పూజ్యులు అయిన దుర్గేశ్వర గారు


ప్రణామములు. ఈ రోజు తో నాది ౪౦ రోజుల దీక్ష పూర్తీ అవుతున్నది అండి. ఈ రోజు జరిగిన విశేషము మీతో పంచుకోవాలి అనిపించింది. స్వామి వారి ప్రేమ, అనుగ్రహం ఎలా కురుస్తుందో! ఈ రోజు చాల సంతోషం గా అనిపించింది. ౧౧ సార్లు హనుమాన్ చలిస పూర్తి చేసి బయటకి వచాను పూజ గది నుంచి. అప్పుడే బెల్ రింగ్ అయింది. కోరిఎర్ ఆటను ఒక కవర్ ఇచి వెళ్ళాడు. నేనే తీసుకున్నాను నా చేతితో. వెంటనే తెరిచి చూసాను. పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటో, ఆయన సింధూరం వచాయి పోస్ట్ లో. మా వారు అందరి పేరు మీద ఇక్కడా తిరువళ్ళురు గ్రామం లో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి కడుతున్నారు. దానికి మా వారు కొంచం సాయపడ్డారు. అందుకని వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటో , సింధూరం మరియు ఆహ్వానం పంపారు. నాకు చాల ఆనందం వేసింది. కరెక్ట్ గా ఈ రోజే మాకు చేరింది నేను పూర్తీ చేస్తున్న రోజు. స్వామి వారు గమనిస్తున్నారు మరియు నా పూజ స్వీకరిస్తున్నారు అని పరమ ఆనందం వేసింది. ఆయనకీ పడే పడే నా సంతోషం తెలుపుకున్నాను. నేను తెలిసో తెలియకో తప్పులు చేసిన మన్నించి నన్ను స్వీకరించవ తండ్రి అని.. మీ అందరి లాగా నేను పూర్తిగా ప్రదక్షిణాలు లాంటివి చేయలేకపోయాను. అయినా ఆయన కన్న తండ్రి తల్లి లాగా మన్నించి అనుగ్రహించారు.

ఇది మీ వల్లే జరిగింది అండి. మీకు ఎంతొ కృతఙ్ఞతలు. ప్రతి వర్షము స్వామి వారి కి పూజ నా చేతనైనట్లు చేసేటట్లు అనుగ్రహించమని స్వామి వారిని ప్రార్ధిస్తున్నాను.


వినయముతో
శశిరేఖ.

0 comments: