నేను ,నా భార్య శ్రీమతి లక్ష్మీదేవి ,నా కుమార్తె చందన కలిసి షిర్డీ వెళ్ళటానికి నిశ్చయించుకున్నాము . ఎప్పుడు వెళ్ళాలనేది బాబా గారిని చీటిల ద్వార తేదీలు వేసుకొని బాబాగారిని పర్మిషన్ అడిగాం. మా కుమార్తె అమెరికా నుండి
రావటం వల్ల , తన ప్రోగ్రాం ప్రకారం మళ్ళీ తిరిగి వెళ్ళాలి కనుక త్వరలో షిర్డీ వెళ్ళాలని నిర్ణయించు కున్నాం . బాబా గారు మమ్మల్ని జనవరి రెండు, రెండు వేల మూడు , గురువారం రోజున రమ్మనమని పిలుపు నిచ్చారు.

నేనువెంటనే మన్మాడ్ ఎక్స్ ప్రెస్ మూడవ ఐర్కాందిషనేడ్ లో బుక్ చేసుకొని .ఆ రోజు అమావాస్య.ఆయినాబాబా గారు పర్మిషన్ అయింది కనుక మేము బయల్దేరాము. సికింద్రాబాద్ స్టేషన్ లో మన్మాడ్ ఎక్సప్రెస్ సరిగా ఆరుగంటలకు బయల్దేరింది.కంపార్ట్మెంట్ నిండా ప్రయాణీకులు ఉన్నారు .ఆందరూ బాబా గారి ని ప్రార్ధిస్తూ ఉన్నారు. ఆందరూ
డిన్నర్ పూర్తి చేసుకొని పనుకున్నారు సరిగ్గా పది గంటలకు .రైలు చాల వేగంగా వెళ్తోంది .అందరూ మంచి నిద్ర లో ఉన్నారు.సరిగ్గా రాత్రి ఒంటి గంటకు పెద్ద శబ్దం అయింది .ఆ శబ్ధం ఈ రోజుకు గూడ మా చెవుల్లో వినపడుతోంది .
అంత పెద్ద శబ్ధం వల్ల నిద్రించుచున్న వారు ఒక్క సారి పిల్లా పాపల తో ఉలిక్కిపడి లేచేసరికిహాహా కారాలుతో కంపార్ట్మెంట్ మారుమ్రోగి పోయింది .నేను sidebirth upper లో ,నా భార్య క్రింద బర్త్ లో , నా కుమార్తె మిడిల్ బర్త్ లో ఉన్నాము.ac కోచ్
ఒక్కసారిగా నా బర్త్ సైడ్ ది బాగా క్రిందకు పడిపోయింది.నా భార్య బెర్త్ కంపార్ట్మెంట్ అడుక్కు వెళ్లి పోయింది.నా కుమార్తెమిడిల్ బె ర్త్ v ఆకారం లో అయింది. ఈ పొసిషన్స్ అన్ని next డే చూసాము. కంపార్ట్మెంట్ లో కరెంటు పోయింది.
కటిక చీకటి.జరిగినది యేమిటంటే మా రైలు ఆగిఉన్న గూడ్స్ రైల్ ని గుద్ది వేసింది.100 మైల్స్ స్పీడ్లో వెళుతున్న మా ట్రైన్- గూడ్స్ ట్రైన్ ని గుద్దటం వల్ల ,గూడ్స్ కంపార్ట్మెంట్ పైకి మా కంపార్ట్మెంట్ ఎక్కింది. అసలేకంపార్ట్మెంట్ ఎత్తు దాదాపు 18 అడుగులు దాని పైన మా కంపార్ట్మెంట్ ఎక్కింది .మేము దాదాపు 30 నుంచి 35 అడుగులు ఎత్తులో ఉన్నామన్న మాట.బయటకు ఎలా రావాలి ? అసలు మా పరిస్థితి ఎమిటో మాకు తెలియదు.
కాని చాలా మందికి మాత్రం భయంకరమైన దెబ్బలు తగిలి ఉంటాయని అనుకున్నా.నా భార్య ,కుమార్తె లను ఎలాఉన్నారని గట్టిగ అరిచా .నా భార్య గొంతు చాలా హీన స్వరం లో వినిపించింది.నా కుమార్తె మాత్రం , డాడీ కంగారుపడకండి అంటోంది.మొత్తం కంపార్ట్మెంట్ లో 60 నుంచి 80 వరకు ప్రయాణీకులు ఉంటారు.మాకు మాత్రం ఒక 10 మంది గొంతులు వినిపిస్తున్నాయి. రక్షించండి - రక్షించండి -కాపాడండి -అని కేకలు వేశాము . ఎవరు వింటారు.సడన్ గా
