శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ గణేశాయనమః
అందరికీ నమస్కారం
రానున్నది అతి ఉత్కృష్టమైన పండుగ, అదే గురు పౌర్ణమి, వ్యాసులవారి పేర ఆ
రోజును ప్రత్యేకంగా గురువులను పూజించే పండుగ. ఆధ్యాత్మిక జీవనంలో ఉన్న
ప్రతి సాధకునికి అత్యంత ప్రీతి పాత్రమైన పండుగ.
శిష్యుని అజ్ఙానమనే అంధకారాన్ని తమ ఊపిరిని వాక్కుగా మలచి తమ బోధచే ఆ
అంధకారాన్ని తొలగతోసి, శిష్యుల ఉన్నతిని కాంక్షించే గురు స్వరూపాల ఋణం
మనం ఏవిధంగా తీర్చుకోగలం. గురువంటేనే త్యాగం, ఏ పండగలూ లేక, వివాహాది
శుభకార్యాలూ లేని శూన్యమాసం వంటి ఆషాడమాస పూర్ణిమ నాడు గురుపూజ.
శిష్యోన్నతికోసం వారి ఊపిరినే త్యాగం చేసే గురు స్వరూపాలకు ఏవిధంగా మనం
పూజ చేయగలం, నిజానికి మనం పూజిస్తామన్నా వారు దానిని భగవత్పరమే చేస్తారు.
నిత్యమూ బ్రహ్మంలో రమిస్తూ, శిష్యుల తప్పులను కాస్తూ, వారు నమ్మిన
ధర్మాన్ని ఆచరిస్తూ, గురుపరంపర కొనసాగిస్తూన్న గురుస్వరూపాలకు ఏమివ్వగలం
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. ఈ ఆధునిక పోకడలలో, హేతువాద కుతర్కులతో
సన్నబడుతున్న సనాతన ధర్మాన్ని వారి బోధలతో నిలబెట్టి నడుపుతున్న గురు
స్వరూపాలకోసం మనం ఏం చేయగలం... వారిబోధలు వినడం ఆచరించడం నమస్కారం చేయడం
తప్ప...
శ్రీ రామ చంద్రులంతటివారే విశ్వామిత్రులవారితో మీ కింకరుణ్ణి అని
చెప్పుకున్నట్టు, మీ కింకరులం దాసానుదాసులం అని మనసా నిత్యం సాష్టాంగ
పడడం తప్ప.
ఇక ఈ గొప్ప పండగ నాలుగు రోజులలో రానున్నది, అందరు గురుస్వరూపాలనూ
కీర్తించటం స్మరించటం సాధ్యమయ్యే విషయం కాదు కదా! అందుచేత రోజూ ఒకరిద్దరు
గురుస్వరూపాలను ఆచార్య స్వరూపాలను (సనాతన ధర్మమునందు పూర్తిగా చరించిన
ఆచార్య స్వరూపాలను, గురు స్వరూపాలను) వారు బోధించిన కొన్ని విషయాలను
ఇక్కడ కొద్దిగా స్పృశించుకొందామని చేసే ప్రయత్నమిది. గురువైభవం గురించి
చెప్పాలంటే అది తరమా...... అనంత సాగరతుల్యమైన ఈ గురుపరంపరలో గురువైభవంలో
ఎక్కడ మొదలెట్టాలో కూడా తెలియకున్నా బ్రహ్మాండ జ్యొతి స్వరూపుడైన
ఈశ్వరుని ఎదుట చిన్న దీపం పెట్టి పూజించే ప్రయత్నం వంటిది ఇది... ఈ
ప్రయత్నం కేవలం చంద్రునికో నూలు పోగు వంటిది....
ఈ గుంపులో పెద్దలు చాలామంది ఉన్నారు, మీకు ఈ గురువైభవాన్ని గూర్చి మీకు
వీలైనంత మేర తెలిసిన విషయాలు ఇక్కడ ప్రస్థావించండి. అందరం గురు స్మరణ చే
పునీతులమవుదాం.
సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు [అయ్యగారి నాగేంద్రకుమార్]
----------------------------------------------------------------------
క్షమించగలరు.
--------------------------------------------------------------
ఇట్లు,
-------------------------------------------------------------------------------
అహంకార వినాశాద్ధి పరమాత్మా ప్రసీదతి!!
సద్గురువును ఆశ్రయించటం వల్ల అహంకారం నశిస్తుంది. అహంకారం నశిస్తే
పరమాత్మ ప్రసన్నుడౌతాడు
మనకి కావలసిన ఒక వస్తువుకి మనకి మధ్య ఒక గోడఉంది. అది దాటితే మనకి
కావలసిన వస్తువు మనకి దొరుకుతుంది. ఆ గోడే అహంకారం, ఆ గోడను
అధిగమింపజేసేవాడే గురువు. మన అహంకారమనే గోడను బద్దలు కొట్టి మనం చేరవలసిన
పరమాత్మను మనకు చూపించే వారే గురువులు. గురువులేక మనం ఆ గోడను దాటలేం
భగవంతుని చేరలేం. రమణులంతటివారే గురువు యొక్క ఆవశ్యకతను చెప్పారు.
భగవంతుడున్నాడని ఆస్తికులందరూ నమ్ముతారు. పేర్లు వేరు కావచ్చు కాని
భగవంతుని చూచినవారు అరుదు. సద్గురువుని ఆశ్రయిస్తే దైవదర్శనం
ప్రాప్తిస్తుంది. సద్గురువు అంటే భగవంతుని దర్శించి, భగవదనుభూతి తాను
పొంది, తన శిష్యులకు పంచగలవాడు, ఒక్కసారి భగవదనుభూతిని పొందితే పరసువేది
స్ప్రర్శసోకిన లోహంలాగ ఎవరైనా భగవత్స్వరూపమే! సద్గురువు పరమాత్మ స్పర్శను
అనుభవించాడు కనుక పరమాత్మయే, వారిని దర్శిస్తే సర్వదేవతలను దర్శించినట్టే
అవుతుంది, అటువంటి సద్గురువు లభించిన తర్వాత నిశ్చింత. పాదాలు పట్టుకోవటం
వరకే శిష్యుడి పని. ఆపై బరువు బాధ్యతలన్నీ వహించి, దరిచేర్చవలసింది
గురువే భగవత్సాన్నిధ్యమో, మోక్షమో! శిష్యుడి పని - గురువుపై అంచలంచల
విశ్వాసం ఉంచి, గురువు చెప్పినట్టు వినటమే. కన్నతల్లి లాగా ఎవరికేది
కావాలో, ఎవరికి ఏది తగినదో దానిని సమకూరుస్తాడు గురువు. భగవంతుడు
పాంచభౌతిక శరీరంతో అందరికీ దర్శనమీయటం సాధ్యంకాదు, కనుక గురువులోనే
కనపడతాడు శిష్యులకి.
ఇక గురువుని ఎలా పొందాలి, ఈ ప్రశ్న నాకు నాలుగైదేళ్ళ క్రిందట కలిగింది,
కంచి పీఠానికి భక్తులైన కొందరిని ఈ ప్రశ్న అడిగాను. అందులో అందరూ
చెప్పినదేమంటే. గురువుని పొందటానికి మనం తపించాలి, మనం ఎంత తీవ్రంగా ఒక
గురువు మనకు ఉండాలి అని తపిస్తామో మనని అక్కున చేర్చుకునేందుకు గురువు
కూడా అంతకన్నా రెట్టింపుగా మనని అక్కున చేర్చుకుంటారు అని. ఆ గురువు ఎవరు
అనేది స్వయంగా ఆ గురువు మనని శిష్యునిగా అంగీకరించే వరకూ మనకీ తెలియదు.
మనం ఫలానా వ్యక్తి మనకి గురువు అవ్వాలి అనుక్కుంటాం, మనం ఎవరి దగ్గర
చేరాలో వారి వద్దే చేరుతాం.
