నాపేరు అమృత .ఊరు గార్ల. ఖమ్మం జిల్లా . మానాన్నగారి పేరు వెంకటేశ్వరరావు. .ఉరిలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. మాతల్లిదండ్రులకు ఇద్దరం సంతానం అన్నయ్య ,నేను .నాకు 1999లో తీవ్రంగా జ్వరం వచ్చి రక్తం తగ్గిపోయింది. మనిషిని తెల్లగా పాలిపోయినట్లయ్యాను. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి ఇక్కడ తగ్గదు .వెంటనే హైదరాబాదు వెళ్లి పెద్దహాస్పటల్ లో చూపించుకోండి అన్నారు. మవాల్లు నిమ్స్ లో చేర్చారు. అక్కడ అన్నపరీక్షలు చేసి లుకేమియా అని తేల్చారు. డాక్టర్లు ట్రీట్ మెంట్ మొదలెట్టి,ప్రాణానికి హామీ ఇవ్వలేము అనిచెప్పారు. మా తల్లిద్ండ్రులు ఎంతో డబ్బు ఖర్చుపెట్టినా జబ్బునయం కాలేదు. దేవునుమీద భారం వేయమని చెప్పారు డాక్టర్లు. అలాంటి సమయం లో మా పెదనాన్నగారు డాక్టర్ శేషగిరిరావుగారు అంతకు ముందు నాలుగు సమ్వత్సరాలక్రితం సౌదీ వెళ్ళినవారు ఈసమయం లో ఇండియాకి వచ్చారు. రాగానే నాస్థితిచూసి ,గొలగమూడి వెంకయ్యస్వామివారి చరిత్రను ఇచ్చి స్వామివారి దారం చేతికి కట్టి పారాయణం చేయమని .ప్రతిరోజు విభూతి పెట్టి పారయణమ్ చెసి వినిపిస్తూ ఉండమని చెప్పారు మావాల్లకు.
మా అమ్మ, నాన్నమ్మ వీలైనన్నిసార్లు నాకు చైవి వినిపిస్తూ ఉన్నారు. మా పెదనన్న ఇంట్లో ,మా అత్తయ్య, మామేనత్తవాల్ల ఇంట్లోను అఖండ జ్యోతిని వెలిగించి ,మావాల్లంతా నాగురించి ప్రార్ధన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నాకు ట్రీట్మెంట్ జరుగుతున్నది.. నా దురదృష్టం కొద్దీ మందులవలన నాకు ఇన్ఫెక్షన్ వచ్చినదన్నారు.బ్రతికే అవకాశం లేదు అని తేల్చిచెప్పారు. మావాల్లు తీవ్ర దు:ఖం లో మునిగారు. స్వామి మీద భారం మోపారు.
ఒకరోజు మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయం లో ఒక ముసలాయన వచ్చి నా బెడ్ మీద కూర్చుని ఏమమ్మా! ఎందుకేడుస్తున్నావు ? నీకు నేను ఉన్నాగా ! నేను బాగుచేస్తాను.మరి తగ్గితేనాకేమిస్తావు ? అనిఅడిగారు.అంతకు ముందు స్వామి చరిత్ర వినిఉండటం వలనేమో అసంకల్పితంగా మీకు 150 ప్రదక్షిణాలు చేస్తాను అని చెప్పాను. వెంతనే ఆయన తనదగ్గరున్న తుంబురతో నాకాళ్లమీద రెండు దెబ్బలువేసి నీకుతగ్గింది ,అని ఆశీర్వదించారు. కల్లుతెరచి చూద్దునుకదా ఆయన లేరు. అప్పటినుండి నేను కోలుకోవటం మొదలైంది మరలా రక్తపరీక్ష చేసి ఎలాంటి ప్రాబ్లెం లేదు అని చెప్పారు. జబ్బు తగ్గటం ప్రారంభమై కొత్తనెత్తురు పట్టింది .తరువాత జబ్బుపూర్తిగా నయమయినది .ఇది దైవకృపకాక ఇంకేమిటి ?
నాకు తగ్గాక గొలగమూడి వెళ్లి స్వామి మహాసమాధికి ప్రదక్షనాలు చేసుకుని వచ్చాను .అలాగే స్వామిని కొలుస్తూ గొలగమూడి వెళ్లివస్తున్నాను .
_____________________ మాటేటి అమృత .
Wednesday, April 14, 2010
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
వెంకయ్య స్వామి అందరికి అర్థం అయ్యే బాషలో చెప్పేవారు.
Post a Comment