జరిగింది.చీకటిలో ఉన్నాము.అమావాస్య రాత్రి.ఒక సెక్యూరిటీ గాని లేరు.నేను బాబా బాబా అని అరుస్తున్నా .కాపాడుసాయిబాబా అని గట్టిగా కేకలు వేస్తున్నా.ఎవరు వింటారు ?ఆందరూ ఏడుపులు .చంటి పిల్లలు తో ఉన్న తల్లులు.
ఎలా బయట పడాలి? చీకటి లో ఏమి తెలియటల్లేదు ?సరిగ్గా ఒక 40 మినిట్స్ తర్వాత ఎవరో చీకట్లో sideupperబర్త్ నుంచి నా పక్కకు వచ్చి నా భార్యను చేయి అందివ్వమన్నారు. పైకి లాగటానికి.తను కనీసం 55 kgs ఉంటుంది.
నా భార్య ఎవరు అంటోంది .నేను ముందు చెయ్యి ఇవ్వు అన్నా. ఆ మనిషి చీకటిలో జాగ్రత్త గా నా భార్య ను , అలాగేనా కుమార్తె ను, నన్ను పై నుంచి క్రిందకు దింపారు. అనంత చీకటి లో మమ్మల్ని దింపిన వ్యక్తి ఎవరు ? దాదాపు౩౦ అడుగులు ఎత్తు నుంచి సుమారు 60 kgs ఉన్న మమ్మల్ని క్రింద నుంచి పైకి లాగి, మల్లి పైనుంచి నేల మీదికిచంటి బిడ్డల్లా దింపటం ఎవరకు వీలవుతుంది !.ఏదో సూపర్ పవర్ తప్పకుండ మమ్మల్ని రక్షించింది.కిందకు దింపి
ఒక రగ్గు ఇచ్చారు అయన. జనవరి నెల కదా. చలి బాగా ఉంది.అలా తెల్లవార్లూ అంటే రాత్రి 1 గంట నుండి అలా కూర్చుని వున్నాం.ఉదయం చూస్తే , యెంత భయానకం గా ఉందో !మా ముందు కంపార్ట్మెంట్ జనరల్ ది .అది కూడా
గూడ్స్ కంపార్ట్మెంట్ మీదకు ఎక్కింది.అందులో ఉన్న వారు ఆందరూ చని పోయారు. ఇంక మా కంపార్ట్మెంట్ లోమొత్తం 80 మంది లో మాకు తెలిసి తెలిసి 8 మంది మాత్రం బ్రతికి భయట పడ్డాము.చాల మంది కి దెబ్బలు ,చంటిపిల్లలు తల్లి దగ్గర పలు త్రాగుతూ అలాగే తల్లి పిల్ల మరనించటం మా అందర్నీ కలిచి వేసింది .ఎంతగా ఎడ్చామో.
ఎందుకు దైవం ఇంత భయంకరమైన మరణం ఇచ్చాడు .అసలు దైవ కృపకు ఆందరూ బయల్దేరారు.చాలా మందికిఇలాంటి మరణం న్యాయమా?.నాలో నేను చాలా భాధ పడుతున్నా. ఈ రోజు కూడా.కాని అదే దైవం మమ్మల్ని చిన్నదెబ్బ కూడా తగలకుండా కాపాడి క్షేమం గా షిర్డీ కి రప్పించుకున్నాడు. మేము బాబా గారిని సదా ప్రార్దిస్తున్నా.
అందర్నీ రక్షించు తండ్రీ. నీ దగ్గరకు వఛే భక్తులను సర్వదా కాపాడు తండ్రీ. మమ్మల్ని సాయి ఎప్పుడూ మా వెంటఉంటారని భావిస్తున్నాం.
బాబా గారి తో నాకు చాలా అనుబంధం ఉంది అనుకుంటున్నా. చాలా అనుభవాలు.పూర్వ జన్మ అనుబంధం ఏమో.
ఆయన గురువు, సద్గురువు,రాజ రిషి ,యోగిరాజు,సచ్చిదానందుడు , బ్రహ్మాండం అంతటా ఉన్నవాడు,ఎల్లప్పుడుచిరునవ్వుతో ఉండేవాడు ,నిరాడంబరుడు. అందరకు తండ్రీ .అలాటి బాబా కు సాష్టాంగ నమస్కారము ల తో.
భక్త పరమాణువు,
తిలక్ పండ్రంగి.,
మరియు కుటుంబం
హైదరాబాద్.

4 comments:

రాత said...