గురువు యొక్క గుణ గణాలు మనం ఎంచ నక్కరలేదు, గురువుని పొందాలన్న మన
కోర్కెలోని నిజాయితీని బట్టి సరియైన సమయంలో గురువు వారంతటవారే మన
జీవితంలోతటస్థిస్తారు. ఆ గురువు మనకి చిర పరిచితులే కావచ్చు లేదా
అప్పటికప్పుడు పరిచయమూ కావచ్చు.
సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు [అయ్యగారి నాగేంద్రకుమార్]
------------------------------------------------------------
-----------------------------------------------------------
మీర్రన్నది వాస్తవమే
నాకు కలిగిన అనుభవం ఒకటి ప్రస్తుతిస్తున్న అది
1994 పిబ్రవరి 18 న తిరుమల లోని స్వామివారిని దర్శించి పాపనాశనం దర్శనానికి వెళ్తున్నపుడు ఎదురుగ దాదాపు 7 అడుగులు వున్నా మంచి తేజస్సు తో పిలకను ధరించి ఉర్ధపున్డ్రములు ( విభూతి రేఖలతో ) తో ఎదురుగ వస్తున్నారు ఒకరు, వారు పీతామ్బరము ధరించి, చేతిలో కృష్ణజీనమ్, దండం , పాదాలకు పావుకోల్లు, ధరించివున్నారు నేను ఎప్పుడు అంత ఇదిగా సశాస్త్రీయమైన (Orthodox figic) రూపాన్ని చూడలేదు
వారిని తధేకముగా నిచేష్టుడనై గమనిస్తున్నాను నా పక్కన నా భార్య మా అబ్బాయి వున్నారు మా వాళ్ళను వదిలేసి నేను ఆయన గారితో పాటు వెళ్తున్నాను ఆయనగారు నన్ను చూసి నవ్వుతువేళ్తున్నారు నా భార్య నన్ను పిలుస్తుంది నేను ఇన్పించుకోలేదు. వారిని అనుసరిస్తూ వెళ్తుండగా అక్కడ ఒక వీది మలుపు వచ్చింది వారు అక్కడ మలుపు తిరిగి వెళ్లారు నేను అనుసరిస్తున్నాను
కానీ నేను ఆ మలుపు తిరిగేసరికి వారు కనిపించలేదు నాకు ఆశ్చర్యం కలిగింది వారికోసం వెదుకుతూ పక్కకు తిరిగిచూసెసరికి అక్కడ ఒక మూలా వంటినిండా మట్టి, మడ్డి,పూసుకొన్న రీతిగా బట్టలు లేకుండా జడలుకట్టిన జుట్టుతో, బాగా పెరిగిన గడ్డం తో పడుకొని వున్నారు ఒకరు
వారిని, నాకు కనబడ్డ వారి గురించి అడిగితె తెలుస్తుంది కదా అని వారిని అడుగుదామని వారి దగ్గరికి వెళ్ళాను
నేను వారిని పైనతెలిపిన రూపం ఉదహరిస్తూ వారి ఆనవాలు ఏక్కడ? అని అడిగాను
వీరు గడ్డం నిమురుకొంటు ఈవిధముగ అన్నారు
"చూడు నాయన ఒక చోట నలుగురు కలిసి మాట్లాడుకొంటున్నారు
.ఆనలుగురిలో ఒకడు ఇక్కడా మల్లెపూలు వాసనా వస్తుందేక్కడ? అని అన్నాడు
వారిలో మరొకడు బహుశా ఆక్కడ తోపుడుబండి పోతుంది గదా దాని మీద మల్లెపూలు వుండచ్చేమో ! అని అన్నాడు
వెంటనే మరొకడు ఆ బండి దగ్గరికి వెళ్లి ఏదో కుప్పగా వున్నా దానిమీద తడిగా వున్నా గొను పట్టా కప్పిన దానిని చూసి ఆ గొను పట్టాను తీసి ఆహ! బలేగా వున్నాయి మల్లెపూలు అంటూ ఆ సువాసనను ఆస్వాదిస్తూ ఆ మల్లెపూలను తీసుకోని ఈ ముగ్గురి దగ్గరికి వచ్చాడు
ఇక నాలుగో అతనూ ఇవి ఏవీ పట్టకుండా తను ఏదో చెపుతూ పోతున్నాడు ఇది అంత విన్నావు గదా ఈ నలుగురిలో నీది ఏ స్తితి ? గమనించు అన్ని బోధపడతాయి" అని మౌనముగా వురుకొన్నారు నాకు అది అర్దమై వారి పాదాలకు నమస్కరించి వెనుతిరిగాను
