లక్నోకు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని, జలావన్ జిల్లాలోని, జగ్నేవా అనే గ్రామంలో ఉన్న పురాతన హనుమాన్ దేవాలయంలో నీటికోసం హిందువులే కాకుండా ముస్లింలు ఇంకా అన్ని మతస్థుల ప్రజలు తహతహలాడుతున్నారు. ఎందుకంటే ఆదేవాలయంలోని బోరింగ్ నుంచి వచ్చే నీటితో ఎటువంటి వ్యాధులైనా నయమౌతున్నాయి.
నీటికోసం వచ్చిన ప్రజలు ముందుగా బోరింగ్ చుట్టూ ప్రదక్షిణలు చేసి, ప్రార్ధనలు చేసి, తదనంతరం బోరింగ్ నీరు తోడుకుంటున్నారు. రోజూ దాదాపు 1000 మంది వరకూ ప్రజలు కుల, మత, ప్రాంత, వర్గ, లింగ బేధాలకు అతీతంగా దేవాలయానికి వస్తున్నారని అక్కడి పూజారుల కథనం బట్టి తెలుస్తుంది.
స్థానికుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్ నుంచి గీతానంద్‌జీ మహరాజ్ పేరుగల ఒక ఋషి దాదాపు పది రోజుల క్రితం ఆదేవాళయానికి వచ్చారని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ ఋషిని దర్శించుకుని, ఆశీర్వాదం పొంది, ఎంతో కాలంగా తాము అనుభవిస్తున్న దీర్గకాలిక రోగాలకు విముక్తి పొందారట. ఇలా వ్యాధిగ్రస్తులైన వ్యక్తులు తండోప తండాలుగా ఋషి దర్శనార్ధం రాగా, ఆ ఋషి మీ సమస్యకు
శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చి, ఆబోరింగ్ పంప్ ను పూజించి ఇకపై ఈ బోరింగ్ నుంచి వచ్చే జలం మీ సర్వ వ్యాధులను నివారిస్తుంది అని చెప్పారట.
రయీస్ అహ్మద్ అనే ఒక ముస్లిం 10 సంవత్సరముల వయసుకల తన కుమార్తె వ్యాధి గ్రస్తురాలయి నడవలేని, తినలేని పరిస్థితిలో ఉండగా ఆమెకు రెండురోజులపాటు ఈ బోరింగ్ జలాలు త్రాగించిన పిమ్మట ఆమెకున్న సకల వ్యాధులు నశించాయని, ఆమె నడవ గలుగుతుందని, తన పనులు తాను చేసుకో గలుగుతుందని చెప్పాడు.
ఈప్రాంతపు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఈవిషయంపై మాట్లాడుతూ "అన్నిమతాల ప్రజలు ఈనీటికోసం ఎగబడుతున్నారనియు, ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ప్రభుత్వానికి ఇది ఒక సవాల్ గా తయారవుతుంది" అని చెప్పారు.
పంపినవారు
మల్లావాసుబాబు,హైదరాబాద్
Wednesday, September 23, 2009
Labels: శ్రీరామదూతం శిరసా నమామి
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment