గిరి'జన జాతర'...
ఉట్నూర్/ఇంద్రవెల్లి, జనవరి 23 : ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబాకు జిల్లా కలెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్‌తో పాటు ఐటీడీఏ పీవో ముత్యాలరాజు, అదనపు జేసీ కల్తీ వీరమల్లు, ఏఎస్పీ అంబర్‌కిషోర్ ఝా, ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, గెడాం నగేష్, డీడీ సర్వేశ్వర్ రెడ్డి, ఏపీవో జనరల్ వెంకటేశ్వర్లు ఆదివారం అర్ధరాత్రి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా నైవేద్యం పాలను నాగోబాకు సమర్పించారు.
సన్నాయి, డోలు వాయిద్యాలతో నాగో బా ఆలయం మారుమోగింది. జిల్లాలోని మెస్రం గిరిజనులతో పాటు చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని మెస్రం గిరిజనులు జాతరకు తర లివచ్చి స్థానికులతో కలిసి పూజలు నిర్వహించారు. సోమవారం మెస్రం ఆడపడచుల బెటింగ్ (నవవధవుల పరిచయం) కార్యక్రమం నిర్వహించా రు. గోవాడ్‌లో ఆదివాసులు ఏర్పాటు చేసిన 22 పొయ్యిలపై సిరికొండ కుమ్మరులు తయారు చేసిన కుండల్లో బి య్యం, గటక, పప్పులను వండి, మెస్రం ఆడపడచులు భోంచేశారు.
ఆదివాసుల ఆరాధ్య దైవమైన నాగోబా దర్శనంతో జన్మధన్యం అ యిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ అశోక్ అన్నారు. పూజల అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఆదిలాబా ద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల ఇలవేల్పు అయిన నాగోబా దేవతకు పూ జలు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ముత్యాలరాజు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎమ్మెల్యేలు గో డాం నగేష్, ఆత్రం సక్కులు మాట్లాడు తూ ఆదివాసుల జాతరకు అన్ని హం గులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
కేస్లాపూర్‌లోని నాగోబాను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తుండడంతో జాతరలో భక్తుల రద్దీ పెరుగుతోంది. మెస్రం ఉద్యోగ సంఘాల నా యకులతో పాటు ఆలయ కమిటీ చై ర్మన్ జంగు ఆధ్వర్యంలో దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు నిర్వహించారు.
నాగోబా జాతరలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటల పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. వాలీబాల్, క్రికెట్‌తో పాటు మహిళలకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో దాదాపు 40 మంది మహిళలలు, యువతులు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, బహుమతులు అందజేయనున్నట్లు ఐసీడీఎస్ సూపర్ వైజర్ మనోరమ తెలిపారు.
్ణ రాష్ట్రంలోని గిరిజన సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించేందుకు ఉట్నూ ర్ ఐటీడీఏ అధికారుల ఆహ్వానం మేరకు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ అధికారులు 30మంది గిరిజన కళాకారులను సో మవారం ఉట్నూర్‌కు పంపించారు. ఆదివారం రాత్రి 8 గంటలకు వ్యాన్ లో బయలుదేరి సోమవారం ఉద యం కేస్లాపూర్ జాతరకు చేరుకున్నామని కళాకారులు తెలిపారు.
నాగోబా జాతరలో రాష్ట్రంలోని గిరిజనుల సాంప్రదాయ నృత్యాలు అలరిస్తున్నాయి. నాగోబా జాతర పురస్కరించుకొని ఐటీడీఏ అధికారులు ఏర్పాటు చేసిన గిరిజన సాంప్రదాయ నృత్యమేళాలో రాష్ట్రంలోని రంపచోడవరం, భద్రాచలం, శ్రీశైలం, ఏటూరు నాగారం, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాంతాలకు చెందిన గిరిజన కళాబృందాల ఆధ్వర్యంలో సాంప్రదాయ నృత్యాలను ఏర్పాటు చేశారు. సోమవారం జాతరలో జిల్లా కలెక్టర్ డాక్టర్ అశోక్ జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లాకు చెందిన గోండులు గుస్సాడీ నృత్యం, భద్రాచలానికి చెందిన ఆదివాసీ కొమ్ము నృత్యం, జిల్లాలోని రామకృష్ణ ప్రాం తానికి చెందిన నాయికపోడ్ గిరిజనులు తప్పటగూళ్ల నృత్యాలను ప్రదర్శించారు. దీంతో కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు రంపచోడవరం గిరిజనుల సాంప్రదాయ నృత్యమైన కొమ్ము డాన్స్‌లో కొమ్ములు ధరించి స్టెప్పులు వేశారు.
ఆదివాసులు తమ సాంస్కృతి ఆచారాలను కాపాడుకుంటూ ముం దు తరాలకు అందించే ప్రయత్నం చే యడం సంతోషంగా ఉందని మేళాను తిలకించిన ప్రజలు అన్నారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ అశోక్ మాట్లాడుతూ జిల్లా గిరిజనుల నాగోబా జా తరలో బుధవారం జరుగనున్న నాగో బా దర్భార్‌కు జిల్లా ఇన్‌చార్జి మంత్రి బసవరాజు సారయ్య హాజరు అవుతున్నారని తెలిపారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, మహారాష్ట్రల నుంచి గిరిజనులు జాతరకు తరలిరావడం అభినందనీయమన్నారు.
జాతరలో మంచినీటి స మస్య ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని, వైద్య సౌకర్యాలను అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పీవో ముత్యాలరాజు, ఏజేఏసీ వీరమల్లు, ఆర్డీవో మహేష్, సీఈవో వెంకటయ్య, డీపీఆర్వో మహ్మద్ మూర్తుజాలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment