నిన్న ఒక ఫోన్ వచ్చింది . స్వామీ ! మీసూచన అనుసరించి ప్రదక్షినలు చేస్తున్న జంట లో అద్భుతమైన మార్పు వచ్చినది

అంటూ ఏలూరు నుంచి సదాశివరావు గారు ఆనందంగా చెప్పారు . అవునా అంతా స్వామి కృప అంటూ స్వామికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను . వారు పంపిన మెయిల్ చూడండి.
============================================================

sadasiva rao

to me
show details 3:21 PM (0 minutes ago)
దుర్గేస్వరరావు గారికి నమస్కరించి వ్రాయునది .
గత నెలరోజుల క్రితం నూతనంగా వివాహం చేసుకున్నజంట ఆరు నెలలు తిరగక ముందే భయంకరమైన గొడవలతో విడిపోయ్యే పరిస్తితి వస్తే వారి జాతకాలను పరిసిలించమని పంచవటి వేదిక ద్వారా కోరాను.దానికి స్పందించిన మీరు రేమిడిగా వారిరువురిని హనుమాన్ చాలిసా పారాయణం ,మరియు ప్రదక్షిణ విదివిదానాలు తెలియ చేసారు. .చివరి ఆశగా మీ మాట గా వారిని ఒప్పించి ఆచరించేలా ఏర్పాటు చేశాను మీరు చెప్పినది చెప్పినట్లుగా ఆచరిస్తున్నారు .ఈనెలరోజులలో వారిలో ఎంతో మార్పుని చూసాను .అనునిత్యం గొడవలతో కనిపించే అజంట పరస్పర అన్యోన్యంగా వుండటం, ఇద్దరు కలిసి తిరుమల సందర్శించి స్వామివారిని దర్శించుకొని ప్రసాదం ఇస్తూ సదాశివరావు గారు మేము కచ్చింతంగా విదిపోయ్యేవారమే మీరు కలగజేసుకోనకపొతే. గొడవలతో ఏమి కోల్పోయామో తలుచుకుంటే భయమేస్తుంది .అంతా భగవదేచ్చ అని సముదాయించి పంపాను .ఓ జంటను కలిపిన మీకు కృతఙ్ఞతలు తెలియ చేసుకుంటూ ..............నమస్కారములతో ................
మీ
సదాశివరావు

---------------------------------------------------------------------------------------------------------------------

పూర్తి విషయం చూద్దాం

ఏలూరులో సత్యవతిగారని ఉన్నారు . ఆమెకు ఇద్దరు పిల్లలు ఒకబాబు మానస అనే కూతురు . దురద్రుష్టవశాత్తూ భర్త చనిపోవటం తో ఆవిడే సంసార బాధ్యతలన్నీ చూసుకొనవలసిన పరిస్థితి . వారి భర్త స్నేహితులు ఆమెకు అందగా నిలబడి సహాయ సహకారాలు అందించారు . అదే ఊరులో ప్రకాష్ అనే యొగ్యుడు విధ్యాధికుడైన యువకునితో అమ్మాయి వివాహం తనకున్నంతలో ఘనంగానే జరిపారు. ఇరువైపుల సాంప్రదాయ కుటుంబాలే. ఒకబాధ్యతను నెరవేర్చగలిగాను అని ఊపిరిపీల్చుకుంటున్నంతలో అనూహ్యంగా కూతురి జీవితంలో అల్లకల్లోలం రేగింది . పెళ్లయి ఆరునెలలుకూడా కాలేదు తెగతెంపులు చేసుకోవాలనే స్థాయికి వివాదం పెరిగింది.
అబ్బాయి విద్యావంతుడే కాదు మమ్చి సదాచారపాలన కలవాడు . ఖచ్చితంగా ఆచారాలు పాటించాలనే పట్టుదలకలవాడు. అమ్మాయికి కాస్త ఆధునిక యుగభావాలు ఎక్కువగా అబ్బాయి . ఈపూజలూ పునస్కారాలు ఇలాచేయాలా మనసులో ఉంటే చాలదా అనుకునే తత్వం.
ఇక ఆడది ఇల్లాలుగా ఇంత్లో అలాపడుండాలి అనే ఆలోచన అబ్బాయిదైతే ,ఏమిటి ఆడమగా తేడా ఇద్దరూ సమానమే అనుకుని అంతవరకుంటె పరవాలేదు ఏంటి మగాల్లగొప్ప అనుకునే స్థాయి వ్యతిరేక భావం అమ్మాయిది . కాడికి కట్టిన ఎద్దులది చెరొక దారి ఇక బండి నడక ఎలాఉంటుంది ? అలాతయారయ్యింది .

