జైశ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
పసిపిల్లలు కడుపులో ఉండగా వారితో మాట్లాడటం సాధ్యమేనా? వారికి మన మాటలు అర్ధమవుతాయా? మన మాటలకి రెస్పాన్స్ ఇవ్వగలరా? ఇవ్వగలరని ప్రహ్లాదుడు, అభిమన్యుడూ రుజువు చేసారు. కానీ ఇప్పుడు ఎవరైనా ప్రయత్నం చేసారా? చేసి ఫలితం సాధించారా?
కడుపులో ఉన్న బిడ్డ గురించి, వారిని భగవంతుడు కాపాడే విధానం గురించి నాకు తెలిసిన రెండు కుటుంబాలు తెలిపిన విషయాలు చెప్తాను.
౧)
శివపార్వతులవలె ఎప్పుడూ కలిసి ఉండే జంట. సరే శివపార్వతులన్నాను కాబట్టి ఆ పేర్లతోనే వ్యవహరిస్తాను. ఆ పార్వతీదేవికి భగవంతుడంటే అపారమైన నమ్మకం. ఆ నమ్మకంతోనే జీవితంలో ఎన్ని ఆటుపోట్లెదురైనా వెనక్కి తగ్గలేదు, భగవంతుడి మీద నమ్మకాన్ని కోల్పోలేదు. ఆవిడ కడుపుతో ఉన్నప్పుడు ఇంట్లో రేషన్ బియ్యం తప్ప మరేమీ లేని పరిస్థితి. అయినా ఆతల్లి అధైర్యపడలేదు. రోజులో చాలాసేపు కడుపులో ఉండే బిడ్డతో మాట్లాడుతూ ఉండేది. సహజంగానే పసిపిల్లలు తల్లి గొంతును త్వరగా గుర్తు పట్టడం అలవాటు చేసుకుంటారు. కానీ అది నిదానంగా అలవాటు అవుతుంది. పుట్టిన తర్వాత క్షణం నుండే ఈ పాప తల్లి గొంతుని ఎంత బాగా గుర్తుపెట్టుకుందంటే , ఆవిడ ఎక్కడో వంటగదిలో పనిచేసుకుంటూ పిల్ల ఉయ్యాలలో నిద్రలేచి ఏడుస్తుంటే "కన్నా వచ్చేస్తున్నానమ్మా ఒక్క క్షణం ఉండమ్మా" అని అరిస్తే గమ్మున ఉండేదట. ఆవిడ వచ్చేదాకా మళ్ళి ఏడిచేది కాదట. చెప్తున్నప్పుడు వింటుంటే నాకైతే కలియుగంలో నుండి కృతయుగంలోకి వెళ్ళినట్టనిపించింది. కడుపుతో ఉన్నప్పుడు అడ్డమైనవన్నీ చూడద్దని పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని అడ్డంగా ప్రశించేవాళ్ళు ఈ విషయం వింటే ఏ గంగలో దూకి తమ పాపాలని ప్రక్షాళన చేసుకోవాలో అనిపించింది. చాలామంది వితండవాదం చేస్తుంటారు ఈ విషయంలో. కడుపులో పిల్లలకి ఎలా అర్ధం అవుతుంది. బాషని ఎలా డీకోడ్ చేస్తారు. నువ్వు తెలుగులో చెప్తే ఇంకొకళ్ళు హిందీలో చెప్తారు అప్పుడెలా అంటూ. వీటికి సమాధానం చెప్పాలి అనుకోవడం అనవసరం. వేమన గారే చెప్పారు "చేరి మూర్ఖుల మనసు రంజింప రాదయా" వాళ్ళనొదిలేస్తే నావరకైతే నేను నమ్మిన సనాతన ధర్మం చెప్పిన విషయానికి ఇది నిలువెత్తు నిదర్శనంలా కనపడింది. ఏమంటారు?
౨)
ఆయన అమ్మవారి భక్తుడు. భార్యకి నెలలు నిండినప్పుడు ఆమె చెయ్యి చూస్తే ప్రాణగండం ఉంది. ఇంకో రెండురోజుల్లో ప్రసవం. ఆయన ఏమి చెయ్యడం పాలుపోక రెండురోజులు నిరంతరం హనుమాన్ చాలిసా,దండకం పారాయణ చేస్తూనే ఉన్నారు. చేతిలో కనపడుతున్న గండం జీవితంలో కి రాకుండా ఆస్వామి అడ్డం పడ్డాడు. ఏ గండం లేకుండా తల్లీపిల్లలిద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు ఆపిల్లవాడు ఉన్నతవిద్యనభ్యసిస్తున్నాడు. ఇంతకంటే సాక్ష్యాలేమి కావాలి చెప్పండి. నమ్ముకున్నవారిని ఆస్వామి కాపాడతాడని చెప్పడానికి.
శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష.....
విధేయుడు,
మనోహర్ చెనికల
-------------------------------------------------------------
శ్రీ మనోహర్ గారు,
ప్రతి ఒక్కరు చదవి తెలుసుకోవలసిన చక్కని సజీవ ఉదాహరణ. భగవానుడు ఉన్నాడు అని
చెప్పవలసిన అవసరం యుగ యుగాలుగా వస్తూనేవుంది. ఆ భగవంతుడు, ఆయా పరిస్తితులను
బట్టి కారణ జన్ములను ఈ భూమి పైకి పంపుతూనే ఉన్నాడు.
మన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర శర్మ గారు మనకు ఉండవలసిన పూనికను,
అనేకానేక ఉదాహరణలతో పదే పదే మనకు బోధిస్తూనే ఉంటారు.
ఉన్నాడయా దేవుడున్నదయా
కన్నులకు కనిపించకున్నడయా
తెర చాటు తానుండి తెర ముందు ప్రజనుంచి
తైతక్క లాడించు చున్నాడయా
జై సాయిరాం
------------------------------------------------------------------------------
మనోహర్ గారు,
దృష్టాంతం బాగుందండీ, మంచి విషయం చెప్పారు. ఎన్ని విషయాలు చెప్పినా మారని
వారు కొందరుంటారు, ఏం చేయగలం వారూ మారాలని దణ్ణం పెట్టుకోవడం తప్ప.
గురువుగారు చెప్పినట్టు గోడ గుల్లగా ఉంటే కదా మేకు దిగేది! అదే గట్టి
భీమ్ (ఇనుప దూలం వంటిది) ఐతే మేకే వంగుతుంది.

