అది ఒక పెద్ద కుటుంబము .పండగ వచ్చినదంటే ఇంట్ళో వచ్చినబంధువులతో సందడే సందడి. అలాంటి ఇంట్లో నుంచి కేకలు వినబడుతున్నాయి. ఏమిటయ్యా అబద్దాలాడుతున్నావు . ఒకావిడ గద్దిస్తున్నది.
"లేదమ్మా నేను అబద్దం చెప్పటములేదమ్మా .నేను" ఇంతమందికి ' గాజులు వేశాను అని వివరిస్తున్నాడు గాజుల మలారం అబ్బి.
ఇంట్లో వున్న పిల్లలకంటే నువ్వు ఒకరు ఎక్కువ చెబుతున్నావు. ఆమె కోప్పడుతున్నది.
లేదమ్మా అయ్యగారింట్లో నేనే ఎప్పుడూ గాజులు వేస్తుంటాను .నేనెప్పుడూ అబద్దం చెప్పను వాదిస్తున్నాడతను.
ఇంతలో ఇంటి యజమాను రాలు బయటకు వచ్చి పోనీలేవే , పిల్లల్లో ఎవరన్నా ఆకతాయి తనంగా మరలా వేపించుకుని ఏడిపిస్తున్నారేమోలే .డబ్బులిచ్చి పంపు. అని డబ్బుతీసి ఇచ్చినది.
ఇలాంటి సన్ని వేశము మరలా మరలా ప్రతి పండగకూ ఆడపిల్లలకు గాజులు వేపించినప్పుడల్లా జరుగుతున్నది. గాజులు వేసే వాళ్ళు మారినా ఈ సన్నివేశం మరటం లేదు. ప్రతిసారీ గాజుల వాళ్ళు ఇంతమందికి గాజులు తొడిగాననటము,లెక్కచూస్తే ఇంట్లో వున్న ఆడపిల్లల కంటే ఒకరికి ఎక్కువగా గాజులు తోడిగానని గాజుల వాళ్లు లబలబలాడటము సామాన్యమయి పోయినది. ఇలా కాదని ఒకరోజు ఈసన్నివేశం ప్రత్యక్షమవగానే ఇంటియజమానిని ,అడిగాడు గాజుల వ్యాపారి. అయ్యగారూ ఒక్కరికి ఎక్కువ గాజులు తొడిగానని అబద్దమాడి డబ్బులు తీసుకుంటున్నానని అమ్మగారు వాళ్ళు తిడుతున్నారండి. నేను [ఇంత] మందికి గాజులు వేశానండి సత్యప్రమాణముగా చెబుతున్నా నండి అని బాధపడ్దాడు .
"అవును నువ్వన్నన్తమందికి గాజులు తొడిగావు.నువ్వుచెప్పినది నిజమే అన్నాడా తేజో మూర్తి.
అదెలాగండీ ,మనింట్లో వున్నవాళ్ళు ఇంతమంది ఆడపిల్లలు మాత్రమె ,ప్రతిసారీ వున్నవారికంటే ఒకరికి ఎక్కువచెబుతున్నాడు ఈగాజులశెట్టి ...ఫిర్యాదు చేసినది ఇల్లాలు. అవును నువ్వన్నది కూడా నిజమే ఇప్పుడు ఇంట్లో వున్న ఆడపిల్లలు నువ్వు చెప్పినంతమందే కాని అతను చెప్పినది కూడా నిజమే అన్నారాయన సంతోషముతో నవ్వుతూ. అదెలాగండీ చోద్యం అన్నదావిడ . ఆఒక్క చిన్నారి ఎవరనుకుంటున్నావు ? ఆజగన్మాత: "బాల "పిల్లల తో కలసి ప్రతిసారీ ఇలా వేడుకగా గాజు లేపించుకుంటున్నది ,అని వివరించాడాయన
దైవరహస్యాన్ని.
ఆతపోమూర్తి ,మహాసాధకుడూ, దత్త మూర్తి శిష్యుడూ బాలా ఉపాసకుడయిన చందోలు శాస్త్రిగారు. వారి వారిజీవితములో జరిగిన దైవలీలలను చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. వారి పార్ధివ దేహాన్ని దహనంచేసున్నప్పుడు ఫోటోలు తీయగా ఆ-ఫోటో లో ఒక దివ్యమూర్తి కనిపించటం అది పత్రికలలో వచ్చి సంచలనము కలిగించినవిషయము ఆంధ్రులకు తెలిసినదే. నేను కూడా చదువుకునేటప్పుడు ఆ చాయా చిత్రాన్ని చూశాను. సంపాదిద్దామంటే దొరకలేదు. ఎవరిదగ్గరన్నా వుంటే పంపగలరని ప్రార్ధన.
దైవం ప్రేమ భావం నిండిన మానవ జీవితాలలో ప్రత్యక్షముగా సాక్షాత్కరించి తన లీలా వినోదాలను సాగిస్తున్నదనటానికి ఒక ఉదాహరణ చందోలు శాస్త్రిగారి జీవితము.

3 comments:

పద్మ said...

చందోలు శాస్త్రిగారి గురించి నేను విన్న సంఘటన : కంచి పెద్దస్వాములవారు తెనాలి వైపు ఎప్పుడు వచ్చినా చందోలు తప్పకుండా వచ్చి శాస్త్రిగారిని కలిసి వెళ్ళేవారట. ఒకసారి సమయాభావం వల్ల శాస్త్రిగారిని కలవకుండానే వెళ్తుంటే దారిలో అమ్మవారు బళ్ళని కదలనీకుండా చేశారట. శాస్త్రిగారిని కలవకుండా వెళ్తున్నందుకు ఆగ్రహించేసరికి స్వాములవారు వెనక్కి మరలి చందోలు వచ్చి శాస్త్రి గారిని కలిసి వెళ్ళారట.

durgeswara said...

avunammaa nenu vinnaanu aa samgati

Anonymous said...

dear sir,

Please check this below link to see the photograph and the news clipping of sri sastri garu.

http://2.bp.blogspot.com/_ugAPIsxDPHs/SiirBu5R9QI/AAAAAAAABKA/INzoIhO_JAg/s1600-h/chandOlu_sastri_garu.JPG

ravi prakkash