మద్రాస్ అపోలో ఆసుపత్రిపాలైన లక్కాకుల కృష్ణయ్య కుమారుడు శ్రీనివాసుల పైన వెంకయ్య స్వామి చూపించిన తమ దివ్య కరుణను గూర్చి వివరిస్తున్నారు.
16.10.1987 శ్రీనివాసులవయస్సు 15 సం,లు. ఆక్షనం వరకు సరదాగానే ఉండి చపాతీలు తిని తలనొప్పని చెప్పి వెంటనే కక్కుకున్నాడు . ఫిట్స్ వచ్చాయి.మాఊరు కల్లూరులో కలువాయి నర్సింగ్ హోమ్ లో మందులు వాడాము. నయంకాలేదు. నెల్లూరిలోని పిల్లల డాక్టర్ రామక్రిష్ణా రెడ్డి గారి దగ్గరకు ఉదయాన్నే తీసుకెల్లాము. మూడురోజులనంతరం ,ఆయన సలహా మేరకు మద్రాస్ అపోలో హాస్పటల్ లో చేర్చాము. స్కానింగ్,ఆంజియోగ్రామ్ వగైరా తీశారు. పిల్లవానికి బేదులవుతున్నాయి .వెంటనే ఆపరేషన్ చేయాలి. చాలా ఖర్చవుతుంది భరించగలరా అని అడిగారు. ఎన్.జి.ఓ.లముగనుక ఒక విధమైన ఖర్చయితే భరించగలమని చెప్పాము. అయిఏ వారేమనుకున్నారో ఎమో మాకేమీ చెప్పకుండా జనరల్ హాస్పటలుకు పంపుతూ డిస్చార్జ్ చేశారు. అయితే అక్కడకెళ్ళినా ఆవాతావరణం నచ్చక ఆరోజే కారులో నెల్లూరు తీసుకొచ్చాము .ప్రభాకర్ నాయుడు గారు ,రాధమ్మగారు చూచి అంత ప్రమాదస్థితిలో పిల్లవాణ్ని ఎలా తీసుకొచ్చారు ? వెంటనే హైదరాబాద్ గాని విశాఖపట్టణంగాని తీసుకుపొమ్మని చెప్పారు. రెండురోజులు రెస్ట్ ఇచ్చి మరలాచేసేది లేక మద్రాస్ అపోలో కే వెళ్లి చేర్చాము. వాల్లు తిరిగి స్కానింగ్ లు పరీక్షలన్నీ చేసినా వ్యాధినిర్ధారించలేక
పోయినా పదివేలు ఖర్చయింది . డాక్టర్ గారు మెదడుకు ఆపరేషన్ చేయాలని నలభై వేలదాకా అవుతుందని చివరకు చెప్పారు. డెబ్బై వేలైనా మందులతో తగ్గుతుందేమో నని ఆవిధంగా చేయమని అడిగాను. వ్యాధిపూర్తిగా నివారణ కాలేదు. చికిత్స జరుగుతున్నది.

పిల్లవానికి స్వప్నంలో వాల్ల తాతగారు కనిపించి నీకు బాగుంది ఇంటికెల్లు అని చెప్పారు. కాని పిల్లవానికి ఇంకా తగ్గలేదు . ఏదోలే కల అనుకున్నాము. మరుసటిరోజు నాకు కలలో ఒక ముసలాయన కలలో కనిపించి "పిల్లవానికి బాగుండ్లాయ్యా" అని అన్నారు. పిల్లవాడు బలహీనంగా ఉన్నాడు. ఏదోలే ఈస్వప్నం కూడా ఏదో ఆలాపన లే అనుకున్నాను. మరుసటిరోజు కూడా కల వచ్చింది. కాఈ ఈసారి సుమారు పదిసంవత్సరాలక్రితం దాచూరులో నేను వెంకయ్యస్వామి వారిని దర్శించుకున్న రూపంలో దర్శనమిచ్చి "పిల్లవానికి బాగుంది .ఇక్కడుండొద్దు.ఇంటికిపొండి . నేను పడమట బద్వేల్ లో ఉన్నాను , పిల్లవాణ్ణి అక్కడకు తీసుకురాయ్యా " అని చెప్పి వెల్లాడు. తెల్లవారి డాక్టర్లందరూ మీటింగ్ పెట్టుకుని పిల్లవానికి ఏవ్యాధిలేదు నయమైనది .తీసుకెల్లండి అని డిస్చార్జ్ చేశారు.

డిసంబర్ 87 మరియు88 లో చెకప్ చేశాను . స్వామి వారి దయవలన పదవతరగతి కూడా పాసయాడు ఏ అనారోగ్యసమస్యలు కూడాలేవు. మద్రాసు నుంచి వచ్చిన పదవరోజున స్వామి వారి ఆజ్ఞానుసారం వారు తపస్సుచేసిన స్థానమైన పెన్న బద్వేలు తిప్పపైన నిద్రచేయించాము .
ఈ కష్టకాలం లో నేను శ్రీ స్వామివారిని గాని మరే దేవతలనుగానీ ప్రార్ధించలేదు. నాధ్యాసంతా డాక్టర్లమీదే ఉండేది. పరమ కారుణ్య మూర్తి అయిన స్వామివారు నేనెప్పుడో పూర్వం వారికిచ్చిన భిక్షను తీసుకుని ఆ రుణానుబంధాన్ని మరచిపోకుండా మేము వారిని మరచిపోయిన సమయంలో కూడా మమ్ము కాపాడారు. " మీరు నన్ను వదిలినా నేను మిమ్మలను వదలనయ్యా" అని స్వామివారిచ్చిన అభయం సమాధి అనంతరం కూడా అక్షరాలా నెరవేరుస్తున్నారు. "సూర్యచంద్రులున్నంతవరకూ ఉండేదే కదయ్యా అని స్వామి వారిచ్చిన అభయం సత్యదూరమెలా అవుతుంది ?

________________లక్కాకుల కృష్ణయ్య .ఫార్మాసిస్టు ... కుల్లూరు.

1 comments:

Unknown said...

durgeswara గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.