ఇక ఇంట్లో జరగవలసిన పరిణామాలు వేగంగా జరిగాయి. అత్తామామలు నొచ్చుకున్నారు . అమ్మాయి తల్లి తన బిడ్దను రాచిఅరంపాన పెడుతున్నారని భావించింది. తమ బిడ్దను ఎదిరిస్తున్న కోడలి వల్ల అత్తామామలు ఖిన్నులయ్యారు . ఇక మాటలు తూటాలు పేలాయి . తగ్గాల్సిన అవసరం ఎవరికీ లేదనిపించింది . కలిసి ఉండటం అనవసరమనే నిర్ణయానికొచ్చారు . ఇక పెళ్ళికుదిర్చిన పెద్దలను పిలచారు అటొక ఇరవైమంది ఇటొక పదిమంది కూర్చున్నారు . ఎంత సర్దిచెప్పినా వినేస్థితి కనపడటం లేదు . పెద్దమనుషులెవరైనా ఏంచెస్తారు ? చేతైనంత వరకు కాపురం నిలబెట్టాలనే చూస్తారు . వీలుకాలేదు. అయితే అదృష్టవశాత్తూ ఈ పెద్దలలో ఒకరైన సదాశివరావుగారికి ఒక ఆలోచన వచ్చింది. మీరు ఇరువైపులా వారు కొద్దిగా ఆగండి దంపతులిద్దరితో నేను మాట్లాడతాను అని వారింటికి తీసుకెళ్లారు.
అక్కడ ఆయన మానప్రయత్నంగా అన్నికోణాలనుంచి విషయాన్ని పరిశీలించి వారికి వివరించాడు . ఎక్కడా సమస్యలేదు . కేవలం ఆభిజాత్యపోరు . అమాయకత్వం ,అవగాహనా రాహిత్యం కలగలసి సమస్య పీటముడివేసుకుంది .
ఇదేదో జాతకదోషం అనే అవగాహనకొచ్చిన ఆయన అప్పటికే తానుఉన్న పంచవటి అనే గ్రూపులో ఈవిషయం వెల్లడించారు . జాతక పొంతనలు కుదరలేదా ? వీల్లపరిస్థ్తితి ఎలా విడిపోవలసినదేనా ?అని ఆవేదన వ్యక్తం చేశారు . జాతకపొంతనలు వివాహానికి ముందుచూసుకోవాలి . విడిపోదలచుకుంటే పొమ్మనండి అని సమాధానం వచ్చింది అక్కడ పెద్దలనుంచి.

అప్పటికి పంచవటిలో నా సభ్యత్వం తొలగించలేదు . నేనూ ఈ చర్చను గమనించాను . అడిగినది నన్నుకాదు ,పైగా జాతకజ్యోతిష్యవిసయాలలో నాకంతగా ప్రవేశం కూడా లేదు. అందుకని మౌనంవహించాను . కానీ మరిక్షణం గుండెల్లోంచి అకారణంగా జాలి తన్నుకువచ్చింది . ఒక ఆడపిల్ల జీవితం విఫలమవుతుంటే ఎలా అని ? అసంకల్పితంగా నాచేతులు కీబోర్డ్ మీద ఆడాయి . అడగకుండాచెప్పకూడదు కానీ ఇది ఆడపిల్ల జీవితం అమ్మాయిచేత హనుమదుపాసన చేపించండి అని వ్రాసాను.
మరుసటిరోజు సదాశివరావుగారు ఫోన్ చేసి అడిగారు ఎలాచెపించమంతారు స్వామీ అని . అయ్యా నాకు తెలిసిన విషయం చెబుతాను . సీతారాముల వియోగాన్ని బాపిన స్వామి ,ఆశ్రయిస్తే తన భక్తులను విడిపోనివ్వడు. నేను ప్రయోగపూర్వకంగా నిరూపణలు చూసిఉన్నాను. హనుమాన్ చాలీసా పారాయణం సుందర కాండ పారాయణం తో సమానం . కనుక కఠిన నియమాలతో చాలీసాపారాయణం ,ప్రదక్షిణలు చేయమని చెప్పండి దంపతులిరువురికి అని సూచించాను.
సహృదయులైన సదాశివరావుగారికి అర్ధమైంది . ఆయన దంపతులను కూర్చోబెట్తి జాతక దోషాలవల్ల మీకు ఇలాజరుగుతున్నది . ఇలా నలభైరోజుల సాధనచేయండి . విడిపోవటానికి నలభైరోజులతరువాతైనా ఇబ్బమ్దేమీలేదుకదా ? అని వారికి చెప్పాడు . ఏముహూర్తానవిన్నారో ఇద్దరూ అంగీకరించారు .
ఇకమొదలైంది చమత్కారం . సాధన మొదలయినప్పటినుండి ద్వేశం స్థానంలో ప్రేమ పెల్లుబికటం మొదలెట్తింది ఇరువురికి . అటు అచలాకీగా పూజలు చెస్తూ ఇంటిపనిచూసుకుంటున్న కోడలిని చూసి అత్తామామా సంతోషం తో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మాఅల్లుడు బంగారం అని అత్తగారు పొంగిపోతున్నది , సాధన మొదలై ముప్పైరోజులే అయింది . మొన్న ఇరువురూ తిరుమలవెల్లి శ్రీవారిని దర్శిమ్చుకుని వచ్చారట . సదాశివరావుగారు ,ఈసాధనాకాలం తరువాత విడాకులగూర్చి ఆలోచిద్దాం అని సరదాగా అంటుంటే
చాల్లేండి . అది తలచుకుంటెనే భయంకరంగా ఉంది. ఎందుకు అలాప్రవర్తించామో మాకే అర్ధంకావటం లేదు . మీరు మాకాపురం నిలబెట్టారు అని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారట . ఆయనేమో నాకు కృతజ్ఞతలు అంటున్నారు .

