సుమారు నెలరోజుల క్రితం అనుకుంటా, గ్రూప్ లో భాగవతం ఎక్కడ దొరుకుతుంది
అంటూ అడగడం జరిగింది. సహృదయతతో చాలామంది స్పందించారు. టి.టి.డి ఆఫీస్ లో
దొరుకుతుంది అంటూ సమాచారం అందించారు. దేవుడి దయ వలన కార్తీక మాసం
మొట్టమొదటి రోజున (పాడ్యమి) ఆ భగవంతుడు, సకల వేదార్ధ స్వరూపమైన
భాగవతాన్ని నాకు అందించారు. ఈ పుస్తకం నా చేతికి రావడానికి ఈ గ్రూప్ ఒక
ముఖ్య కారణం. అందుకే మీతో ఒక విషయం పంచుకుందామని ఇది రాస్తున్నాను.మొన్న
ఆదివారం వెల్దామా వద్దా అనుకుంటూ సడెన్ గా అప్పటికప్పుడు అనుకుని
లింగంపల్లి నుండి హిమాయత్ నగర్ టి.టి.డి ఆఫీస్ కి వెల్లాను. అక్కడకి
వెళ్ళేదాక సందేహం. దొరుకుతుందో లేదో, పూణే నుండి ఇంత దూరం వచ్చాను, తీరా
దొరక్కపోతే నిరాశతో వెనక్కి వెళ్ళాల్సి వస్తుందేమో అనుకుంటూ లోపలికి
వెళ్ళాను.అక్కడ చూస్తే కట్టలు కట్టలు భాగవతం సెట్లు ఉన్నాయి. నా మనస్సు
ఆనందం తో గంతులు వేసింది.అడిగాను , ఆయన అన్నాడు కదా, "బాబూ ఈ రోజు
అమావాస్య కదా రేపు వచ్చి తీసుకోండి, కేవలం ఈ పుస్తకం కోసం పూణే నుండి
వచ్చానంటున్నారు కదా, పోయి పోయి అమావాస్య రోజు ఎందుకు, ఇంతకు ముందే
ఇద్దరు వచ్చి తీసుకుందామనుకుని మళ్ళీ అమావాస్య అని గుర్తు తెచ్చుకుని
రేపు వస్తామని వెళ్ళిపోయారు, తర్వాత మీ ఇష్టం" అన్నారు. నాకు అది ఆ
భగవంతుడి సలహా లా అనిపించింది.చిన్నప్టినుండి షాడో పుస్తకాలూ, యండమూరి
పుస్తకాలూ చదివీ, చదివీ ఇప్పుడు నా గురించి చదవడం మొదలుపెడుతున్నాడు,
అలాంటిది అమావాస్య రోజు ఎందుకు,పవిత్ర కార్తీక మాసంలో ఆ పుస్తకాన్ని నాకు
అందిద్దాం అని ఆ రామ చంద్ర మూర్తీ ,రామదూత అనుకున్నారేమో అనిపించింది.
ఇంతకీ ఆ వచ్చిన వాళ్ళు ఇద్దరూ ఎవ్వరు?
ఆ రామభద్రుడు, రామదూతేనా , లేక నా అజ్ఞానమా ? ఏమో, ఆయనకే తెలియాలి.
కానీ ఒక విషయం చెప్పాలి. నిజంగా మనం ప్రయత్నించాలి అనుకుంటే ఆ భగవంతుడే
దారి చూపిస్తాడని మాత్రం అర్ధం అయ్యింది....
మనోహర్ చెనికల
1 comments:
అయ్యా
మంచి పని చెయ్యదానికి (ఉదాహరణకి భాగవతం చదవడానికి) అమావస్యకి లంకె ఎందుకు? మంచి ఉద్దేశ్యం తో అంత దాక వెళ్ళి భాగవతాన్ని కైవసం చేసుకుని రావలసినది! దైవ ప్రెరణతో వెళ్ళాలనుకుని వెళ్ళి ఒక్క రోజు వ్రుధా చేసుకొవడం ఎందుకు? ఆలోచించి చూడండి. మీ అభిప్రాయం తప్పు అనడం లేదు. భక్తి కి మూఢ భక్తి కి వ్యత్యసాం ఉన్నది !
చీర్స్
జిలెబి.
Post a Comment