భక్త జనులకు ప్రణామములు.
భగవంతుని నమ్మినా నమ్మకున్నా ఆయన లీలలు నిత్యసత్యాలు అవి అలా జరుగుతూనే వుంటాయి సూర్యోదయ అస్తమయాలు లాగా. ఒకేసూర్యుడు వివిధ కుంభాలలో ఉన్న జలాలలో వాటి పరిమాణాన్ని బట్టి ఎలా ప్రతిఫలిస్తాడో అలా ఆయన లీలావినోదాలు సాగుతుంటాయి,అందరి జీవితాలలోనూ.ప్రతివారి జీవితంలోనూ ఎప్పుడో ఒకసారి తప్పనిసరిగా ఆలీలలను గమనించగల స్మృతి కలుగుతుంది. వాటిని గమనించాక ఒడలు పులకరించి మనసు దైవీభావంతో నిండి మన అడుగులు ఆయన వైపుగా సాగుతుంటాయి. అవి పదిమందికి తెలిసినప్పుడు తెలుసుకున్న వారందరికి మేలును చేకూరుస్తాయి. కనుకనే భక్తులు భగవంతుని లీలలను ఒకరితో ఒకరుచెప్పుకుని పరస్పరం శ్రేయస్సును పొందుతారు. దీనినే సత్సంగము అంటారు. సత్సంగము కలియుగములో లభించటం చాలామేలు చేస్తుంది. కలి మాయా ప్రభావాన్నుంచి తప్పించుకోవటానికి.
ఇన్ని విషయాలు మాట్లాడుకునే మనం భగవంతుని గుణగానాన్ని చేయటానికి కొంతసమయము వెచ్చించగలము కనుక లోక శేయస్సు ,అంతకంటే ముఖ్యంగా ఆత్మశ్రేయస్సు కలుగుతుందనే భావనతో ఈ బ్లాగ్ ప్రారంభిస్తున్నాను.ఈ సత్కార్యము జరగటానికి మీఅందరి సహకారము అభ్యర్ధిస్తున్నాను.
మీ జీవిత యానములో మీకు అనుభవములో కొచ్చిన ఆపరమాత్మ లీలలను వ్రాసి పంపండి. అవి దైవపరమయినవైనా ,సద్గురు పరంపరనుంచి వచ్చిన లీలలైనా. ఎవరి ఇష్ట దైవాన్నుంచి వచ్చిన అనుభూతులు ,అనుభవాలు వారు వ్రాసి పంపండి సనాతనమైన ఈ ధర్మమార్గానుయూయులందరు. అలాగే మీ కు తెలిసి మరెవరి జీవితములోనుండయినా ,ఏదయినా సద్ గ్రంథము నుండయినా ,మహాత్ముల రచనలనుండయినా .వాటిని మీ అనుభవాలుగా లేక మీరు పంపిన వాటిగా ఇందులో వుంచుదాము. అవి ఎందరో భక్తులకు సన్మార్గాన్ని చూపుతాయి. ఏమో ఎవరు చెప్పగలరు,భక్తపోతన సినిమా చూసి యోగిగా మారిన ముమ్మడివరం బాలయోగిలాంటి మహనీయులు సత్కథా ప్రయోజనాన్ని నిరూపించారు. ఎవరికేమోగాని నాకు మాత్రం అటువంటి భగవల్లీలలు వినటమ్ చదవటమ్ తప్పనిసరిగా ప్రయోజనమే. పదేపదే ప్రార్ధిస్తున్నాను. మీరుదయతలచి నాకు ఈ భగవత్ సేవలో చేయూతనివ్వాలని.
మీ వ్రాతలను durgeswara@gmail.com పంపండి. ఇక్కడ చూడండి. మీకు తెలిసినవారందరికీ ఈవిషయాన్ని చేరవేయగలరు.
భక్తజన పాదసేవలో ........దుర్గేశ్వర
Sunday, December 7, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
నూతన బ్లాగు ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు.
Post a Comment