికీ సహాయము
  చేస్తూ వస్తున్న ఈ తరుణంలో కొన్ని ప్రమాదములు అనుకోకుండా ఎదురౌతూ వుంటాయి.
  వాటికి భయపడి నా గురు స్థానము వదల కూడదు కదా!  మంచి పని చేసేటప్పుడు అవాంతరాలకు
  జడవకూడదు అంటారు పెద్దలు.
  అలాంటిదే మొన్న శనివారం ఒకటి జరిగినది.  నేను ప్రయాణిస్తున్న  కారు రాత్రి
  తొమ్మిది గంటలకు ప్రమాదానికి
  గురి అయినది.  వంద కి.మీ. వేగముతో వెళ్లి ఒక ట్రక్కును గుద్ధినాను. కారు బజ్జి
  బజ్జి అయినది.

  ఆ కామాక్షి తల్లి నన్ను క్షణములో త్రుటిలో తప్పించి, నాకు రవ్వంత గీత కూడా
  పడకుండా, నెత్తురు చింద కుండా నన్ను, కాదు తన బిడ్డను తనే కాపాడు కున్నది.
  చూచితిరా అమ్మ కారుణ్యం, అమ్మ లీల.
  నమ్ముతారా అమ్మ వున్నదని. ఈ రోజు మరలా మీ అందరి ముందుకు మరలా నేను వచ్చినాను అంటే అది మీ అందరి అభిమానము
  మరియు ఆ తల్లి యొక్క ప్రేమ, కరుణ. నన్ను కాపాడినాయి.

మరలా ఇంకా రెట్టింపు ఉత్సాహముతో  ముందుకు నడుస్తాను.

  సత్ సంఘము లోని సభ్యుల మైన మనకు భయ మేల ?

  అన్నీ ఆ శ్రీమాత  చూచుకొంటుంది.
  జై శ్రీరామ్
  మీ
> భాస్కరానంద నాధ [కామరాజు గడ్డ రామచంద్రరావు]



ఈ భక్తుని జీవితం  జగన్మాత  కరుణకొక ఉదాహరణ
>
>

1 comments:

శ్యామలీయం said...

ఈ ఉదయమే మరొకరి బ్లాగులో వ్యాఖ్యానించాను. జీవితం ఒక అద్భుతమని. అమ్మ దయతో దానిని మీరు సార్ధకం చేసుకుంటున్నారు. అలాగే ఉత్సాహంగా ఉండండి, అమ్మ దయతో సర్వవేళాలా మీకు శుభం జరుగుతుంది.