ఇక్కడికొచ్చి ఏదనుకుంటే అది అయ్యేదేకదయ్యా

భక్తా గ్రేసరులకు నమస్కారము
నాపేరు కొల్లిపర సాంబశివరావు.గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామము .1993 లో నేను వెన్నునొప్పితో విపరీతమైన బాధను అనుభవిస్తున్నాను. ఎంతోమంది డాక్టర్లకు చూపించి అనేక మందులు వాడాను .ఎందరో దేవుల్లను కన్నీటితో ప్రార్ధించాను నామొరనెవరూ ఆలకించలేదు. 1993 జూన్ మాసం లో కనికి చర్ల వెంకటేశ్వర్లు గారు తెనాలి లోవున్న వెంకయ్య స్వామి వారి భక్తులు బొందిగ నరసింహరావు గారి వద్దకు తీసుకు వెల్లారు.ఆయన శనివారం ధ్యానం లో కూర్చుని భక్తుల సందేహాలకు సమాధానాలు చెబుతూ వుండేవారు.మేము వెళ్ళీ నాబాధను చెప్పగనే గొలగమూడి వెళ్ళి నిదుర చేయమని సలహా నిచ్చినారు.

గొలగమూడి ఎక్కడున్నదో తెలియదు .ఎలా వెల్లాలో తెలియదు .అని అనుకుంటుండగా తెనాలి నుండి గొలగమూడి కి స్పెషల్ టూరిష్ట్ వెలుతుందని తెలిసి విచారించగా ఐదు సీట్లు ఖాలీగా వున్నాయని చెప్పారు. వెంటనే సీట్లన్నీ తీసుకున్నాను..అనుకున్నసమయానికి గొలగమూడి వెల్లి మహాసమాధికి ప్రదక్షిణాలు చేసాము.కుటీరం లో రక్షా దారములుస్వీకరించినాము.
అక్కడవున్న స్వామి వారి శిష్యులు గురవయ్యస్వామి వారికి సమస్యను విన్నవించినాము. ఆయన తగ్గుతుంది పోరా అన్నారు. రాత్రి స్వామి వారి గుడి ముందర ఉన్న ఇసుక తిన్నెల మీద నిదురించినాము.ఎప్పుడూ సరిగా నిదురింఛని నేను ఆరోజు ఒళ్ళుమరిచి నిదురపోయాను . అర్ధరాత్రి దాటిన తరువాత వెంకయ్య స్వామివారు నా వీపు నిమురుతున్నారు. ఎంతో అద్భుతమైన స్పర్శ .కలచెదిరింది మెలకువ వచ్చింది . నిజంగానే స్వామి వారి కరస్పర్శతో నాబాధ అదృశ్యమైనది .సంపూర్ణ విశ్వాసం తో ఇక్కడకొచ్చి ఏదనుకుంటే అదెయ్యేదేకదయ్యా అని చెప్పిన స్వామి వారి వాఖ్యము నిజమయినది.
తరువాత నా వ్యాపారము కూడా కలసి వచ్చినది .బాధ తగ్గటం తో ఉత్సాహంగా వ్యాపారం చేసుకుంటున్నాను. స్వామి వారి ఆరాధన ఉత్సవాలను మొదలు పెట్టి మొదట పదకొండు మండి సాధువులకు బిక్ష ఇచ్చి నేడు వేలాదిమందికి అన్నదానం చేసేవిధంగా ఆరాధనోత్సవాలు జరుపుకుంటున్నాము.

1 comments:

Anonymous said...

go.. get a life man..