ఆర్తితో ప్రార్ధించి ఆశ్రయిస్తే సప్తసముద్రాలవతలున్నా హనుమంతుడు ఎలా ఆదుకున్నాడో నిరూపించిన ఉదాహరణ ఇది.
బ్రతుకుతెరువు కోసం అమెరికా వెళ్ళి ఎన్ని ప్రయత్నాలూఫలించక ఆవేదన చెందిన ఓ యువకుడు స్వామినాశ్రయించి ప్రయోగపూర్వకంగా ఆయన కృపను ఎలా నిరూపించుకున్నాడో .ఈఉదాహరణ మనకు తెలుపుతుంది. ఆయువకుని తల్లిగారు నాకు ఫోన్ చేసి బాధపడ్దప్పుడు ఒకటే చెప్పాను .అమ్మా నీబాధను ఇలా ఏడుస్తూ మాలాంటివారితోనో ,బంధువులతోనో పంచుకుంటే ఏమిలాభం ? ఆ దు:ఖాన్ని మొత్తం ఆస్వామిముందు పెట్టు ఆయన మనసుకరుగుతుంది అని .మొన్నఫోన్ చేసి నా సమస్య ఎప్పుడు తీరుతుందో మీరు చెప్పినట్ల చేస్తున్నాను ,నలభైరోజులు పూర్తి కావస్తుంది అని ఆవేదనపడిన ఈ కుర్రవాడి ఇప్పుడు ఈ ఆనందాన్ని కూడా స్వామి దయతోను ,అతని భక్తి తోమాత్రమే పొందగలిగాడని నేనునిజమ్ చెబుతున్నాను. నాలాంటి గడ్డిపరకలాంటి మామూలువ్యక్తి ప్రమేయమేమీ లేదని మరొకసారి మనవిచేసుకుంటూన్నాను. తనుపంపిన మెయిల్ ను యథాతథంగా పంపుతున్నాను చదవండి
.....దుర్గేశ్వర
..................................................................................................................................................
గురువు గారు నమస్తే,
నేను మీ సలహా మేరకు పారాయణము చేసి లబ్ది పొందాను. క్రింది వివరములు గమనించ గలరు.
...............................................
నేను మీ గురుంచి ఈ ఇయర్ గురుపౌర్ణమి కి ముందు ఒక స్నేహితుడు ద్వారా మీ బ్లాగ్ అడ్రస్ పొందాను. అప్పుడు మీ బ్లాగ్ చదివి మా కుటుంబ వివరములు ( గోత్రం, నామములు ) ఈమెయిలు ద్వారా మీకు పంపాను. అప్పుడు నీను సాయి బాబా ౭ రోజుల పారాయణం ముగించి, మీ ఆజ్ఞ మేరకు సాయి గురు పారాయణం కూడా "గురు పౌర్ణమి" కి ముందు పూర్తి చేశాను.
నీను ఫిబ్రవరి నెలలో అమెరికా వుద్యోగ రీత్యా వచ్చాను. అన్ని ఇంటర్వ్యూ లు వస్తున్నా, చివరలో ఆగిపోతుండడం వలన నేను చాలా బాధపడుతూ వుండే వాడిని. ఒక రోజు, నాకు దుర్గేశ్వర రావు గారితో నా భాద చెప్పుకోవలనిపించింది. అప్పటి వరకు దుర్గేశ్వర రావు నాకు పరిచయము లేదు. నేను హరిసేవ బ్లాగ్ చదవటం వలన ్ ఫోన్ నెంబర్ బ్లాగ్ ద్వార తెలుసు కొని నా బాధ చెప్పుకొని నా జాతకం తెలుసు కుందాం అని అమెరికా నుండి దుర్గేశ్వర రావు గారికి ఫోన్ చేశాను. వారు నా డేట్ అఫ్ బర్త్ , గోత్రం మరియు పుట్టిన స్థలము తెలుసు కొని, రెండొవ రోజు నాకు ఒక సూచనా ఇచ్చారు.
అది అమిటంటే "మురళి, నీవు యుక్త వయసులో వున్నావు కనుక, నీవు హనుమాన్ చాలీసా చేస్తే పలితం దక్కుతుంది. నీవు నలుపది దినములు మధ్యము, మాంసము ముట్టకుండా నిష్ఠతో హనుమాన్ చాలీసా చెయ్యు అన్నారు. మరియు మొదటి శనివారము ౧౦౮ సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యు అని సలహా ఇచ్చారు. నాకు ఆ సలహా విని దానిని క్రమం తప్ప కుండ అనుచరిస్తున్నాను. రేపటితో నలుపది రోజుల పారాయణం పూర్తి చేస్తున్నాను. నేను ముప్పయి ఎనిమిది రోజులలో స్వామి వారి అనుగ్రహము స్వామి వారి అనుగ్రహాన్ని చవిచూశాను. ఇప్పటిదాకా నాకు ప్రతిసారీ వస్తున్నా నిర్రాశాజనక ఫలితాలు తొలగి ,నాకు వుద్యోగం లభించింది. నాకు చాలా సంతోషముగా వుంది.
సో, ఐ వాంట్ తో షేర్ మై ఎక్ష్పెరిఎన్కెస్ విత్ యు. సో, ఐ అం రైటింగ్ థిస్ ఈమెయిలు. ఐ అం వేరి మచ్ థాంక్స్ టు యు.
థాంక్ యు గురువు గారు,
మురళి,ఆ
కాలిఫోర్నియా, అమెరికా.
Friday, September 11, 2009
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
భక్తితో ఆ హనుమంతుని ఆశ్రయిస్తే ఆయన తప్పక అనుగ్రహిస్తాడు.
>>నాలాంటి గడ్డిపరకలాంటి మామూలువ్యక్తి ప్రమేయమేమీ లేదని మరొకసారి మనవిచేసుకుంటూన్నాను
>>
ఈ విషయాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే మాలాంటి వాళ్ళకు ఆ భగవంతుని ఆశ్రయించే విధానాన్ని మీరు తెలియజేస్తున్నారు.
జై హనుమాన్.
Guruvu gaariki Paadabi vandanamulu.
Paarayana antey roju podunna sayantram hanuman chalisa okkasari chadavala lekapotey 11 sarlu cheyyala...modati sanivaram 108 sarlu chadavamani chepparu.
Koncham dayato vivarincha galaru.
Namaskaramlato,
Mee videyyudu.
Durga.
jai sri anjanayam learn hanuman chalisa .....
Post a Comment