ఏమిటి సార్ మీరు మరీను
అంటే దేవుడు మేకు మాత్రమే ఫ్రెండ్ అని మిగతా వాళ్ళకి కాదు అనేగా మీ ఆర్ధం .మీరు దైవ కృప కలిగిన దేవుని స్నేహితులు . మిగతా వారు మీ స్నేహితుడికి కి పూజ చేయనందున, దేవుణ్ణి స్నేహితుని గా పొందలేని దురదృష్టవంతులు
ఏమి చెప్పారు సర్
ఆంత మందిని పొట్టన పెట్టుకున్న మీ దేవుడు నిజం గా గ్రేట్ సర్ .
ఏందుకంటే కృప లేక ఏమి జరగదు కదా ?

durgeswara said...

mitramaa

mee letter ku tilak gaaru samaadhaanam pampaaru choodamdi



my dear sir,

nenu vrasina daivaleela lo meeru poorthiga avagahana chesukoledu yemo anukuntunna.

baba daggaraku velli , ayana blessings teesukundamani vellinavariki akala maranam nyama!

ani raasanu. daivam drushtilo andaru samana mey kada.naa bhadha nu meeru ardham chesukovam ledu.alaati maranam yevaraki undakoodadu ani na bhavana.baba garu naku
mitrudu ani cheppaledu sir.bhaktudanu anna.akaala maranam anyayam ,bhadhakarm
antunna sir.ayana pilistey ney kada, andaru vellamu.memu okkalla may kadu kada.
ayana blessings andaraku kaavali sir.yenduku ila jarigindo ayanaku matramey teliyali.
manam ,manava matrulam.experiences share chesuko galamu ,alaage bhadhalanu kuda.
yedi yemaina, manam puttinappude , mana jeevitham vrayabadindi kada sir.ayina mana
life journey lo premalu,tentions, bhadhalu, kashtalu,nashtalu anni chustu untamu.
mana ending yela untundo teliyadu.unnantha varaku, andariki manaku unnamtalo
sayam cheyatam, aadukovatam. manava sevey madhava seva.
unta.....thanks for your comment.

mitrudu.......
tilak.

durgeswara said...

దైవ లీలలు అంత త్వరగా అందరికీ అర్ధం కావు. రాత గారూ మనం కొన్నింటిని అంటే మనకిష్టమైఅన వాటి పట్లే స్పందిస్తాము. కానీ అన్నింటిని సృస్ష్టించినవానికి అన్నింటిపైనా ప్రేమ వుంటుంది.ఈ నాటకరంగములో ఎప్పుడు ఏఘట్తము ఎందుకు జరుగుతుందో అంత తేలికగా అర్ధము కాదు. ఇంకా ప్రథమార్ధం లోనే వున్నవు కనుక యువకునిగా నీ ఆలోచన ఆవేదనతోనే నిండివుంది. కాలం ఆలోచనకు పదును పెడుతుంది అప్పుడు అన్నీ సహజంగా అవగాహన కొస్తాయి. ఇప్పుడు ఏమి చెప్పినఅ వాదన తప్ప వాస్తవం బోధపడదు. ఆవాస్తవాన్ని గ్రహిస్తున్న పెద్దలు తిలక్ గారిలాంటివారి అనుభవాలను ఆవేశముతో విమర్శించటం కాదు ,అంతరార్థమేమిటో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.ధన్యవాదములు.

Anonymous said...

రాత గారికి, పైన మీరు చేసిన వ్యాఖ్య..I am really surprised and curious to know what made you say so and which part of the post :)

I know different people perceive and understand differently by reading a post,but ఈ టపా లో మమ్మల్ని కాపడాడే దేవుడు, మరి అదే దేవుడు, అంత మంది ప్రాణాలు ఎందుకు తీసాడో అనే ఆవేదన కనిపించలేదా?

ఆ accident ఐనప్పుడు అప్పటిదాక కలిసి ఒకే బోగీ లొ ప్రయాణిస్తున్న వాళ్ళలో మేము మిగిలాము కొంత మంది ప్రాణాలు పోయాయి ..వారి dead-bodies చూసినప్పుడు ఎందుకు ఇలా జరిగింది,మనల్ని రక్షించిన దేవుడు వీరిని ఇలా ఎందుకు చేసాడు అని అనిపించకూడదంటారా? అందరూ ఆ దైవ దర్శనానికే వెళ్తున్నవాళ్ళమాయే మరి? మరి మేము బతికి ఉండటం దైవలీల కాదు అంటారా?

We just can't reason out certain things but when thought spiritually, may be న్యాయం అన్యాయం ఆ పోయిన వాళ్ళకి కాదేమో, వారి పాత్ర ఈ జన్మ కి అయిపోఇంది.బాధల్లా వారి కుటుంబానికి మాత్రమే ఏమో.

Some get a peaceful painless death and some depart in this way.

Well, God's miracles are just unfathomable.

-చందన