అది 1991-92.అప్పట్లో నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. బంధువులచే
మోసగించబడి సమారు అప్పుచేసి తెచ్చిన డబ్బు 5.5 లక్షలవరకూ వారిచే
మోసగింపబడి భార్యాపుత్రులతో అత్తవారింట్లో ఆశ్రయం పొందుతున్నరోజులవి.
నిరుద్యోగిగా సుమారు 2.5 సంవత్సరములు గడిచినవి.భార్య భారతి సుగరు
వ్యాధితో మంచం పట్టింది.కాలిలో కురుపు(డయాబెటిక్ ఫుట్)తో నెల రోజులు
తణుకులో హాస్పిటలులో ఉన్నా డాక్టరుగారి నిర్లక్ష్యవైద్యం వల్ల
తగ్గకపోయినా ఇంటికి తీసుకుని వచ్చిన పరిస్థితి.అప్పుడే నాకు హైదరాబాదులో
ఉద్యోగం దొరికితే ఒక్కణ్ణీ వెళ్ళి జాయినయ్యాను.రెండో రోజునే భారతి
డయాబెటిక్ ఫుట్ కురుపు చీముపట్టి వాసన వస్తోందని కబురు.వెంటనే మెరుగైన
వైద్యం కోసమని ఆవిడను తణుకునుంచి హైదరాబాదు రైలులో పంపించారు.గౌతమి
ట్రైను సికిందరాబాదు స్టేషను చేరేసరికే ఆవిడకు ఇన్ఫెక్షనువల్ల జ్వరం కూడా
వచ్చింది. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం కావటం చేత వెంటనే పెద్ద డాక్టరు ఎవరూ
దొరకక పోవటం, మర్నాడు సాయంత్రం డాక్టరు ఎప్పాయింట్మెంట్ దొరికింది.
మధురానగర్ దగ్గరలోని సిక్ బే హేస్పిటలులో చేరాం. వైద్యం ఇంకా
మొదలుపెట్టకుండానే ఆ రాత్రే ఆమె కోమా లోనికి వెళ్ళిపోవటం జరిగింది.
శ్రీనివాస రెడ్డిగారనే డాక్టరుగారు ఆమెకు వెంటనే చికిత్స మొదలుపెట్టి
నాలుగు సీసాల రక్తం ఎక్కించి ఆవిడను తిరిగి స్ప్రహ లోనికి తెచ్చారు.ఆ
సమయంలో పేషంటు పరిస్థితిని గురించి ఏమీ చెప్పలేమనిన్ని, చివరి చూపుకోసం
మా అబ్బాయిని కూడా హైదరాబాదు పిలిపించుకోమనీ కూడా డాక్టర్లు చెప్పటం
జరిగింది. మా అబ్బాయినికూడా పిలిపించాం.మానవ ప్రయత్నాలన్నీ ఎన్ని
చేస్తున్నా దేవుని మీద భారం వేసి తిరుపతి వెంకన్నకూ(నా స్వామి),
సిర్డిసాయిబాబాకు(మా ఆవిడ ఇస్టదైవం) మొక్కులు మొక్కుకున్నాం.
డాక్టర్ల కృషిచేతనూ,దైవం మాయందుండటం చేతనూ కష్టం గడిచి ఆవిడ కోలుకోవటం
జరిగింది. సమారుగా నెలరోజులు పైగా హాస్పిటలులో ఉండాల్సొచ్చింది.ఆ సమయంలో
హైదరాబాదులోనే కాపురం ఉంటున్న మా ఆవిడ అన్నయ్య(కజిన్),ఇంకా
ఇతరబంధువులు(ఆవిడ తరఫువారే) చేసిన సహాయాన్ని మేమెప్పుడూ మర్చిపోలేము.
అప్పుడు జరిగిన హడావుడీ కంగారూ ఇంతింతని చెప్పలేను.
తరువాత గత పదిహేను సంవత్సరాలలోనూ కూడా ఇంకో రెండుసార్లు ఆ కాలికీ
రెండోకాలికీ కూడా ఇన్ఫెక్షన్లు రావటం బాగు చేసుకోవటం కూడా
జరిగింది.వైద్యనారాయణులకృషితో పాటుగా ఆ శ్రీమన్నారాయణుని కృపకూడా మామీద
ఉండబట్టి ఆవిడ క్షేమంగా రోగాలనుండి బయటపడింది.--ఇవి నా జీవితంలో మేము
ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలూ దైవకృపతో ఆ గండాలను దాటిన వైనమూను.
వ్రాసినవారు :- మల్లిననరసింహరావుగారు
Saturday, January 31, 2009
Labels: గోవిందాశ్రిత గోకుల బృందా........
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
సమయాభావం వలన నా అనుభవాలు ఇక్కడ పంచుకోలేకపోతున్నా, నాకు దైవం అనునిత్యం వెన్నంటివుండి నను నడిపిస్తున్నాడని తెలుసు. అలాగే మీ బ్లాగు టపాలు చదువుతుంటాను అని చెప్పటం కూడా ఈ ద్వారాగా కుదిరింది.
సమయాభావం వలన నా అనుభవాలు ఇక్కడ పంచుకోలేకపోతున్నా, నాకు దైవం అనునిత్యం వెన్నంటివుండి నను నడిపిస్తున్నాడని తెలుసు. అలాగే మీ బ్లాగు టపాలు చదుతుంటాను అని చెప్పటం కూడా ఈ ద్వారాగా కుదిరింది.
Post a Comment