మన బాస్ సంగతి నాకుతెలిసినదేగా !
బాసూ ! అసలుసంగతేమిటి చెప్పవా ? అని మనసులో ఆయనను బ్రతిమిలాడాను .
ఆయన అపారకరుణతో నామనసుకు గోచరించిన విషయం విన్నవిస్తాను

నాహం కర్తా :

పైకి సదాశివరావు గారు నాపాత్ర కనపడుతున్నాయి గాని ఇవి వాస్తవానికి బొమ్మలే . విషయం లోకొద్దాము.

మనపెద్దలు అద్భుతమైన విషయాలు చిన్నసామెతలో చెబుతారు . ఒకడి ఆస్తి ఒకడికి కావచ్చేమోగానీ ఒకడి ఆలి [భార్య] ఇంకొకడికి కాదు అని. దానినే పెద్దలు రుణానుబంధరూపేణా పశుపత్నీ సుతాలయా ....అని సూత్రీకరిస్తారు,
ఇక్కడ జాతకపొంతనలు చూసినా చూడకున్నా ఎవరికి ఎవరితో రాసిపెట్టిఉంటుందో వారితో జతగాక తప్పదు.
లోకంలో వివాహాలన్నీ ఇంతే . అయితే . ఈజీవి చెడుకర్మలు పనిచేయటం ప్రారంభిస్తే అల్లకల్లోలం ప్రారంభమై కష్టాలు మొదలవుతాయి.
ఆసమయంలో ఇతను పూర్వంచేసిన సత్ క్రియల,దేవతారాధనల పుణ్యం అక్కరకొస్తే అడ్డుపడి కాపాడుతుంది. దైవబలం తగ్గితే స్థితి దిగజారుతుంది. పరమ దయాలువైన పరమాత్మ తనభక్తున్ని తన అండకు రమ్మని ఏదో ఒకరూపేణా సంకేతం పంపుతాడు. అందుకోసం మహాత్ములే కాదు నాలాంటి అనామకుడినైనా ఉపయోగించుకుని తన సంకేతాన్ని ప్రసారం చేస్తాడు . అప్పుడు తాడందుకుంటే పైకి చేరవచ్చు. మూర్ఖంగా నిర్లక్ష్యం చేస్తే చెడుకర్మలు మరింతబలీయంగా పనిచేసి పతనావస్థకు చేరుస్థాయి. ఈ అమ్మాయి చిన్నతనంలో బాగా చాలిసా పాడుకునేదట, స్వామి వారి భక్తురాలు. పెద్దాయేకొద్దీ పుస్తకాల చదువులెక్కువై స్వామి పైగల భక్తి మరుగునపడింది. కానీ ఆపదలో ఉన్న తనభక్తురాలు తనను మరచినా తానుమాత్రం స్వామి మరువలేదు. ఇలా గుర్తుచేసి ఆశ్రయింపజేసుకుని కాపాడుతున్నాడు.

అయితే జాతక దోషాలు అని చెప్పెవి అసత్యమా అని మీరనవచ్చు. ఎన్నటికీ కాదు . అవి సత్యమే . కానీ మనం శాస్త్ర్రంయొక్క ఉద్దేశ్యాన్ని తెలుసుకోవాలి. జరగాల్సినది ఎలగూ జరుగుతుంది అని అనుకుంటే ఇక ఈశాస్త్ర్రాలను ఇచ్చిన మహర్షుల సంకల్పం అర్ధమేమిటి ? ఇవి స్కానింగ్ మిషన్ లాంటివి . రోగ నిర్ధారన జరిగాక గురువనే వైద్యుణ్ణి ఆశ్రయించి భగవత్ కృప అనే ఔషధాన్ని సేవించి స్వస్థత పొందాలనేదే ఋషిపరంపర సూచించిన బాట .
ఇప్పుడు స్వామి కృపతో కాపురాన్ని కూలకుండా కాపాడుకుంటున్న ఆయువజంటకు శుభాకాంక్షలు చెబుదాం .
సర్వేజనా సుఖినోభవంతు.


2 comments:

Anonymous said...

good post.congratulations:)

Anonymous said...

good post congratulations