ఆ కుటుంబాలు దైవానుగ్రహం పొందినట్టే, మనమూ (ప్రతి ఒక్కరమూ) ఎప్పుడూ
దైవానుగ్రహానికి పాత్రులమవుతూనే ఉంటాం, మనం పాపం చేసినా మనని
ఉద్దరించడానికి దేవుడు ఎన్నో దార్లు చూపెడుతూనే ఉంటాడు చివరిదాకా. కాని
దానిని గుర్తించడంలో వైక్లవ్యం చెంది మనకేంచేశాడు దేవుడంటాం.

చదరంగం ఆడిస్తున్న తండ్రి పిల్లలు సరిగ్గా ఆడట్లేదని, వారు గెలవాలని
తాపత్రయపడి తానే కావాలని ఓడినట్లు, దేవుడు ఎప్పుడూ మనకి దారి చూపడానికే
ప్రయత్నిస్తాడు, ఒకరో ఇద్దరో గుర్తిస్తారు, మిగిలిన నాలాంటి వాళ్ళు ఇంకా
దైవానుగ్రహంకలగలేదని, దైవ విరుద్దవాదనలు చేస్తుంటాం. నమ్మగలిగితే తీసే
ప్రతి శ్వాసలోనూ భగవదనుగ్రహం ఉంది వదిలే ప్రతి శ్వాసలోనూ భగవదనుగ్రహం
ఉంది. క్షణ క్షణం ప్రతి క్షణం భగవత్ప్రసాదం ఈ జీవితం అన్న సత్యం నాలో
ఎప్పుడూ జీర్ణమవుతుందా అని ఎదురు చూపు... nagendrakumar

------------------------------------------------------------------
నమస్కారము శ్రీ మనోహర్ గారు,
చాలా మంచి విషయం తెలియజేసారు. ధన్యవాదములు.