ఇక్కడ ఆశ్చర్యం ఏమిటి ఆంటే నాకు కనిపించిన ఆ మహానుభావుడు నా భార్య కు గానీ, ఎవరికి కనిపించలేదు
1 comments:
YgsZhp [url=http://dezhoupuke.webnode.cn/]百家乐[/url] EinWsp [url=http://yingchaoliansai.webnode.cn/]英超联赛[/url] EjbZgv [url=http://yingchaosaicheng.webnode.cn]英超直播[/url] McoOzn [url=http://zuqiuzhibo.webnode.cn/]天下足球直播[/url] ThkXzp [url=http://tianxiazuqiu.webnode.cn]天下足球直播[/url] UoaVfu [url=http://nbazhibobiao.webnode.cn]NBA直播表[/url] [url=http://nbashipin.webnode.cn]NBA直播吧[/url] BcgLue [url=http://nbazhibo8.webnode.cn]腾讯NBA直播[/url] YapShl [url=http://quanxunwang.webnode.cn/]博彩通[/url] EfyCvo [url=http://wuhusihai88.webnode.cn]百家乐[/url] QwsZym [url=http://zhijiage.webnode.cn/]芝加哥娱乐城[/url] JgaYhf [url=http://ttylc66.webnode.cn/]88娱乐城[/url] QqaFhq [url=http://bocai666.webnode.cn/]博彩通[/url] HuzWwq [url=http://bocai888.webnode.cn/]博彩网[/url] QygCia [url=http://bocai777.webnode.cn/]德州扑克[/url] QmwTif [url=http://bocai999.webnode.cn/]博彩网[/url] EpnGnh [url=http://baijiale666.webnode.cn/]百家乐[/url] OqmVfi [url=http://taiyangcheng999.webnode.cn/]88娱乐城[/url] BbfVrc [url=http://qxw666.webnode.cn/]全讯网[/url] [url=http://tt5252.com/]全讯网[/url]
[url=http://tt2929.com/]百家乐[/url]
HeoQpk [url=http://nba43.webnode.cn]NBA直播视频直播[/url] NedTjm [url=http://nba44.webnode.cn]英超赛程[/url] SvmZcb [url=http://nba45.webnode.cn]英超赛程[/url] YouGhe [url=http://yule11.webnode.cn]博彩网[/url] DnoNam [url=http://yule12.webnode.cn]TT娱乐城[/url] SrlCac [url=http://yule13.webnode.cn]博彩通[/url] AxnEyf [url=http://yule14.webnode.cn]百家乐[/url] AxnFso [url=http://yule15.webnode.cn]百家乐[/url]
[url=http://tt5252.com/]百家乐[/url]
[url=http://tt2929.com/]全讯网[/url]
ZpvLqj [url=http://yule161.webnode.cn]博彩通[/url] DtyQmo [url=http://yule171.webnode.cn]88娱乐城[/url] EuuGmz [url=http://yule181.webnode.cn]博彩通[/url] ZvwSko [url=http://yule19.webnode.cn]太阳城[/url] DngGde [url=http://yule20.webnode.cn]博彩通[/url] LzfWrp [url=http://yule21.webnode.cn]全讯网[/url] IppLsd [url=http://yule22.webnode.cn/]全讯网[/url] HjyIht [url=http://yule23.webnode.cn]太阳城[/url] BbtKpy [url=http://yule24.webnode.cn]全讯网新2[/url] EvuJcd [url=http://yule25.webnode.cn]全讯网新2[/url]
Post a Comment