సంతానం మంచిగా ఉండాలన్నా, దేవుని యందు భక్తి కలగాలన్నా, ఎటువంటి మంచి లక్షణములు వాళ్ళలో చూడాలన్న, దానికి బీజం, అమ్మ గర్భములో ఉన్నప్పుడు, ఆ గర్భ వాసం చేస్తున్న పిల్లవాని యొక్క అమ్మ, నాన్నల సాధన మీదే ఆధారపడి ఉంటుంది. మనోహర్ గారు చెప్పినట్లుగా, ఆ సమయంలో ప్రత్యేకంగా అమ్మ- ఏమి తింటోంది, ఏమి మాట్లాడుతోంది, లోపల ఉన్న చంటివాడితో ఏమి చెప్తోంది, ఏమి వింటోంది.....మొదలగు అన్ని విషయములపైన వాడి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది- అనేది ముమ్మాటికీ సత్యం. ఈ విషయము గురించే, మన పూజ్య గురువులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, ఈ మధ్యనే ఒక ప్రవచనములో చెప్పారు, "ఒక స్త్రీ కడుపుతో ఉండగా, ఏ సమయంలో అమ్మ క్లేశము/బాధ/వ్యధ కి గురి అవుతుందో, ఉదాహరణకి ఆమె గర్భం దాల్చిన మూడవ నెలలో విపరీతమైన బాధకి గురి అయిందనుకోండి, ఆ పిల్లవానికి 20-30 సంవత్సరాల వయసులో కష్టాలు వస్తాయి" అని చెప్పారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కాని, సత్యం.

ఇటువంటి కలిప్రభావిత సమయంలో కూడా, మనల్ని సన్మార్గములో, ధర్మాచరణలో పెట్టడానికి, మన పూజ్య గురువుల వంటి మహా పురుషులు మనకి లభ్యం కావడం, ఎన్నో జన్మల పుణ్య ఫలము.

అటువంటి గురువుల మాటలు వింటూ, అమ్మ చెప్పే తీయని మంచి విషయాలు (మహాత్ముల చరిత్రలు) వింటూ, అమ్మ వినే మంచి కీర్తనలు వింటూ, అమ్మ, నాన్న చేసే పూజలు, స్తోత్రములూ వింటూ, అమ్మ తినే మంచి పళ్ళు తింటూ, చక్కని వైదిక వాతావరణములో "గర్భాలయ" వాసం చేసే పిల్లల అదృష్టమే అదృష్టం......

శ్రీ సీతారామచంద్ర ప్రభువు కి జై....

mOhan kishore

---------------------------------------------------------------------------
i am just reminding the importance of reading, skandothpathy during first trimester and bhagaavatham dasama skandham later pregnancy ,on the child, hope this matter is conveyed to all pregnant mother you come across let this world be filled with muruga andkrishnaas
rajanikanth

--------------------------------------------------------------------
Sat sangh sabhyula ka Namaskaram,
The best examples of Mother's influence on child are
the Great persons , like
1. Chatrapathi Sivaji.
2. Mahatma gandhi ji.

----------------------------------------------------------------------
ఇది నిజమే. ప్రఖ్యాత సినీనటుడు సాయికుమార్ తాను తల్లిగర్భంలో ఉన్నప్పుడు
తన తల్లిదండ్రులు మాట్లాడుకున్న మాటలు విన్నానని చెప్పారు. అందఱికీ
ఇలాంటివి అనుభవమవుతూనే ఉండొచ్చు. చిన్నప్పుడు ఆ జ్ఞాపకాలతో ఏం
చేసుకోవాలో, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక వదిలేస్తారు. పెద్దయ్యాక
మర్చిపోతారు. గర్భస్థ శిశువులు ఏ భాషనైనా అర్థం చేశుకోగలరు. వారు
ఆస్థితిలో ఆత్మస్వరూపులై ఉంటారు. ఆత్మకు అన్ని భాషలూ అర్థమవుతాయి. ఒకసారి
గర్భం నుంచి బయటపడి స్నానమ్ చేశాక ఆత్మలక్షణాలు మఱుగున పడి మానవ లక్షణాలు
తన్నుకొస్తాయి.

మా అమ్మగారి కడుపులో నేనున్నప్పుడు జఱిగినవేవీ నాకు గుర్తులేవు. కానీ
నవజాత శిశువుగా ఉన్నప్పుడు జఱిగినవి కొన్ని గుర్తున్నాయి. ఆవిడ నన్ను
ఒళ్ళో పడుకోబెట్టుకుని భోంచేసేవారు. ఆ రోజుల్లో జనం నేల మీద కూర్చుని భోం
చేసేవారు. ముద్దకోసం ఆవిడ నా మీదుగా వంగినప్పుడల్లా ఆ కదలికలకి నాకు
ప్రాణం పోయినంత పనయ్యేది. "ఈవిడ భోజనం ఎప్పుడవుతుందిరా బాబూ !"
అనిపించేది. tadepalli

0 comments: